సాక్షి, కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 5,00,647 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 5,17,502 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 883.40 అడుగులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 206.9734 టీఎంసీలకి చేరింది. శ్రీశైలం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీరు విడుదల చేశారు.
వరదముంపుపై కలెక్టర్ సమీక్ష
గుంటూరు: కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వరదముంపుపై కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదివారం సమీక్షించారు. లోతట్టు గ్రామాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
గోదావరిలో వరద తగ్గుముఖం..
తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. సముద్రంలోకి లక్షా 22 వేల క్యూసెక్కులు, డెల్టా కాల్వకు 10,300 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment