Ananthagiri
-
Ananthagiri Hills: కూల్ వెదర్..హాట్ స్పాట్..
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నగర ప్రజలు, ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు. అందుకు అనువైన ప్రదేశంగా హిల్ స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ట్రెక్కింగ్, రైన్ డ్యాన్స్, వాటర్ ఫాల్స్, ఫైర్ క్యాంప్, అడ్వెంచర్ గేమ్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఇటువంటి సందర్భాల్లో హిల్ స్టేషన్లలో ఫైర్ క్యాంప్‌తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్లు రిస్సార్ట్స్, హోటల్ యాజమాన్యాలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. రానున్నది శీతాకాలం. కాబట్టి ఫిబ్రవరి వరకూ ఈ క్యాంపులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.ఔటర్ చుట్టూ.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందల సంఖ్యలో ఫాం హౌస్‌లు, పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, రిసార్టులు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. రానున్న శీతాకాలంలో సాయంత్రం మంచు కురిసే వేళలో వెచ్చగా ఫైర్ క్యాంప్ కల్చర్ వచ్చే ఐదు నెలలపాటు కొనసాగుతుంది. దీనికి తోడు పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం, ఇతర ఫంక్షన్లు వంటి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఎత్తైన హిల్ స్టేషన్లలో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, వాయు, శబ్ధ కాలుష్యాలకు దూరంగా, ఇతర ఆటంకాలు ఉండని చోటు కోరుకుంటున్నారు. చల్లని వాతావరణంలో.. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలికాచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమొరీస్‌ను పదిలం చేసుకుంటున్నారు.ఆకర్షణగా అనంతగిరి హిల్స్.. హైదరాబాద్ సమీపంలో హిల్ స్టేషన్ అనగానే గుర్తుకొచ్చేది అనంతగిరి హిల్స్. పాల నురగలు కక్కుతూ జాలువారే వాటర్ ఫాల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని కొండలు, ఆ పక్కనే పదుల సంఖ్యలో అత్యాధునిక వసతులతో కూడిన రిసార్ట్స్. ఉదయం లేత సూర్యకిరణాలు తాకుతున్న వేళ ట్రెక్కింగ్, సాయంత్రం చల్లని వాతావరణంలో వెచ్చగా ఫైర్ క్యాంపు, ఆపై రెయిన్ డ్యాన్స్‌లు, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్లు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో అనంతగిరి హిల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రిసార్ట్స్‌కు రోజుకు రూ.3వేల నుంచి రూ.10 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారాంతపు డెస్టినేషన్ హిల్ స్టేషన్‌గా అనంతగిరి వెలుగొందుతోంది.రెండు సీజన్లలో క్యాంప్ ఫైర్.. రానున్న శీతాకాలం ఎక్కువ మంది క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్ అడుగుతుంటారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా క్రీడలు, అడ్వెంచర్ గేమ్స్, రోప్ వే సంబంధిత కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ప్యాకేజీలు మారుతుంటాయి. వేసవిలో వాటర్ స్పోర్ట్స్, రెయిన్ డ్యాన్స్, వర్షాకాలం, శీతాకాలంలో క్యాంప్ ఫైర్‌కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. – పీ.గంగాథర్ రావు, హరివిల్లు రిస్సార్ట్స్ నిర్వాహకులు, వికారాబాద్ఆ వాతావరణం ఇష్టం..చల్లనివాతావరణంలో వెచ్చగా మంట కాగుతూ, పాటలు పాడుకుంటూ డ్సాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. కొడైకెనాల్, కూర్గ్, వయనాడ్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి రిసార్ట్స్ యజమానులే క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసేవారు. బయటకు వెళ్లినప్పుడు ఒత్తిడిని మర్చిపోయి, హాయిగా గడపాలని అనుకుంటాం. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో రాత్రి వేళ చుక్కలను చూసుకుంటూ, స్వచ్ఛమైన వాతావరణంలో మనసుకు హాయిగా ఉంటుంది. – జి.సిద్ధార్థ, ఉప్పల్ -
అనంతగిరి అందాలకు కొత్త సొబగులు
వీకెండ్ వచ్చిందంటే నగరవాసులు బిజీలైఫ్నుంచి ప్రశాంతమైన వాతావరణంలో పొల్యూషన్లేని ప్రదేశంలోకి వెళ్లిపోవాలని ఆరాట పడుతూ ఉంటారు. అటు అధ్యాత్మికం.. ఇటు ఆహ్లదకరమైన వాతావరణం కలగలిపిన పర్యాటక అందాలకు కేరాఫ్ అడ్రస్.హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి జిల్లాలోని అనంతగిరి కొండలు ఎత్తైన కొండలు, లోతైన లోయలు, మలుపులు తిరిగిన రోడ్లు, అలిసిన మనుసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో మంచి పిక్నిక్ స్పాట్ అనంతగిరి కొండలు.. తాజాగా ఈ పర్యాటక అందాలకు మరిన్ని హంగులు అద్దనున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా అనంతగిరి పర్యాటక అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రాజెక్ట్ డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఏకో టూరిజం ప్రాజెక్ట్ లో భాగంగా అటవీ సంపద దెబ్బతినకుండా పర్యాటక అభివృద్ధి చేస్తారు. చెట్లను నరకకుండా.. కొండలను తొలచకుండా ఏకో టూరిజం ప్రాజెక్ట్ పనులు చేపట్టనున్నారు. అడ్వంచరస్ టూరిజంలో భాగంగా ట్రెక్కింగ్, రోప్ వే వంటివి ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి సేదతీరడానికి వస్తుంటారు. వీకెండ్ లో పర్యాటక అందాలను ఎంజాయ్ చేయడానికి బైక్ లపై రయ్... రయ్ మంటూ వచ్చేస్తుంటారు. అనంతగిరి కొండలకు అటు.. ఇటు రెండు సాగు ప్రాజెక్టులు ఉండటం పర్యాటక అభివృద్ధికి మరింత అనుకూలంగా మారింది. ఒక వైపు సర్పన్ పల్లి.. మరోవైపు కోటపల్లి ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్స్ లు, హోటల్స్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ ప్రాజెక్ట్ ల్లో బోటింగ్ వ్యవస్థను ప్రైవేటు సంస్థలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అనంతగిరి అభివృద్ధి కోసం ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. పెద్దసంఖ్యలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా ఇక్కడ నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు. జూ పార్క్ తరహాలో పక్షుల, జంతువుల కోసం 213 ఎకరాలను కేటాయించారు. త్వరలోనే పర్యాటక అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశముంది. అనంతగిరి కొండల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆధ్యాత్మికంగా ప్రశాంతతను పొందవచ్చు. 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ నవాబ్ నిర్మించాడట ఈ ఆలయాన్ని. హైదరాబాద్ నవాబు కలలోకి అనంత పద్మనాభస్వామి వచ్చి టెంపుల్ కట్టమని ఆదేశించడంతో అనంత పద్మనాభ స్వామి దేవాలయం కట్టారనీ అందుకే ఈ ప్రదేశానికిఅనంతగిరి కొండలు అని పేరు వచ్చిందని ప్రతీతి. -
అనంతగిరి అడవుల్లో రేసింగ్ పై స్పందించిన పోలీసులు
-
అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై స్పందించిన పోలీసులు
సాక్షి, వికారాబాద్: అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై పోలీసులు స్పందించారు. రేసింగ్ నిర్వహించిన వారిలో కొందరిని గుర్తించామని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం బందోబస్తులో ఉండటంతో రేసింగ్‌కు పాల్పడ్డారని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ అన్నారు. అనంతగిరి అడవుల్లో జరిగిన కార్, బైక్ రేసింగ్ విన్యాసాలకు సంబంధించిన ప్రాంతానికి వెళ్లి అటవీ శాఖ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరించారు ఒక కారు నంబర్ ను గుర్తించిన అధికారులు.. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్గనైజర్లు, 40 మందితో 16 కార్లు, రేసింగ్ బైకులు తీసుకొచ్చి విన్యాసాలు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతగిరి అడవుల్లోకి వీరిని ఎవరు తీసుకొచ్చారు. ఎవరు సహకరించారనే విషయాలపై విచారణ చేపట్టారు. రేసింగ్‌లో పాల్గొన్న వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. చదవండి: 9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు -
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
అనంతగిరిలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పద్మనాభ స్వామి!
శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన, ఆళ్వార్ల రచనల్లో ప్రస్థావించబడిన, లక్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు సంబందించిన దివ్య దేశాలు 108 కాగా ఇందులో భారత్‌లో ఉన్నవి 105 మాత్రమే, ఒకటి నేపాల్ లో ఉండగా మిగతా రెండు ఈ భూలోకంలో కాదు అక్కడెక్కడో, అల వైకుంఠపురంలో ఉన్నాయంటారు. ఇందులో ఎక్కువ కెక్కువ ఉన్నది తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో. ఆంధ్రప్రదేశ్‌లో నున్న రెండు ఆలయాలు తిరుమల, అహోబిలంలు. భారత్‌లోనే అత్యంత సంపన్నవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభ పెరుమాళ్ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ లెక్కలోకి రాకున్నా హైదరాబాద్‌కు 75 కిమీ దూరంలో వికారాబాద్ అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణంలో మనకూ ఒక అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. ఆది శేషునిపై పవలించిన విష్ణువు, ఎడమ వైపు లక్మీ దేవి కూర్చున్నట్లుగా ఉన్న ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందంటారు. నిజాం ప్రభుత్వం లో ప్రధాన మంత్రిగా ( 18931901)పనిచేసిన నవాబ్ సర్ వికారుల్ ఉమ్రా బహదూర్ జాగీర్ కావడం వల్ల దీనికి ’వికారాబాద్’ అన్న పేరు వచ్చిందట. అంతకు పూర్వం ఇది గంగవరంగా పిలువబడిందట. హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది పుట్టింది వికారాబాద్ అడవుల్లోనే. వికారాబాద్ చల్లటి ప్రాంతం కావడం, అక్కడ లోయలు, కొండలతో మంచి అడవి ఉండడం, వర్షా కాలంలో అందమైన జలపాతాలు ప్రత్యక్ష మవడం వల్ల నిజాం నవాబులు ఆ రోజుల్లోనే దీన్ని విశ్రాంతి కేంద్రంగా వాడుకున్నారట. ఇక్కడున్న వనాలు వాటిలోని ఔషద గుణాలు గమనించి 1946లోనే ఇక్కడ క్షయ వ్యాధిగ్రస్తుల కోసం ఒక టీబీ సానెటోరియం పెట్టడం విశేషం. ఓ సారి అడవుల్లోకి వేటకు వచ్చి అలసిసొలసి పడుకున్న నిజాం (మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ) కలలోకి వచ్చిన స్వామి తన ఆలయాన్ని పునరుద్దరించమన్నాడని, ఆ ఆదేశాన్ని రాజు గారు పాటించారని చెబుతారు. -వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి చదవండి: ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊపిరులూదిన అప్పయ్య బోయీ! -
‘అనంతగిరిసాగర్’ భూసేకరణ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: అనంతగిరిసాగర్ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం రైతులతో బలవంతంగా భూసేకరణ ఒప్పందం చేయించడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. పునరావాసం, పునర్నిర్మాణం పథకం పిటిషనర్లకు లభించకుం డా అధికారులు చేయడం చట్ట వ్యతిరేకమ ని వెల్లడించింది. ‘120 మంది నుంచి భూ మి తీసుకున్నప్పుడు ఉన్న ధర ప్రకారం పరిహారాన్ని తిరిగి నిర్ణయించి చెల్లించాలి. ఇప్పటికే చెల్లించిన పరి హారాన్ని పిటిషనర్ల నుంచి వసూలు చేయకూడదు. అధికారుల బలవంతంతో చేసిన ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండక్కర్లేదు. పిటిషనర్లు ఆర్ఆర్ ప్యాకేజీ పొందడానికి అర్హులు’ అని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. కోర్టును ఆశ్రయించిన 120 మంది.. ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా, ఒప్పంద పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించి అర్ధరాత్రి తమను దౌర్జన్యంగా అధికారులు ఇళ్ల నుంచి ఖాళీ చేయించారంటూ సిద్ది పేట జిల్లా చిన్నకొండూరు మండలం అ ల్లిపురం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామాలకు చెందిన 120 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన కోర్టు.. ఒప్పంద పత్రాలపై పిటిషనర్లతో బలవంతంగా సంతకాలు చేయించడం చె ల్లదని, ఆ ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండాల్సిన అవసరంలేదని తేల్చిచెప్పింది. అధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని ఆక్షేపించింది. సమీపంలోని లింగారెడ్డిపల్లిలో ఎకరాకు రూ. 13 లక్షలు చొప్పున చెల్లించిన ప్రభుత్వం.. తమ భూములకు మాత్రం రూ.6.5 లక్షలు చెల్లించడం అన్యాయమని పిటిషనర్లు లేవనెత్తిన ముఖ్యమైన అంశానికి అధికారుల నుంచి జవాబు లేదంది. ఎకరాకు రూ.6.5 లక్షలు చెల్లిస్తామని పిటిషనర్లతో ఒప్పం దం చేసుకోడానికి కారణాలు చెప్పలేదని, భూపరిహారంపై ఇతరత్రా ఆధారాలు కూ డా చూపలేదని తెలిపింది. అయినా ధర విషయంలో జిల్లా కమిటీ తీర్మానం, మార్కె ట్ ధర ఎంత ఉందో కూడా ప్రభుత్వం చె ప్పలేదని అభిప్రాయపడింది. పిటిషనర్లు ఆర్ఆర్ ప్యాకేజీ, భూమి ఇతరత్రా చట్ట ప్రకారం లభించాల్సిన హక్కులను ఎందుకు వదులుకున్నారో, వాటికి ప్రభుత్వం ప్ర త్యామ్నాయం ఏం ఇస్తోందో కూడా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ప్రస్తావించలేదని ధర్మాసనం తప్పుపట్టింది. ఇది సరికాదు..: కేసు విచారణ సందర్భం గా అడ్వొకేట్ జనరల్ వ్యవహారశైలిని ధర్మాసనం తప్పుపట్టింది. 4 పిటిషన్లల్లో రెండింటిలో కౌంటర్ వేసి మరో రెండింటిని స మయం మించి పోయినా దాఖలు చేయలే దు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాల్సిన కారణంగా పిటిషనర్లను అత్యవసరంగా విచారించాలని ఏజీ కోరారు. తీరా ప్రధాన న్యాయమూర్తి ధ ర్మాసనం మే 11 నుంచి 17 వరకూ లేకపోయేసరికి రోస్టర్ విధానంలో తమ ముందుకొచ్చిన రిట్‌పై విచారణ అత్యవసరం కాద ని ఏజీ చెప్పారు. ఫైళ్లను చదవలేదని చెప్పి విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు పూర్తయిన తర్వాత రోజు మే 14న వా దనలు వినిపిస్తామని ఏజీ చెప్పారు. తీరా 14న ఏజీ లాక్డౌన్ ఎత్తేసే వరకూ వాయిదా వేయాలని మెమో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సహా అన్ని హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్‌లోనే కేసుల్ని విచారిస్తున్నాయి. ఏజీ కూడా ఇదే హైకోర్టులోని ఇతర కోర్టు ల్లో ప్రభుత్వ న్యాయవాదులను పక్కన కూర్చొబెట్టుకుని వాదనలు వినిపించారు. ఈ కేసులో మాత్రం వినిపించలేదు. దీనిపై ధ ర్మాసనం స్పందిస్తూ.. ‘రోస్టర్ పద్ధతిలో కే సు తమ ముందుకు వచ్చేసరికి వాదనలు అత్యవసరం కాదని ఏజీ చెప్పడం సరికా దు. భూసేకరణ కేసుల్లో 6మాసాల్లోగా ఉ త్తర్వులు జారీ చేయాలన్న చట్ట నిబంధనల మేరకు తీర్పు వెలువరిస్తున్నాం.. వీరం దరికీ ఖర్చులుగా ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున చెల్లించాలి’ అని స్పష్టం చేసింది. -
భూ నిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సిరిసిల్ల జిల్లా అనంతగిరి రిజర్వాయర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. అనంతగిరి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా నీటిని విడుదల చేసారని పిటిషనర్ రచనారెడ్డి కోర్టుకు వివరించారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలు సమయంలో అనంతగిరికి నీళ్లు విడుదల చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం అనంతగిరి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పరిహారానికి సంబంధించిన పూర్తి వివరాలు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
అనంతగిరికి ఆఖరి ఘడియలు
సిరిసిల్ల: అనంతగిరి గ్రామం జలసమాధి కాబోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరికి ఆఖరి ఘడియలు సమీపించాయి. ఊరు ఖాళీ చేసేదిలేదని నిర్వాసితులు భీష్మించుకుని కూర్చున్నా.. ఎలాగైనా ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఎస్సీ కాలనీని ముందుగా ఖాళీ చేయించనున్నారు. నిర్వాసితులకు ‘అనంత’కష్టాలు: అనంతగిరిలో 837 కుటుంబాలు ఉన్నాయి. ప్రాజెక్టు ప్యాకేజీలను 735 కుటుంబాలకు అందించారు. మిగతా కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. నిబంధనల మేరకు వీరికి 102 ఇళ్లను అధికారులు అనంతగిరి శివారుల్లో నిర్మించి ఉంచారు. కానీ, ఇప్పుడే నీరు వస్తుందని ఊహించని నిర్వాసితులు.. పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టుకోలేదు. ఇం కా ఎక్కడ ఉండాలో తేల్చుకోలేదు. ఈ క్రమంలో నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారు. ఇవీ సమస్యలు: అనంతగిరిలో 2017 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను కుటుంబాలుగా గుర్తించారు. ఆ జాబితా 1,135కు చేరింది. తంగళ్లపల్లి శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచమ్మ ఆలయం సమీపంలో 70 ఎకరాల్లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. కానీ మౌలిక వసతులు లేవు. ఇప్పటికే 737 కుటుంబాలకు రూ.7.50 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ చెల్లించారు. 250 గజాల స్థలంతో కూడిన ఇంటి స్థలం ఇచ్చారు. నిర్వాసితులతో కలెక్టర్ కృష్ణభాస్కర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం చర్చించారు. తొలుత మంగళవారం 115 దళిత కుటుంబాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. మంగళ వారం ఊరు ఖాళీ చేయగానే, బుధవారం మధ్య మానేరు నుంచి నీళ్లు అనంతగిరిలోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ సమీక్ష మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్ వరకు చేర్చేందుకు అనంతగిరి వద్ద ఎదురవుతున్న ప్రతిబంధకాలపై సీఎంకేసీఆర్ సమీక్షిస్తున్నట్లు సమాచారం. అనంతగిరికి గోదావరి నీళ్లు చేరితే.. మల్లన్నసాగర్ వరకు నీళ్లు వస్తాయని సీఎం అన్నట్లు తెలిసింది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డి తో సీఎం మాట్లాడినట్లు సమాచారం. దీంతో అనంతగిరి నింపేందుకు పనులు సాగుతున్నాయి. -
మూసీపై ప్రభుత్వం ప్రగల్భాలు
సాక్షి, వికారాబాద్: మూసీ నది ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందే తప్ప, ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన గంగానది ప్రక్షాళన స్ఫూర్తితో మూసీ నది ప్రక్షాళనకు ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని మూసీ జన్మ స్థలం వద్ద శనివారం ప్రత్యేక పూజలు చేసి ‘నమామి మూసీ’పేరిట పోరాటాన్ని ప్రారంభించారు. నదికి హారతి ఇచ్చిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ, మూసీ ప్రవహించే ఐదు జిల్లాల్లో ప్రక్షాళన కార్యక్రమం జరిగే వరకు బీజేపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. ఇందులో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ నది కాలుష్య కాసారంగా మారిందన్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని నదిలోకి వదలడంతో పాటు డ్రైనేజీ నీరు కలిసి కంపుగా మారిందని తెలిపారు. 16న బాపూఘాట్, ఆ తర్వాత సూర్యాపేటలో మూసీ ప్రక్షాళన కోసం ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. శనివారం అనంతగిరిలో పుష్కరిణిలో పూజలు చేస్తున్న లక్ష్మణ్ తదితరులు -
కాళేశ్వరానికి.... ‘అనంత’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మిడ్‌మానేరు నుంచి దిగువకు తరలించేందుకు అనంతగిరి గ్రామం తరలింపు అడ్డంకిగా మారింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం కింద పూర్తిగా ముంపునకు గురౌతున్న ఈ గ్రామాన్ని ఖాళీ చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో నీటిని పంపడం సాధ్యం కావడం లేదు. ఈ ఒక్క గ్రామాన్ని తరలిస్తే కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించే అవకాశం ఉండటంతో దీని తరలింపును వేగిరం చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులకు ఆదేశించారు. ఒక్క గ్రామం తరలిస్తే దిగువకు గోదావరి.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే లక్ష్మీ, సరస్వతి, పార్వ తి బ్యారేజీలను పూర్తిగా నింపారు. వీటి దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజీని ప్రస్తుతం నింపుతున్నా రు, ఇప్పటికే బ్యారేజీలో 20.18 టీఎంసీలకు గానూ 13 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఎగువన పార్వతి బ్యారేజీ నుంచి 11,197 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో వారం రోజు ల్లో ఇదికూడా నిండనుంది. వీటి దిగువనున్న మిడ్‌మానేరు రిజర్వాయర్‌ను ఇప్పటికే నింపారు. ఇక్కడ 25.87 టీఎంసీల నిల్వలకు గానూ 20.10 టీఎంసీల నిల్వ ఉంది. వాటర్ ప్రోటోకాల్ ప్రకారం ఇంతవరకే నీటిని నింపి, లీకేజీలు గమనించాక మరో 15 రోజుల తర్వాత పూర్తిగానింపనున్నారు. మిడ్‌మానేరు నుంచి నీటిని అనంతగిరి రిజర్వాయర్‌లోకి తరలించేలా 64.5 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు సిద్ధమయ్యాయి. 12.03 కి.మీల టన్నెల్ పూర్తయింది. అనంతగిరి కింద కొచ్చగుట్టపల్లి, అనంతగిరి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురౌతున్నాయి. ఈ గ్రామాల్లో 2వేల ఎకరాల భూసేకరణతో పాటు సహాయ పునరావాసం కింద వెయ్యి గృహాలను తరలించాల్సి ఉంది. రూ.75కోట్లతో భూసేకరణ ప్రక్రియ చేపట్టి, కొచ్చ గుట్టపల్లిలోని 102 నిర్వాసిత కుటుంబాలను తరలించినా, అనంతగిరిలో మాత్రం పూర్తి కాలేదు. ఇక్కడనుంచి 839 గృహాలను, 1140 కుటుంబాలను తరలించాల్సి ఉన్నా, పునరావాస సాయం పూర్తిగా అంద లేదు. రూ.150 కోట్లకు గాను రూ.100 కోట్లు ఇచ్చి మరో రూ.50కోట్లు చెల్లించలేదు. పునరావాస సాయం అందకపోవడంతో గ్రామంలోనే నిర్వాసితులు ఈ యాసంగిలోనూ సాగుకు సిద్ధమయ్యారు. నీటిని ఎత్తిపోసేందుకు అనంతగిరి గ్రామం ఖాళీ చేయాల్సి ఉందని ప్రాజెక్టు ఇంజనీర్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో దీన్ని పరిశీలించాలని తన కార్యాలయ కార్యదర్శిస్మితా సబర్వాల్‌ను సీఎం ఆదేశించారు. ఇటీవలే అక్కడ పర్యటించిన ఆమె, పునరావాస సాయం కింద రూ.50 కోట్లను విడుదల చేయాలని ఆర్ధిక శాఖను ఆదేశించారు. దీంతో బోర్లకు, బోరు బావుల మోటార్లకు కరెంట్ సరఫరా నిలిపివేయాలని సిరిసిల్లా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా ఉత్తర్వులు జారీ చేశారు. -
వృద్ధ దంపతుల దారుణ హత్య
అనంతగిరి: వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరిగుట్ట అడవుల్లో వృద్ధ దంపతుల మృతదేహాలు కలకలం రేపాయి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు సమీపంలో ఉన్న నందిగామకు చెందిన నవరతన్‌రెడ్డి (76), భార్య స్నేహలతారెడ్డి (72)కి కర్ణాటకలోని హుమ్నాబాద్‌లో 60 ఎకరాల పొలం ఉంది. వీరు అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లి వస్తుంటారు. ఇదిలా ఉండగా ఈనెల 14న వీరు అదృశ్యమైనట్లు హుమ్నాబాద్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం అనంతగిరి గుట్ట కెరెళ్లి ఘాట్ రోడ్డు పక్కన పొదల్లో ఓ శవం ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తుండగా మరో శవం కనిపించింది. అప్పటికే మిస్సింగ్ కేసుపై దృష్టిసారించిన పోలీసులు అదృశ్యమైన వృద్ధ దంపతుల టెంపరరీ కారు డ్రైవర్ సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడ్ని పట్టుకుని అనంతగిరిగుట్టకు వచ్చిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే స్థానిక పోలీసులు అక్కడ ఉన్నారు. మృతుల నగలు, డబ్బుపై కన్నేసిన కారు డ్రైవర్ సతీశ్ వీరిని హతమార్చాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత 12వ తేదీన హైదరాబాద్ నుంచి హుమ్నాబాద్ వెళ్తున్న క్రమంలో తన స్నేహితుడు రాహుల్ సాయంతో కారులోనే ఇద్దరినీ హతమార్చారు. శవాలను అనంతగిరి అడవుల్లో పడేశారు. అనంతగిరికి వచ్చిన హుమ్నాబాద్ పోలీసులు.. స్థానిక పోలీసుల సాయంతో శవాలను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
డబ్బుల కోసం డ్రైవర్ దారుణం
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని అనంతగిరి అడవుల్లో దారుణ ఘటన జరిగింది. డబ్బుల కోసం దంపతులను దారుణంగా హత్య చేశాడు కారు డ్రైవర్. మృతి చెందిన దంపతులు హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్కు చెందిన నవరత్నరెడ్డి, స్నేహలతరెడ్డిలుగా గుర్తించారు. దంపతులు కర్ణాటక హున్మాబాద్ వెళ్తుండగా మరో వ్యక్తి రాహుల్‌తో కలిసి డ్రైవర్ సతీష్ వారిని హతమార్చాడు. నవరత్నరెడ్డి దంపతుల అదృశ్యంపై బుధవారం కేసు నమోదైంది. అనుమానంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. డబ్బుల కోసమే హత్య చేసినట్టు డ్రైవర్ సతీష్ అంగీకరించాడు. -
‘అనంతగిరి’ పై ఐదు గంటల సమీక్ష
ఇల్లంతకుంట: కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్ పనులపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘ సమీక్ష నిర్వహిం చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని ప్రతిమ కంపెనీ క్యాంపు కార్యాలయంలో బుధవారంరాత్రి 11:30 నుంచి గురువారం తెల్లవారుజామున 3:30 గంటల జరిగిన ఈ సమీక్ష లో నీటిపారుదలశాఖ అధికారులు, కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాం ప్రసాద్‌లాల్ పాల్గొన్నారు. అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్ ద్వారా ఈ ఏడాది యాసంగి సీజన్లో ఆయకట్టుకు సాగు నీరందించే దిశగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలను సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ చూపాలని సూచించారు. అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణంతోపాటు, తిప్పాపూర్ సర్జుఫుల్, పంప్‌హౌస్, పనుల జాప్యంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై ఆగ్రహంవ్యక్తం చేశారు. అనంతగిరి కాలువల ద్వారా ప్రతి పల్లెలోని చెరువులు, కుంటలు నింపేలా ప్రణాళికలు రూ పొందించాలని ఆదేశించారు. కుడి, ఎడమ కాలువలకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని సూచిం చారు. పంప్‌హౌస్ పనులు, సర్జుఫుల్, లైనిం గ్, గేట్ల పనుల పురోగతిపై అధికారులను ఆరాతీస్తూ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని హరీశ్ ఆదేశించారు. -
సీడ్‌బాల్స్‌తో అటవీ సంరక్షణ
హరితహారంలో భాగంగా విత్తన బంతుల తయారీతో హరితహారం లక్ష్యం చేరుకునేందుకు గత ఏడాది ఈ పద్ధతిని సర్కారు ప్రయోగించింది. ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ సారి కూడా ఇదే తరహాలో మొక్కలను పెద్దఎత్తున నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తుడడంతో ప్రభుత్వం కూడా ఈ పద్ధతికే మొగ్గు చూపుతోంది. ఈవిధానంతో అడవి శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వికారాబాద్ అర్బ్న్ : నూతనంగా ఏర్పడ్డ వికారాబాద్ జిల్లా విస్తీర్ణంలో 1.1 లక్షల ఎకరాల్లో మాత్రమే అడవులు ఉన్నాయి. భౌగోళికంగా ఇది 14శాతం మాత్రమేనని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీన్ని 37శాతానికి పెంచేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అడవుల శాతాన్ని 37 శాతానికి పెంచేందుకు గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతుంది. ఇందులో భాగంగానే అటవీశాఖ, ఉపాధిహామీ పథకం కింద నర్సరీల్లో మొక్కలు పెంచి అన్నీ గ్రామాలకు అందిస్తున్నారు. ఈ రకంగా అడవి ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో నాటుతున్న మొక్కలు రక్షణ లేక ఎండిపోతున్నాయి. వర్షాలు పుష్కలంగా ఉండి వీటికి నీరు అందించినా ఎండిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అటవీ శాఖ ఆధ్వర్యంలో విత్తన బంతి ప్రయోగాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా సీడ్‌బాల్.. సీడ్ బాల్స్ ప్రయోగాన్ని గత ఏడాది హరితహారంలో అమలుపరిచి విజయం సాధించిన అటవీశాఖ అధికారులు ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున విత్తన బంతులు తయారు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సుమారు లక్ష విత్తన బంతులు తయారు చేసి నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారం ప్రారంభం కాగానే విత్తన బంతులను అన ంతగిరి అడవిలో విసిరేందుకు సిద్ధంగా ఉంచారు. ఈ సీడ్ బాల్స్ ద్వారా చేపట్టే హరితహారం కార్యక్రమంలో యువజన సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను, విద్యార్థులు పాల్గొనేలా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటకలో సత్ఫలితాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశ్రాంత ఐఏఎస్ అ ధికారి అమర్ నారాయణ విత్తన బంతులను ప్ర యోగాత్మకంగా ప్రవేశపెట్టి విజయం సాధించా డు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా గత ఏడాది ఈ పద్ధతి ఫలితాన్ని ఇచ్చింది. జిల్లాలో అటవీ శాతం పెంచేందుకు.. జిల్లాలో అనంతగిరి అటవి శాతాన్ని పెంచేందుకు అటవీ శాఖ అధికారులు సీడ్ బాల్స్ ప్రయోగాన్ని అమలు చేయనున్నారు. అనంతగిరి అటవీ ప్రాంతం 3,700 ఎకరాల వరకు విస్తరించి ఉంది. ఎత్తయిన కొండలు, లోయలతో కూడిన ఈ అనంతగిరిలో కొంత కాలంగా అటవి అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన అనంతగిరి కొండలు నేడు కళ తప్పాయి. దీంతో ఈ ప్రాంతంలో అటవి శాతాన్ని పెంచి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు సీడ్ బాల్ ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారు. అనంతగిరి పర్యాటక కేంద్రానికి వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు.ఆ సమయంలో వారికి విత్తన బంతులు ఇచ్చి విసిరేయించే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనంతగిరిలోని ఫారెస్టు గెస్టహౌస్లో విత్తన బంతులను సిద్ధంగా ఉంచనున్నారు. విత్తన బంతుల తయారీ విధానం.. విత్తన బంతిలో ఉండే విత్తనం పుచ్చిపోకుండా పాడవకుండా ఉండడానికి కారణం బంతి తయారీలో వాడే పదార్థాలే. విత్తన బంతిని తయారు చేయాలంటే స్థానికంగా లభించే విత్తనాన్ని ముందుగా ఎండబెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత వర్మీకంపోస్టు ఎరువు, ఎర్రమట్టి, పశువుల పేడ, గో మూత్రం, బెల్లం, శనగపిండి పదార్థాలు తగినంత నీటిలో మిశ్రమం చేసి చిన్న పాటి లడ్డూల మాదిరిగా తయారు చేసుకోవాలి. ఎండబెట్టిన విత్తనాన్ని లడ్డూ మాదిరి తయారు చేసిన విత్తన బంతి మధ్యలో విత్తనాన్ని ఉంచి గుం డ్రంగా బంతిలా తయారు చేయాలి. ఈ బంతులు నెల నుంచి రెండు నెలల పాటు నిల్వ ఉంటాయి. వర్షాలు కురుస్తున్న సమయంలో విత్తన బంతులను అటవి ప్రాంతంలో, పొలాల వద్ద విసిరేస్తే మొక్కలుగా మొలుస్తాయి. మామూలుగా పెరిగే మొక్కకంటే విత్తన బంతి ద్వారా నాటిన మొక్క త్వరగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాలు అనుకూలం.. అటవీ ప్రాంతం తక్కువగా ఉన్న చోట్ల, బంజరు భూములు, పొలం గట్లు, ప్రభుత్వ భూముల్లో విత్తన బంతులను చల్లాలి. కొద్దిపాటి తేమ, మట్టి ఉన్న భూములను ఎంపిక చేసుకోవాలి. రాయి ఉన్న భూములు పనికి రావు. ఖర్చు తక్కువ.. అటవీశాఖ, ఉపాధి హామీ నర్సరీల్లో పెంచే మొక్కలకు ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఒక్కో మొక్కపై సుమారు రూ. 20 నుంచి రూ. 30వరకు ఖర్చు చేస్తుంది. అయితే విత్తన బంతి ఖర్చుమాత్రం చాలా తక్కువ అవుతుంది. ఒక్కో బంతి తయారీకి కేవలం రూ. 5 లోపే ఖర్చు అవుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
అనంతగిరిలో గవర్నర్ దంపతులు
అనంతగిరి : గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం సాయంత్రం అనంతగిరి గుట్టకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు స్థానిక హరిత రిసార్ట్స్‌లో సేద తీరనున్నారు. టూరిజం, పోలీస్, ఎండోమెంట్ శాఖల అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నమే అనంతగిరికి వచ్చిన ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షించారు. సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ హరిత రిసార్ట్స్‌కు చేరుకున్నారు. అనంతగిరిలోని ప్మదనాభస్వామి ఆలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిసింది. జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, ఎస్పీ అన్నపూర్ణ, డీఆర్డీఓ జాన్సన్, ఆర్డీఓ విశ్వనాథం తదితరులు గవర్నర్ దంపతులకు పూలబొకే, మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. పటిష్ట బందోబస్తు... మూడు రోజుల పాటు గవర్నర్ అనంతగిరిలో ఉంటున్న నేపథ్యంలో పోలీసులు ప టిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిసార్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ అన్నపూర్ణ సెక్యూరిటీని సమీక్షిం చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింలు, డీఎస్పీ శిరీష, పలువురు సీఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. ఏర్పాట్లను సమీక్షించిన డీఐజీ... అనంతగిరికి గవర్నర్ వచ్చిన నేపథ్యంలో డీఐజీ శివశంకర్‌రెడ్డి రిసార్టు వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆఫీసులోని డీజీఆర్బీ, ఎస్బీ, ఐటీకోర్, టీం, వివిధ సెక్షన్లతో పాటు భరోసా సెంటర్, కాన్ఫరెన్స్ హాల్, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన సైబర్ ల్యాబ్‌ను పరిశీలించారు. ఎక్కడ లేని విధంగా మహిళలు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ అన్నపూర్ణ, అడిషనల్ ఎస్పీ నర్సింలులను అభినందించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అనంతగిరి : జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లి హైదర్‌నగర్‌కు చెందిన నాగేందర్‌రెడ్డి(22) బెంగుళూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా గత రెండు సంవత్సరాలు క్రితం తల్లి మరణించింది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంటరిగా మానసికంగా కుంగిపోయిన నాగేందర్‌రెడ్డి ఉద్యోగం చేయడం ఆసక్తి లేదని కొద్దిరోజుల క్రితం ఫోన్ ద్వారా తాతకు సమాచారం అందించాడు. ఈ నెల 9న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సమీప బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు ఎంతకీ ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం వికారాబాద్‌లోని లాలాగూడ సమీపంలోని బ్రిడ్జి సమీపంలో చెట్టుకు ఉరేసుకున్న విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా లభించిన ఆధారాలను బట్టి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు మృతుడి తాత నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
యాసంగికి ‘అనంతగిరి’ నీళ్లు
ఇల్లంతకుంట (మానకొండూర్): వచ్చే యాసం గికి అనంతగిరి రిజర్వాయర్ నీళ్లు అందిస్తామని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం– 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో 3.5 టీఎంసీల రిజర్వాయర్, ఆనకట్ట పనులతోపాటు, తిప్పాపూర్ వద్ద టన్నెల్ నిర్మాణం, సర్జుఫుల్‌లో విద్యుత్ మోటార్ల బిగింపు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతగిరి రిజర్వాయర్ నుంచి పంట కాల్వల ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. రెండేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రికార్డుస్థాయిలో చేపట్టామని, పంప్‌హౌస్‌లు, బ్యారేజీల నిర్మాణం వేగవంతంగా సాగుతోందన్నారు. లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోబోతున్నామని మంత్రి చెప్పారు. మరో 25 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తి చేస్తే అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. అనంతగిరి రిజర్వాయర్‌లో భాగమైన నాన్ ఓవర్ ఫుల్ స్పిల్ వే 3 లక్షల పైచిలుకు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామన్నారు. మరో 14 వేల క్యూబిక్ మీటర్ల పనులు వారంలోగా పూర్తవుతాయని చెప్పారు. 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ జాప్యంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 46 కిలోమీటర్ల దూరం నుంచి నిర్మిస్తున్న విద్యుత్ టవర్ల పనులను వర్షకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని హరీశ్ సూచించారు. తిప్పాపూర్ సర్జుఫుల్‌లో నాలుగు మోటార్ల బిగింపు పనులు ఏకకాలంలో చేపట్టామని, సర్జుఫుల్‌లో గేట్ల నిర్మాణాలను మరో 45–50 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతగిరి నిర్వాసితులు కోరుకున్న విధంగా ప్యాకేజీ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. -
అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ఔషధ మొక్కలకు నిలయమైన అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరిలో ఏర్పాటు చేయనున్న ఆ ఆస్పత్రిలో ఆయుర్వేదం, హోమియో, యునానీ, నేచురో పతి వంటి ప్రత్యామ్నాయ వైద్యసేవలను అందించనున్నారు. అనంతగిరిలో 140 ఎకరాల విస్తీర్ణంలో టీబీ ఆస్పత్రి ఉంది. దీనిలోని 28 ఎకరాలను ఆయుష్ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. రూ.6 కోట్లతో 50 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం మరికొన్ని నిధులను కేటాయించనుంది. టీబీ ఆస్పత్రి పరిధిలో ఉన్న కొన్ని భవనాలను ఆయుష్ ఆస్పత్రికి కేటాయించనున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులతో రక్తపోటు, మధుమేహం, వెన్నునొప్పి, మెడ నొప్పి, కాళ్ల నొప్పుల వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతికూల ప్రభావాలు లేకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు ప్రకృతి వైద్యమే ఉత్తమ మని తాజాగా వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక ఆయుష్ ఆస్పత్రి ఉంది. ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కు వగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అనంతగిరిలో వైద్య శాఖ మరో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. ఔషధ మొక్కల నిలయం... వికారాబాద్ సమీపంలో అనంతగిరి ప్రాంతం లో అడవులు ఉంటాయి. ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితుల్లో ఔషధ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో ఆయు ష్ వైద్య సేవలందిస్తే రోగులకు త్వరగా ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో కొత్త ఆస్పత్రిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే రోగులకు అవసరమైన వసతి ఏర్పాట్లను చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. అనంతగిరి ప్రాంతంలోని కొండల్లో భారీ సంఖ్యలో ఔషధ మొక్కలను నాటాలని అటవీ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. త్వరలోనే ప్రారంభం అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడి టీబీ ఆస్పత్రిలోని భవనాల్లో కొన్నింటిని అప్పగించనున్నారు. వైద్య సేవలకు అవసరమైన ఇతర వసతులను సమకూరుస్తున్నాం. ఇది పూర్తి కాగానే ఆస్పత్రిని ప్రారంభిస్తాం. – ఎ.రాజేందర్‌రెడ్డి, ఆయుష్ డైరెక్టర్ -
660 కిలోల గంజాయి స్వాధీనం
అరకులోయ (విజయనగరం జిల్లా) : అనంతగిరి మండలం దాముకు గ్రామం వద్ద శనివారం ఉదయం పోలీసులు 660 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టుచేశారు. ముందుస్తు సమాచారం మేరకు పోలీసులు దాడిచేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనివద్ద నుంచి 660 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
మద్యం మహమ్మారిపై సమరం
అనంతగిరి(వజ్రపుకొత్తూరు): ఇంటి యజమానులు నిత్యం పూటుగా మద్యం సేవించడం.. గ్రామంలో తగాదాలకు దిగడం.. ఇంటిలో భార్యభర్తల మధ్య ఎడబాట్లు.. ఆర్థిక కష్టాలతో నలిగిపోవడానికి కారణమైన మద్యం మహమ్మారిపై అనంతగిరి, వెంకటాపురం జంట గ్రామాల మహిళలు, యువత సమర శంఖం పూరించారు. మద్యం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. మద్య నిషేధానికి గ్రామ పెద్దలు అంగీకారం తెలపడంతో స్థానిక శివాలయం వద్ద సోమవా రం సమావేశమయ్యారు. నేటి నుంచి మద్యం విక్రయించడానికి వీలులేదంటూ గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టు షాపు నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే మహిళలు పట్టుకుని వారిని పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు. సారా విక్రయాలు జరిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని యువకు లు హెచ్చరించారు. మద్య నిషేధానికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మరడ భాస్కరరావు, మాజీ సర్పంచ్ జి. జోగారావు, ఉంగ భుజింగరావు, అప్పారావు, ఎం.దుర్యోధనరావు, మహిళలు వాణిశ్రీ, విజయ, రాజులు తదితరులు పాల్గొన్నారు. -
60 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు బిహారీలను అరెస్ట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న కారును కూడా సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
అనంతగిరి (విశాఖపట్నం జిల్లా) : కుటుంబ కలహాల నేపథ్యంలో కొట్టంగి పార్వతి(26) అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన అనంతగిరి మండలం పెదకోట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఆలస్యంగా సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలపాలైన మహిళను కుటుంబసభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగానే ఉంది. -
అనంతగిరిలో పులి కలకలం
అనంతగిరి (విశాఖపట్నం) : విశాఖపట్నం అనంతగిరి పరిధిలో పులి సంచరిస్తుందన్న సమాచారంతో విజయనగరం, విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఆనవాళ్ల సేకరణ కోసం శుక్రవారం అనంతగిరి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. రెండు రోజుల క్రితం పులి పిల్ల రైలు కింద పడి గాయపడిందని, అప్పటి నుంచి పులి ఇక్కడే సంచరిస్తోందని స్థానికులు భయపడుతున్నారు. రైల్వే గేట్‌మెన్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు వ్యక్తులకు రెండు రోజుల క్రితం రైలు ప్రమాదంలో ఒక కాలు తెగిపడి మూలుగుతున్న పులిపిల్ల కనపడింది. వెంటనే దాన్ని దగ్గరకు తీసి సపర్యలు చేసి వదిలేశారు. దీంతో దాని తల్లి ఇదే ప్రాంతంలో తిరుగుతోందని.. దాని వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని రైల్వే సిబ్బంది అటవీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం అటవీ అధికారులు రంగంలోకి దిగారు. -
30 కిలోల గంజాయి స్వాధీనం
అనంతగిరి (విశాఖపట్నం) : అక్రమంగా కారులో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో శనివారం సాయంత్రం జరిగింది. ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రానికి స్విఫ్ట్ కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయితో పాటు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.