సాక్షి, రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సిరిసిల్ల జిల్లా అనంతగిరి రిజర్వాయర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. అనంతగిరి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా నీటిని విడుదల చేసారని పిటిషనర్ రచనారెడ్డి కోర్టుకు వివరించారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ అమలు సమయంలో అనంతగిరికి నీళ్లు విడుదల చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం అనంతగిరి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పరిహారానికి సంబంధించిన పూర్తి వివరాలు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment