గొల్లపల్లి, న్యూస్‌లైన్: అవినీతిపరుల భరతం పడతామంటూ ఓవైపు ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నా రెవెన్యూ శాఖలోని కొందరు ఉద్యోగులు మాత్రం మారడం లేదు. దాడులు చేస్తే చేసుకోండి.. మా కేంటి? అనుకుంటున్నారేమో.. తమ పనితీరు మార్చకోవడం లేదు. ప్రతి పనికీ వెలకట్టి లంచాల కోసం పీడిస్తుండడంతో విసిగివేసారిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఏసీబీ దాడుల్లో అవినీతిపరులు అడ్డం గా దొరికిపోతున్నారు. జిల్లాలో పలు సంఘటనలు మరవకు ముందే గొల్లపల్లి మండలంలో మరో వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. కంప్యూటర్ పహణీ నకల్ కోసం రూ.7వేలు లంచం తీసుకుంటూ గొల్లపల్లి వీఆర్వో మేరుగు శంకరయ్య సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
గొల్లపల్లికి చెందిన అబ్దుల్ రషీద్ 2012లో తన భార్య పేరిట సర్వేనంబరు 545(అ)లో 242 చదరపు గజాల స్థలం కొన్నాడు. అప్పుడే జమాబంది కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి వీఆర్వో గంగాధర్ రూ.4వేలు తీసుకుని మ్యూటేషన్ ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చాడు. కానీ ఇది కంప్యూటర్‌లో నమోదు కాలేదు. సంబంధి త స్థలంలో ఇటీవల ఇల్లు నిర్మించుకున్న రషీద్ రుణం కోసం బ్యాంకులో సంప్రదించాడు. రుణ మంజూరుకు కంప్యూటర్ పహణీ కావాలని బ్యాంకు అధికారులు సూచించారు. దంతో తొ మ్మిది నెలల క్రితం కంప్యూటర్ పహణీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ క్రమంలో వీఆర్వో గంగాధర్ గంగాధర మండలానికి బదిలీ అ య్యాడు. ఆయన స్థానంలో జూన్‌లో రామగుం డం మండల ఈసాలతక్కల్లపెల్లికి చెందిన మేరు గు శంకరయ్య విధుల్లో చేరాడు. ఆయన రషీద్‌ను రూ.11 వేలు డిమాండ్ చేయగా, రూ. 1500 ఇచ్చాడు. మిగిలిన మొత్తం కూడా చెల్లిస్తే నే పని పూర్తి చేస్తానని శంకరయ్య తేల్చిచెప్పా డు. విసిగివేసారిన రషీద్ ఇంకా రూ.7వేలు ఇ స్తానని శంకరయ్యతో ఫోన్‌లో మాట్లాడి వాయి స్ రికార్డు చేసుకున్నాడు. ఇటీవల కరీంనగర్‌లో ఏసీబీ అధికారులను కలిసి విషయం చెప్పాడు. వారి సూచనల మేరకు రషీద్ సోమవారం మధ్యాహ్నం శంకరయ్య గదికి వెళ్లి రూ.7వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి శంకరయ్యను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు.
గతంలో వీఆర్వోగా పనిచేసిన గంగాధర్ రూ.4వేలు తీసుకున్నాడని రషీద్ ఫిర్యాదు చేయగా, విచారించి తగు చ ర్యలు తీసుకోవాలని తహశీల్దార్ రవీందర్‌రాజు కు సూచించారు. ఆయన చర్యలు తీసకోకపోతే తామే చర్యలు తీసుకుంటామన్నారు. వీఆర్వో మేరుగు శంకరయ్య 2008లో రామగుండం మండంలోనే విధుల్లో చేరాడు. అప్పటినుంచే అతడు ప్రతి పనికీ లంచాలు గుంజుతాడనే ఆరోపణలున్నాయి. అయితే తాను రషీద్‌ను డబ్బు లు అడగలేదని, అతడే రూ.7వేలు తీసుకొచ్చి తన బేబులో పెట్టాడని ఏసీబీ ఎదుట శంకరయ్య బుకాయించడం కొసమెరుపు.
ఏసీబీకి మరో ఫిర్యాదు
వీఆర్వో శంకరయ్య తనను కూడా లంచం కోసం వేధిస్తున్నాడని బోనగిరి లింగమూర్తి అనే వ్యక్తి ఏసీబీ డీఎస్పీ ఫిర్యాదు చేశాడు. 2012లో ఆరెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని జమాబందీ కోసం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాని, వీఆర్వో శంకరయ్య రూ.10వేలు అడిగితే.. రూ.7వేలు ఇచ్చానని, మరో రూ.15వేలు ఇస్తేనే పని చేస్తానని వేధిస్తున్నాడని వాపోయాడు.
ఏసీబీ వలలో గొల్లపల్లి వీఆర్వో
Published Tue, Nov 19 2013 6:26 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement