పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఓకే
త్వరలో టీజీఎండీసీ ద్వారా టెండర్లు!
బిడ్డర్ నుంచి పన్నులు, జీఎస్టీ, రాయల్టీ, సెస్ వసూలు ద్వారా రాబడి
పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో అమలు
సాక్షి, హైదరాబాద్: జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని రాష్ట్రంలో అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఆ మేరకు చేసిన సిఫారసుల ఆధారంగా ఒక జలాశయంలో పైలట్ ప్రాజెక్టుగా పూడిక తొలగింపును చేపట్టడానికి అనుమతిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూడికతీత కోసం రాజస్థాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ అర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసింది.
అంటే దీనికోసం ప్రభుత్వం ఖర్చు చేయదు..పైగా ప్రభుత్వానికే ఆదాయం రానుంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) త్వరలో ఏదైనా ఒక జలాశయంలో పూడికతీతకు టెండర్లను ఆహా్వనించి అత్యధిక ధరను కోట్ చేసిన బిడ్డర్‌కు పూడికతీత పనులను అప్పగించే అవకాశం ఉంది. బిడ్డర్ పన్నులు, సెస్, జీఎస్టీ, రాయలీ్టని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపునకు ఇదే మోడల్‌ను అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది.
సగానికి పైగా జలాశయాల్లో భారీగా పూడిక
⇒ రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 భారీ జలాశయాలున్నాయి. సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో భారీగా పూడిక పేరుకుపోయింది.
⇒ జలాశయాల్లో పూడిక పెరగడంతో క్రమంగా అవి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమైన సాగునీటికి, అలాగే తాగునీటి సరఫరాలో సైతం లోటు ఏర్పడుతోంది. పర్యావరణ సమస్యలూ తలెత్తుతున్నాయి.
⇒ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్టు తేలింది.
⇒ దేశంలో పీఎం కిసాన్ సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది.
సిఫారసులు ఇలా..
⇒ జలాశయాలు, డ్యామ్‌లు, ఆనకట్టలు, బరాజ్‌లు, నదులు, కాల్వల్లో పూడికతీత పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రం ఈ మేరకు మినహాయింపు ఇచి్చంది. పూడికతీత ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలి.
⇒ ్శనీటిపారుదల, గనుల శాఖలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పూడికతీత చేపట్టిన రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి.
⇒ సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూడికతీత జరగాలి. వాటి రక్షణ విషయంలో రాజీపడరాదు.
⇒ పూడికతీతలో సారవంతమైన మట్టిని వెలికి తీస్తే రైతాంగానికి ఉచితంగా సరఫరా చేయాలి. రవాణా చార్జీలు రైతులే భరించాలి.
Comments
Please login to add a commentAdd a comment