అనంతగిరి, న్యూస్‌లైన్: వికారాబాద్ పట్టణం సమీపంలోని అనంతగిరిగుట్ట- హైదరాబాద్‌కు చేరువలో ఉండడంతో పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అనంతగిరి అడవిని సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సోమశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
అనంతగిరి అటవీ ప్రాంతం ఆహ్లాదకంగా ఉందన్నారు. సాధ్యమైనంత త్వరలో ఎన్విరాన్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకులు ప్రకృతి దృశ్యాలను తిలకించడానికి వ్యూ పాయింట్, నాలుగు గుఢారాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో గుడారానికి 10 లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు. అనంతగిరిలో కార్తీక మాసంలో పర్యాటకులు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసి ప్లాస్టిక్ వస్తువులు పడేస్తున్నారని, ఇకపై అలా జరగకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసి వన భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యూజర్ చార్జీల ద్వారా పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ ఆఫీజర్ ఏవీ.జోసెఫ్, హైదరాబాద్ కన్‌జర్వేవేటివ్ ఆఫీసర్ రమణారెడ్డి, డీఎఫ్‌ఓ నాగభూషణం, సబ్ డీఎఫ్‌ఓ మాధవరావు, ఎఫ్‌ఆర్‌ఓ శ్రీలక్ష్మి ఉన్నారు.
అనంతగిరిలో ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్
Published Tue, Dec 31 2013 12:53 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement