సాక్షి, హైదరాబాద్: అనంతగిరిసాగర్ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం రైతులతో బలవంతంగా భూసేకరణ ఒప్పందం చేయించడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. పునరావాసం, పునర్నిర్మాణం పథకం పిటిషనర్లకు లభించకుం డా అధికారులు చేయడం చట్ట వ్యతిరేకమ ని వెల్లడించింది. ‘120 మంది నుంచి భూ మి తీసుకున్నప్పుడు ఉన్న ధర ప్రకారం పరిహారాన్ని తిరిగి నిర్ణయించి చెల్లించాలి. ఇప్పటికే చెల్లించిన పరి హారాన్ని పిటిషనర్ల నుంచి వసూలు చేయకూడదు. అధికారుల బలవంతంతో చేసిన ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండక్కర్లేదు. పిటిషనర్లు ఆర్‌ఆర్ ప్యాకేజీ పొందడానికి అర్హులు’ అని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది.
కోర్టును ఆశ్రయించిన 120 మంది..
ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా, ఒప్పంద పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించి అర్ధరాత్రి తమను దౌర్జన్యంగా అధికారులు ఇళ్ల నుంచి ఖాళీ చేయించారంటూ సిద్ది పేట జిల్లా చిన్నకొండూరు మండలం అ ల్లిపురం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామాలకు చెందిన 120 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన కోర్టు.. ఒప్పంద పత్రాలపై పిటిషనర్లతో బలవంతంగా సంతకాలు చేయించడం చె ల్లదని, ఆ ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండాల్సిన అవసరంలేదని తేల్చిచెప్పింది. అధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని ఆక్షేపించింది.
సమీపంలోని లింగారెడ్డిపల్లిలో ఎకరాకు రూ. 13 లక్షలు చొప్పున చెల్లించిన ప్రభుత్వం.. తమ భూములకు మాత్రం రూ.6.5 లక్షలు చెల్లించడం అన్యాయమని పిటిషనర్లు లేవనెత్తిన ముఖ్యమైన అంశానికి అధికారుల నుంచి జవాబు లేదంది. ఎకరాకు రూ.6.5 లక్షలు చెల్లిస్తామని పిటిషనర్లతో ఒప్పం దం చేసుకోడానికి కారణాలు చెప్పలేదని, భూపరిహారంపై ఇతరత్రా ఆధారాలు కూ డా చూపలేదని తెలిపింది. అయినా ధర విషయంలో జిల్లా కమిటీ తీర్మానం, మార్కె ట్ ధర ఎంత ఉందో కూడా ప్రభుత్వం చె ప్పలేదని అభిప్రాయపడింది. పిటిషనర్లు ఆర్‌ఆర్ ప్యాకేజీ, భూమి ఇతరత్రా చట్ట ప్రకారం లభించాల్సిన హక్కులను ఎందుకు వదులుకున్నారో, వాటికి ప్రభుత్వం ప్ర త్యామ్నాయం ఏం ఇస్తోందో కూడా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ప్రస్తావించలేదని ధర్మాసనం తప్పుపట్టింది.
ఇది సరికాదు..: కేసు విచారణ సందర్భం గా అడ్వొకేట్ జనరల్ వ్యవహారశైలిని ధర్మాసనం తప్పుపట్టింది. 4 పిటిషన్లల్లో రెండింటిలో కౌంటర్ వేసి మరో రెండింటిని స మయం మించి పోయినా దాఖలు చేయలే దు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాల్సిన కారణంగా పిటిషనర్లను అత్యవసరంగా విచారించాలని ఏజీ కోరారు. తీరా ప్రధాన న్యాయమూర్తి ధ ర్మాసనం మే 11 నుంచి 17 వరకూ లేకపోయేసరికి రోస్టర్ విధానంలో తమ ముందుకొచ్చిన రిట్‌పై విచారణ అత్యవసరం కాద ని ఏజీ చెప్పారు. ఫైళ్లను చదవలేదని చెప్పి విచారణను వాయిదా వేయాలని కోరారు.
పిటిషనర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు పూర్తయిన తర్వాత రోజు మే 14న వా దనలు వినిపిస్తామని ఏజీ చెప్పారు. తీరా 14న ఏజీ లాక్‌డౌన్ ఎత్తేసే వరకూ వాయిదా వేయాలని మెమో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సహా అన్ని హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్‌లోనే కేసుల్ని విచారిస్తున్నాయి. ఏజీ కూడా ఇదే హైకోర్టులోని ఇతర కోర్టు ల్లో ప్రభుత్వ న్యాయవాదులను పక్కన కూర్చొబెట్టుకుని వాదనలు వినిపించారు. ఈ కేసులో మాత్రం వినిపించలేదు. దీనిపై ధ ర్మాసనం స్పందిస్తూ.. ‘రోస్టర్ పద్ధతిలో కే సు తమ ముందుకు వచ్చేసరికి వాదనలు అత్యవసరం కాదని ఏజీ చెప్పడం సరికా దు. భూసేకరణ కేసుల్లో 6మాసాల్లోగా ఉ త్తర్వులు జారీ చేయాలన్న చట్ట నిబంధనల మేరకు తీర్పు వెలువరిస్తున్నాం.. వీరం దరికీ ఖర్చులుగా ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున చెల్లించాలి’ అని స్పష్టం చేసింది.
‘అనంతగిరిసాగర్’ భూసేకరణ రాజ్యాంగ విరుద్ధం
Published Thu, Jun 4 2020 5:26 AM | Last Updated on Thu, Jun 4 2020 5:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment