మరొకరికి జామీన్ ఉన్నందుకు డబ్బులివ్వని మేనేజర్
గొల్లపల్లి: డబ్బులివ్వకుండా బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఆంధ్రా బ్యాంకులో గురువారం ఓ రైతు ఆత్మహత్యకు యత్నిం చాడు. గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లికి చెందిన ఓర్పుల రాయమల్లు గొల్లపల్లి ఆంధ్రాబ్యాంక్‌లో 2013లో ట్రాక్టర్ కోసం రుణం తీసుకున్నాడు. దీనికి వడ్లకొండ చంద్రయ్యను జమానత్‌గా పెట్టుకున్నాడు. కొంత కాలం తర్వాత రాయమల్లు బ్యాంకు అప్పు చెల్లించడం మానేశాడు.
గత జనవరిలో జామీన్‌గా ఉన్న చంద్రయ్య ఖాతాలో పంట డబ్బులు రూ.1.80 లక్షలు జమయ్యాయి. ఈ డబ్బులు ఇచ్చేందుకు అధికారులు రాయమల్లు తీసుకున్న అప్పుకు లింక్ పెట్టారు. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. గురువారం బ్యాంకు వెళ్లినా అదే సమాధానం రావడంతో పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. గమనించిన ఖాతాదారులు అడ్డుకున్నారు. ఏఎస్సై మహిమూద్ అలీ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడారు. చివరకు రూ. 50 వేలు ఖాతాలో ఉంచి మిగిలిన డబ్బులు ఇస్తామని మేనేజర్ హామీ ఇచ్చాడు.
బ్యాంక్‌లో రైతు ఆత్మహత్యాయత్నం
Published Fri, Jun 30 2017 1:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement