
కేసీకి 2,534 క్యూసెక్కుల నీరు విడుదల
కర్నూలు-కడప (కేసీ) కాలువ ఆయకట్టుకు శుక్రవారం ఉదయం నుంచి 2,534 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కర్నూలు(అర్బన్) : కర్నూలు-కడప (కేసీ) కాలువ ఆయకట్టుకు శుక్రవారం ఉదయం నుంచి 2,534 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సుంకేసుల జలాశయంలో ఈ నెల 12వ తేదీ నాటికి 1.06 టీఎంసీలకు నీటి మట్టం చేరుకోవడంతో ఆ రోజు నుంచి కేసీ ఆయకట్టుకు నీటి విడుదల ఆగిపోయింది.
అయితే తుంగభద్ర డ్యామ్ నుంచి ఈ నెల 9వ తేదీ నుంచి సుంకేసులకు రోజూ 1600 క్యూసెక్కుల నీటిని నీటి పారుదల శాఖ ఎస్‌ఈ ఆర్ నాగేశ్వరరావు కేసీకి విడుదల చేశారు. కాగా కేసీ ఆయకట్టు కింద వేసిన పంటలను కాపాడేందుకు నీటిని వెంటనే విడుదల చేయాలని ఈ నెల 13న నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య రైతులతో కలిసి ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన విషయం విదితమే.