ఖాజీపురం రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరిబాబు
నెలాఖరులోగా నింపుతాం
Published Sun, Dec 18 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM
- ఆర్‌డబూఎస్‌ఈ హరిబాబు
- ఖాజీపురం రిజర్వాయర్ పరిశీలన
చిప్పగిరి(ఆలూరు): అడుగంటిపోయిన రిజర్వాయర్లను నెలాఖరులోగా నీటితో నింపి పల్లెవాసులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరిబాబు తెలిపారు. అధికారులు, గ్రామ సర్పంచులతో కలిసి ఆదివారం ఆయన రిజర్వాయర్‌ను పరిశీలించారు. నీరు అడుగంటడంతో దాని పరిధిలోని గ్రామాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు స్పందించిన ఎస్‌ఈ పరిశీలనకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న నీటిని ఖాజీపురం, గుమ్మనూరు, కొట్టాల, ఏరూరు, బంటనహాల్ గ్రామాల ప్రజలు తాగేందుకు ఉపయోగించుకోవాలని ఎస్‌ఈ సూచించారు. ప్రస్తుతం చిప్పగిరి వద్ద నిర్మిస్తున్న ఎస్‌ఎస్ ట్యాంకుకునీటిని పంపింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిసెంబర్ ఆఖరులోగా ప్రస్తుతం ఎస్‌ఎస్ ట్యాంకును నింపేందుకు రెండు మోటార్లు, 45 మీటర్ల పైపులైన్ పనులను చేపడతామన్నారు. తదనంతరం చిప్పగిరి, కుందనగుర్తి, దౌల్తాపురం, మద్దికెర, అగ్రహారం గ్రామాలకు ఈ ఎస్‌ఎస్ ట్యాంకుకు పంపింగ్ చేసిన నీటిని సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాక ప్రస్తుతం ఎస్‌ఎస్ ట్యాంకులోకి నీటిని నిల్వ చేసేందుకు చిప్పగిరి గ్రామ సర్పంచు సురేష్‌రెడ్డి దాదాపు రూ.3.50 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. ఆయన వెంట ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రామస్వామి, డీఈ మొహిద్దీన్, ఏఈ సురేంద్రప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు సురేష్‌రెడ్డి, సుధాకర్, కొండాదేవికాశేఖర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement