Sagar reservoir
-
తెలంగాణకు 8.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో ఈ ముగ్గు రు సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణ యించారు. సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలపై చర్చించారు. సాగర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 510.53 అడుగులు కాగా, 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. అందులో 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటు లో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమా వేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తితో.. మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లో చివరి సారిగా సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టం (ఎండీడీఎల్)ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్‌ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు నిర్ధారించింది. అయినప్పటికీ మే మాసాంతం వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని అప్పట్లో కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన విషయం విదితమే. కాగా కమిటీ నిర్ణయించిన కోటాకు మించి తెలంగాణ ఇప్పటికే 11 టీఎంసీలను వినియోగించుకుంది. ఏపీ కోటా మేరకు వినియోగించుకుంది. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు అదనంగా జలాలను విడుదల చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సాగర్ సీఈ అజయ్‌కుమార్, ఈఈ విజయ్‌భాస్కర్, కృష్ణా బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంది: ఈఎన్సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశానంతరం చెప్పారు. 2 రాష్టాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని వివరించారు. -
తాగునీటి తంటాలు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వేసవి దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు జలమండలి ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణకు దిగింది. నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో డెడ్‌స్టోరేజీ వరకు నీటిని పంపింగ్ చేసేందుకు అత్యవసర మోటార్లు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వేసవిలో తాగునీటి డిమాండ్ పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం సరఫరా చేస్తున్న 565 మిలియన్ గ్యాలన్స్ పర్ డే (ఎంజీడీ)లకు తోడు అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లకు సిద్ధమైంది. మహానగరానికి మంచి నీరు అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజు రోజుకు పడిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 516 అడుగులకు చేరింది. నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తుగా మోటార్లను బిగించి అత్యవసర పంపింగ్‌కోసం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ జలాశయంలో మినహా అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని జలమండలి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సగం వాటా కృష్ణా జలాలదే.. మహానగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరా అవుతున్న తాగునీటిలో సగం వాటా కృష్ణా జలాలదే. నాగార్జున సాగర్ నుంచి నిత్యం 270 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్ సమీపంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి పంప్ హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్‌లోకి గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించే పరిస్థితి ఉండదు. దీంతో సాగర్ నుంచి కష్ణాజలాల అత్యవసర పంపింగ్ తప్పనిసరి. గత ఐదేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలించారు. జలాల తరలింపు ఇలా.. హైదరాబాద్ మహా నగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 565 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103, ఉస్మా¯న్ సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. డెడ్ స్టోరేజీగా హిమాయత్‌సాగర్‌ను ఉంచినప్పటికీ వేసవిలో అవసరాల మేరకు ఈ రిజర్వాయర్ నుంచి పాతనగరానికి నీటిని అందించి కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి నుంచి తరలిస్తున్న 172 ఎంజీడీలో 40 ఎంజీడీలు మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారు. దానిని సైతం నగరానికి తరలించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు.. వేసవిని దృష్ట్యా డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధమైంది. నగరంలో ఇప్పటికే 72 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిమాండ్‌ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం జలమండలి చర్యలు చేపట్టింది. -
ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియపై తమ అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ మరోసారి కేంద్రానికి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ అవసరాలు పోను, మరో 176 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, ఆ నీటిని అనుసంధాన ప్రక్రియలో వినియోగిస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్సారెస్పీ–ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవని, లభ్యత నీటిని వాడుకునేలా ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపింది. గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై మంగళవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ భూపాల్‌సింగ్ నేతృత్వంలోని గవర్నింగ్ బాడీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసింది. ఈ భేటీకి తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని కావేరీకి తరలించేలా చేసిన ప్రతిపాదనలపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోలేని 247 టీఎంసీల నీటిని అనుసంధానం ద్వారా తరలిస్తామని కేంద్రం చెబుతున్నా.. దీనికి ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న విషయాన్ని రాష్ట్ర ఇంజనీర్లు ఎత్తిచూపారు. భవిష్యత్తులో ఇంద్రావతి నీటిని ఛత్తీస్‌గఢ్ వినియోగిస్తే మిగులు జలాలు ఎలా ఉంటాయో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. కాగా, గోదావరిలో మిగులు జలాలే లేవని పునరుద్ఘాటించారు. ఈ దృష్ట్యా గోదావరి–కావేరీ అనుసంధానం కన్నా ముందు మహానది–గోదావరి అనుసంధానం చేయాలని, మహానది నుంచి నీటిని తరలించాకే కావేరీకి నీటిని తీసుకెళ్లాలని వెల్లడించారు. దీంతోపాటు ఈ అనుసంధాన ప్రక్రియలో నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామన్న ప్రతిపాదనను తెలంగాణ తప్పుపట్టింది. సాగర్‌కు ఉన్న నీటి కేటాయింపులు, దాని ఆపరేషన్ ప్రొటోకాల్‌పై ఇంతవరకు స్పష్టత లేదని, దీనిపై ట్రిబ్యునల్ తేల్చాల్సి ఉందని, అది జరగకుండా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడం లేక అటు నుంచి నీటిని తరలించడం సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేసింది. -
‘అనంతగిరిసాగర్’ భూసేకరణ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: అనంతగిరిసాగర్ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం రైతులతో బలవంతంగా భూసేకరణ ఒప్పందం చేయించడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. పునరావాసం, పునర్నిర్మాణం పథకం పిటిషనర్లకు లభించకుం డా అధికారులు చేయడం చట్ట వ్యతిరేకమ ని వెల్లడించింది. ‘120 మంది నుంచి భూ మి తీసుకున్నప్పుడు ఉన్న ధర ప్రకారం పరిహారాన్ని తిరిగి నిర్ణయించి చెల్లించాలి. ఇప్పటికే చెల్లించిన పరి హారాన్ని పిటిషనర్ల నుంచి వసూలు చేయకూడదు. అధికారుల బలవంతంతో చేసిన ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండక్కర్లేదు. పిటిషనర్లు ఆర్ఆర్ ప్యాకేజీ పొందడానికి అర్హులు’ అని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. కోర్టును ఆశ్రయించిన 120 మంది.. ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా, ఒప్పంద పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించి అర్ధరాత్రి తమను దౌర్జన్యంగా అధికారులు ఇళ్ల నుంచి ఖాళీ చేయించారంటూ సిద్ది పేట జిల్లా చిన్నకొండూరు మండలం అ ల్లిపురం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామాలకు చెందిన 120 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన కోర్టు.. ఒప్పంద పత్రాలపై పిటిషనర్లతో బలవంతంగా సంతకాలు చేయించడం చె ల్లదని, ఆ ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండాల్సిన అవసరంలేదని తేల్చిచెప్పింది. అధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని ఆక్షేపించింది. సమీపంలోని లింగారెడ్డిపల్లిలో ఎకరాకు రూ. 13 లక్షలు చొప్పున చెల్లించిన ప్రభుత్వం.. తమ భూములకు మాత్రం రూ.6.5 లక్షలు చెల్లించడం అన్యాయమని పిటిషనర్లు లేవనెత్తిన ముఖ్యమైన అంశానికి అధికారుల నుంచి జవాబు లేదంది. ఎకరాకు రూ.6.5 లక్షలు చెల్లిస్తామని పిటిషనర్లతో ఒప్పం దం చేసుకోడానికి కారణాలు చెప్పలేదని, భూపరిహారంపై ఇతరత్రా ఆధారాలు కూ డా చూపలేదని తెలిపింది. అయినా ధర విషయంలో జిల్లా కమిటీ తీర్మానం, మార్కె ట్ ధర ఎంత ఉందో కూడా ప్రభుత్వం చె ప్పలేదని అభిప్రాయపడింది. పిటిషనర్లు ఆర్ఆర్ ప్యాకేజీ, భూమి ఇతరత్రా చట్ట ప్రకారం లభించాల్సిన హక్కులను ఎందుకు వదులుకున్నారో, వాటికి ప్రభుత్వం ప్ర త్యామ్నాయం ఏం ఇస్తోందో కూడా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ప్రస్తావించలేదని ధర్మాసనం తప్పుపట్టింది. ఇది సరికాదు..: కేసు విచారణ సందర్భం గా అడ్వొకేట్ జనరల్ వ్యవహారశైలిని ధర్మాసనం తప్పుపట్టింది. 4 పిటిషన్లల్లో రెండింటిలో కౌంటర్ వేసి మరో రెండింటిని స మయం మించి పోయినా దాఖలు చేయలే దు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాల్సిన కారణంగా పిటిషనర్లను అత్యవసరంగా విచారించాలని ఏజీ కోరారు. తీరా ప్రధాన న్యాయమూర్తి ధ ర్మాసనం మే 11 నుంచి 17 వరకూ లేకపోయేసరికి రోస్టర్ విధానంలో తమ ముందుకొచ్చిన రిట్‌పై విచారణ అత్యవసరం కాద ని ఏజీ చెప్పారు. ఫైళ్లను చదవలేదని చెప్పి విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు పూర్తయిన తర్వాత రోజు మే 14న వా దనలు వినిపిస్తామని ఏజీ చెప్పారు. తీరా 14న ఏజీ లాక్డౌన్ ఎత్తేసే వరకూ వాయిదా వేయాలని మెమో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సహా అన్ని హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్‌లోనే కేసుల్ని విచారిస్తున్నాయి. ఏజీ కూడా ఇదే హైకోర్టులోని ఇతర కోర్టు ల్లో ప్రభుత్వ న్యాయవాదులను పక్కన కూర్చొబెట్టుకుని వాదనలు వినిపించారు. ఈ కేసులో మాత్రం వినిపించలేదు. దీనిపై ధ ర్మాసనం స్పందిస్తూ.. ‘రోస్టర్ పద్ధతిలో కే సు తమ ముందుకు వచ్చేసరికి వాదనలు అత్యవసరం కాదని ఏజీ చెప్పడం సరికా దు. భూసేకరణ కేసుల్లో 6మాసాల్లోగా ఉ త్తర్వులు జారీ చేయాలన్న చట్ట నిబంధనల మేరకు తీర్పు వెలువరిస్తున్నాం.. వీరం దరికీ ఖర్చులుగా ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున చెల్లించాలి’ అని స్పష్టం చేసింది. -
కొనసాగుతున్న సాగర్ నీటి విడుదల
డ్రోన్ కెమెరాలతో పహారా నాగార్జునసాగర్: సాగర్ నుంచి కుడి కాల్వకు కృష్ణా నీటి విడుదల బుధవారం కూడా కొనసాగింది. ఆవిరి నష్టాన్ని ఇరు రాష్ట్రాలు భరిం చాలని.. ఈ స్పెల్‌లో జరిగిన నష్టాన్ని మాత్ర మే లెక్కలోకి తీసుకుని 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదే శించడంతో ఆ మేరకు విడుదల చేస్తున్నారు. కాగా, నీటి విడుదల అంశంలో ఆంధ్రా, తెలంగాణ అధికారుల మధ్య మంగళవారం చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా విభాగాలు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 511.80 అడుగులు కాగా.. కుడి కాల్వకు 6,536, ఎడమ కాల్వకు 3,758, కృష్ణా డెల్టాకు విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 3,206, ఏఎమ్మార్పీకి 1,453 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి దిగువకు మొత్తం 14,953 క్యూసెక్కుల నీరు విడుదల వుతుండగా.. శ్రీశైలం నుంచి కేవలం 973 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో సాగర్ జలాశయం కనీస నీటిమట్టం 510 అడు గుల కన్నా దిగువకు వెళ్లే ప్రమాదమంది. -
పుట్టీ మునుగుతోంది..
షికారు లేదు.. మరో ఉపాధి తెలియదు ఆకలితో అలమటిస్తున్న మత్స్యకారుల కుటుంబాలు పస్తులుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం విజయపురిసౌత్ : కృష్ణమ్మను నమ్ముకొని.. పుట్టీలనే ఆవాసంగా మార్చుకుని ఏటి ఒడ్డున జీవనం సాగిస్తున్న మత్స్యకారులు నేడు పూట గడవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది సాగర్ జలాశయానికి కొత్తనీరు రాకపోవటంతో చేపల షికారు జరగడం లేదు. రోజు మొత్తం షికారు ప్రభుత్వంవైపు చూస్తున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలో 1.75లక్షల ఎకరాల్లో నాట్లు పడకపోగా, పడినచోట పంటలు ఎండిపోయే దుస్థితి కళ్లకు కడుతున్నా ఈ జిల్లాలో అసలు కరువు మండలమే లేదని ప్రభుత్వం తేల్చేసింది. కరువు కోరలు చాస్తున్నా... కృష్ణా జిల్లాలో ఏటా 8.60 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణంగా ఉంటుంది. దీనిలో 6.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటివరకు 4.64 లక్షల ఎకరాలే సాగు కాగా, మిగిలిన 1.70 లక్షల ఎకరాల్లో అసలు నాట్లు పడలేదు. డెల్టాలోని కాల్వల ద్వారా చివరి ప్రాంతాల్లోని భూములకు నీరు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆగస్టు 15నాటికల్లా సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఆర్భాటంగా ప్రకటించినా నీరు విడుదల కాలేదు. అధికారులేమో సాగర్‌లో నీటిమట్టం తక్కువ ఉందని నీళ్లివ్వలేమని చెబుతున్నారు. 3,200 క్యూసెక్కులు మాత్రమే... ప్రస్తుతం పులిచింతలో 0.9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీనిలో కొంత తాగునీటి అవసరాలకు కేటాయించి మిగిలిన నీటిని సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. రోజుకు 16 వేల క్యూసెక్కులు అవసరంకాగా, 3,200 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. కృష్ణాలో 21 మండలాల్లో వర్షపాతం సైతం తక్కువ నమోదైంది. రాజధాని జిల్లా అనే కారణంతో కృష్ణాను కరువు జిల్లాల జాబితాలోకి చేర్చలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరులో గగ్గోలు... రాష్ట్రప్రభుత్వం రెండో విడత ప్రకటించిన కరువు మండలాల జాబితాలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక్క మండలం కూడా లేకపోవడం వ్యవసాయంపై ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపును స్పష్టం చేస్తోంది. తక్షణం ప్రభుత్వం పునరాలోచన చేయాలని వ్యవసాయ నిపుణులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం సాగునీటి సరఫరా లేక ఎండిపోయిన పంటలను రైతులు దున్నేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. వాస్తవానికి వర్షపాతం, జిల్లా కలెక్టర్ల నివేదిక, పంట దిగుబడి తగ్గుదల తదితర కోణాల్లో కరువు మండలాలను ప్రకటించినట్టు ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే మండల అధికారులు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించకుండా అధికార యంత్రాంగానికి నివేదిక పంపడం వల్లనే జిల్లాలో కరువు మండలాల సంఖ్య పెరగలేదనే అభిప్రాయం ఉంది. పల్నాడులో మిర్చి, పత్తి, ఇతర వాణిజ్య పంటలు సాగునీరులేక ఎండిపోతు న్నాయి. డెల్టాలో పొట్టదశకు చేరుకున్న వరిని కాపాడుకునేందుకు రైతులు కాల్వలోని నీటిని డీజిల్ ఇంజన్లతో తోడి పొలాలు తడుపుతున్నారు. రోజూ అయిదు లేదా ఆరుగంటలు డీజిల్ ఇంజన్లు వినియోగించడంతో ఖర్చులు తడిసిమోపెడై అప్పుల పాలవుతున్నారు. వినుకొండ, మాచర్ల, గురజాల, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాల్లోని పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఎండిపోయిన వరిపొలాలను రైతులు దున్నేస్తున్నారు. నరసరావుపేట రూరల్, రొంపిచర్ల మండలాలు, వినుకొండలోని శావల్యాపురం, నూజెండ్ల మండలాల్లో కరువు పరిస్థితులు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైఎస్సార్ సీపీ వినతి... సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) , గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు రావి వెంకట రమణ, జంగా కృష్ణమూర్తి, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. -
ఎవరో ఇస్తారని..
అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారయ్యింది అన్నదాతల పరిస్థితి. అన్నదాతకు రెండు పంటలకు పూర్తిస్థాయిలో పుష్కలంగా సాగునీరు ఇచ్చేందుకు జలాశయం ఉంది. అయితే ఇరిగేషన్ అధికారుల అంచనాల పెంపుదల..పాలకుల నిర్లక్ష్యపు వ్యవహారం వల్ల అన్నదాతకు ఏటా కష్టాలే మిగులుతున్నాయి. జలాశయం కాలువల్లో అడ్డుకట్ట లేని నీటి ప్రవాహం..ఆ నీటిని నిల్వ చేయడానికి కాలువల్లో కానరాని షట్టర్లు..మరమ్మతుకు నోచుకోని కాలువలు..నిధులు విదల్చని నీటిపారుదలశాఖ..ఇదీ వెంగళరాయ సాగర్ జలాశయం పరిధిలోని రైతుల దీనస్థితి. బొబ్బిలి:వెంగళరాయ సాగర్ జలాశయం ద్వారా ప్రధానంగా మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాలకు సాగునీరు అందుతుంది. 30 ఏళ్లు దాటిన రిజర్వాయర్లను ఆధునికీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిధుల కోసం ప్రతిపాదనలు పంపమని 15 ఏళ్ల క్రితం జపాన్ ప్రభుత్వం కోరింది. దీంతో జిల్లాలోని తాటిపూడి, వట్టిగెడ్డ,వెంగళరాయ సాగర్,పెదఅంకలాం ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ఆ ప్రతిపాదనల్లో చేర్చింది. వీటిలో ఒక్క తాటిపూడికే జపాన్ నిధులు వచ్చాయి. జపాన్ నిధులు అనే ఒకే ఒక్క మాట పట్టుకుని ప్రభుత్వం ఈ జలాశయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పటినుంచి వెంగళరాయ సాగర్ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం ఏటా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉంది. ఏటికేడాది ఇక్కడి అధికారులు కేంద్ర జల వనరుల సంఘానికి ప్రతిపాదనలు పంపడం, అవి అక్కడ మురగడం, మళ్లీ కొత్తవి కావాలని వారు అడగడం, పెంపుదలతో తాజాఅంచనాలు పంపిస్తుండడంతోనే కాలం గడిచిపోతోంది. ఇప్పుడు తాజాగా జపాన్ నిధుల కోసం పంపే ప్రతిపాదనలు రూ.63 కోట్లకు చేరాయి. ఈ జలాశయానికి సంబంధించి ప్రధానకాలువ నుంచి పిల్ల కాలువల వరకూ ఎక్కడా సరైన మరమ్మతులు జరగలేదు. 90 శాతం షట్టర్లు లే కపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. వృథా నీటిని కళ్లారా చూస్తున్న అన్నదాత అడుగడుగునా ఇబ్బందులకు గురవుతున్నాడు. నీరు వృథాగా పోకుండా ఎలాగైనా పొలాలకు మళ్లించాలని అన్నదాత వృథాగా పోతున్న నీటికి ఇసుక బస్తాలతో అడ్డుకట్ట కట్టుకుని నీటి నిల్వకు తాపత్ర య పడుతున్నాడు. కాలువలకు ఉండే రివిట్మెంట్లు జారి నీరు పోతున్నా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. ఇటీవల ఇక్కడ అక్విడెక్టు కూలిపోతే రైతులే ఇంజినీర్ల అవతారం ఎత్తి సొంత నిధులు సమకూర్చుకుని నీటిని వారి ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జపాన్ నిధులు వస్తాయి కదా అని రాష్ర్ట ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వక రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో రెండు పంటలకు ఇవ్వాల్సిన నీటిని కనీసం ఖరీఫ్‌కు కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థితి. అన్నదాతలకు కడుపుమండి ఇరిగేషన్ అధికారుల కార్యా లయాలకు వెళ్లి ఆందోళనలు చేసినా ఫలితం కనిపించడం లేదు. అదనపు జలాల పరిస్థితీ అంతే.. ఇదిలా ఉండగా సాగర్ జలాశయం ద్వారా అదనపు జలాలను రైతులకు ఇవ్వొచ్చు అని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన చేసి శంకుస్థాపన చేసినా జిల్లాకు చెందిన అప్పటి అధికార పార్టీ నాయకుల రాజకీయాలు..అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో అది నేటికీ పూర్తి కాలేదు. 5 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి 2006లో గొల్లపల్లి వద్ద వైఎస్ శంకుస్థాపన చేసి రూ.పది కోట్లు నిధులు ఇచ్చారు. ఆ నిధులను సకాలంలో వినియోగించకపోవడం వల్ల అంచనాలు పెరిగి ఇప్పుడు అది రూ.11కోట్లకు చేరింది. సరే దానితోనైనా పనులు పూర్తవుతాయని అన్నదాత ఆశిస్తే కాంటాక్ట్రర్ల మధ్య విభేదాలు రావడంతో ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయి. వీటిని సరిదిద్దడంలో ఇరిగేషన్ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అదనపు జలాలను హైలెవెల్ కెనాల్ ద్వారా 3, 600 ఎకరాలకు, గొల్లపల్లి లింకు చానల్ ద్వారా 700 ఎకరాలకు, 5ఏఆర్ మైనర్ కాలువ ద్వారా 677 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. వీటికి దాదాపు 40.35 ఎకరాల స్థలం కావాలని గుర్తించారు. వనరులు అందుబాటులో ఉన్నా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. -
చివరికి నీరేది..!
హాలియా :‘అంగట్లో అన్నీ ఉన్నా...అల్లుడి నోట్లో శని ఉన్నట్లు’ ఉంది నాగార్జునసాగర్ ఆయకట్టు చివరి భూముల రైతుల దుస్థితి. సాగర్ జలాశయంలో సమృద్ధిగా నీరు ఉన్నా చివరిభూములకు నీరందని పరిస్థితి నెలకొంది. ఆయకట్టులో నాట్లు తుదిదశకు చేరుకుం టున్న తరుణంలో ఎడమకాల్వపై ఉన్న విద్యుదుత్పాదక కేంద్రంలోకి ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా నీరు చేరింది. దీంతో అదేరోజు నుంచి శనివారం దాకా ఎడమకాల్వకు నీటివిడుదలను నిలిపివేశారు. టర్బైన్ల మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడంతో రెండురోజులుగా నీటివిడుదలను కుదించారు. సగటున 10 వేల క్యూసెక్కుల దాకా విడుదలయ్యే నీరు 2వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో కాల్వల చివరకు నీరెక్కడం లేదు. దీంతో రైతులు నాట్లు వేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎడమకాల్వ పరిధిలో నల్లగొండ జిల్లాలో స్థిరీకరించిన ఆయకట్టు 2.99 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి దాకా 2.35 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఎత్తిపోతల పరిధిలోని 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 40 వేల ఎకరాల్లో నాటు వేశారు. ఎడమ కాల్వకు నీటి విడుదల పెంచాలి జల విద్యుత్ కేంద్రంలోనికి నీరు చేరిందంటూ ఎన్ఎస్పి అధికారులు మూడు రోజులుగా ఎడమ కాల్వకు నీటి విడుదల తగ్గించారు. ఇప్పుడు చివరి కాల్వలకు నీరెక్కలేని పరిస్థితి నాట్లుఎలా వేయాలో అర్థం కావడం లేదు. వెంటనే నీటివిడుదలను పెంచాలి. - అలుగుల రమణారెడ్డి, రైతు, కొత్తపల్లి నాటు ఆగింది ఎడమ కాల్వకు నీటి విడుదల తగ్గించడం వల్ల వరినాటు ఆగిపోయింది. కాల్వ చివరి భూముల రైతుల్లో ఇప్పుడే వరినాట్లు వేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎడమ కాల్వకు నీటివిడుదల తగ్గించడం రైతులకు ఇబ్బందే. విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి వెంటనే మరమ్మతులు చేయాలి. - అల్లి పెద్దిరాజు, రైతు, బోయగూడెం -
ఆరు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నుంచి ఆరు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగులిడుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా నాగార్జునసాగర్ జలాశయానికి 75,400 క్యూసెక్కుల నీరు వస్తోంది. అంతే మోతాదులో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవా రం ఉదయం 10గంటల వరకు నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్లద్వారా 25,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు దేవరకొండ ఉప్పా గు, డిండివాగు, నక్కలపెంట తదితర వాగులు, వంకలు, ఉపనదులు ఉప్పొంగుతుండగంతో సాగర్ జలాశయం నీటిమట్టం పెరిగింది. దీంతో మరో రెండు గేట్లు ఎత్తి మొత్తంగా ఆరు గేట్ల ద్వారా 48,600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. 215.8 టీఎం సీలు. కాగా ప్రస్తుతం 883.80 అడుగుల కు తగ్గించారు. 208.7210 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువనుంచి 58,550 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుం డగా శుక్రవారం సాయంత్రం దిగువకు 57,287 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టంతో కొనసాగుతోంది. ప్రతి అర్ధగంటకోమారు నీటిమట్టాన్ని చూస్తూ దిగువకు నీటిని వదులుతున్నారు. ఎడమకాలువకు నీటి విడుదల నిలిపివేత నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీటి విడుదల తాత్కాలికంగా నిలిపివేశారు. కాలువపై ఉన్న విద్యుదుత్పాదక కేంద్రంలో గురువారం జరిగిన ప్రమాదంలో టర్బైన్లు మునిగాయి. దీంతో విద్యుదుత్పాదక కేంద్రంలోని నీటిని తోడేందుకు గురువారం సాయంత్రం 4 గంటలనుంచి నీటి విడుదల నిలిపివేశారు. శనివారం ఉదయం వరకు అనుమతి తీసుకున్నట్లుగా సాగునీటిశాఖ అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో ఆయకట్టుకు నీటి అవసరాలు తగ్గాయి. దీంతో నీటిని నిలిపివేసినా ఇబ్బంది లేకుండా ఉంది. విద్యుదుత్పాదక కేంద్రంలోని టర్బైన్‌లోకి వచ్చే నీటిని నిలిపివేయడానికి అధికారులు, సిబ్బంది 24గంటలు కృషిచేస్తున్నారు. అయినా ఆ నీరు ఆగడం లేదు. గజ ఈతగాళ్లు నీటిలో మునిగి వేస్ట్కాటన్, రబ్బర్లు అడ్డుపెట్టినా నీరు ఆగడం లేదు. నీరు రావడం తగ్గితేనే ఎడమకాలువకు నీటిని విడుదల చేయడానికి వీలుంటుంది. ఒకవేళ నీటిని విడుదల చేస్తే కాలువలోని నీరు వెనుకకు వచ్చే అవకాశాలుంటాయి. టర్బైన్‌లోకి నీరు రాకుండా చేస్తే అప్పుడు తిరిగి రెండో యూనిట్లో విదుత్ ఉత్పాదన ప్రారంభమవుతుంది. నాగార్జునసాగర్ : ఎడమకాలువపై విద్యుదుత్పాదన కేంద్రంలో నిలిచిపోయిన విద్యుదుత్పాదనను త్వరలో పునరుద్ధరిస్తామని రాష్ట్ర జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. శుక్రవారం ప్రమాదం జరిగిన విద్యుదుత్పాదక కేంద్రాన్ని సందర్శించి విలేకరులతో మాట్లాడారు. అధికారులు ఇంజినీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి నష్టమూ జరగలేదని తెలిపారు. కేవలం ప్రస్తుతం జరిగే విద్యుదుత్పత్తి నిలిచి పోయిందని తెలిపారు. విద్యుదుత్పాదన జరిగే సమయంలో ఓవరాయిలింగ్ పనులేంటని విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వేసవిలోనే టెండర్లు పిలిచామని, ఈ యూనిట్లో ఉన్న టర్బైన్ బోవెన్ కంపెనీదని తెలిపారు. అయితే ఆ కంపెనీ కూడా ప్రస్తుతం లేకపోవడంతో పనిముట్లు దొరకక ఓవరాయిలింగ్‌కు ఆలస్యమైనట్లు చెప్పారు. -
ఆరుగేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నుంచి కృష్ణమ్మ ఆరుగేట్ల ద్వారా పరుగులిడుతోంది. మంగళవారం రాత్రి 10గంటలకు రెండు గేట్లనుంచి నీటిని విడుదలచేసిన అధికారులు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఉపనదుల ద్వారా వచ్చిన వరదలతో సాగర్ జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రం అనూహ్యంగా రెండు పాయింట్లు పెరగడంతో ఆరుగేట్ల నుంచి వదులుతున్నారు. ఆరుగేట్ల ద్వారా దిగువకు 48,600 క్యూసెక్కులనీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ద్వారా కేవలం 32,800 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. క్రస్ట్‌గేట్లను మూసివేశారు. కేవలం విద్యుదుత్పాదన ద్వారా సాగర్ జలాశయంలోకి 51,599 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24గంటల్లో సాగర్ జలాశ యం నుంచి 99,367 క్యూసెక్కుల వరదనీరు భయటకు వెళ్లింది. అంతేమోతాదులో శ్రీశైలం జలాశయం నుంచి వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు( 212.4385 టీఎంసీలు) ఉంది. కాగా గరిష్టనీటిమట్టం 885అడుగులు( 215.8 టీఎంసీలు). సాగర్‌నీటిమట్టం 590అడుగులు. ప్రసుతం గరిష్టస్థాయిలో ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గండతో గేట్లు మూసివేసే అవకాశాలున్నాయి. కొనసాగుతున్న పర్యాటకుల సందడి సాగర్ వద్ద పర్యాటకుల సందడి కొనసాగుతోంది. కృష్ణమ్మ సోయగాలను తనివితీరా చూసేందుకు ైెహ దరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ తదితరప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. -
సాగర్‌పైనే భారం
శావల్యాపురం : మండలంలోని రైతులు వరి నారుమళ్లు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో సాగర్ జలాశయం కళకళలాడుతోంది. దీంతో రైతులు వరి సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. సాగర్ నుంచి నీటి విడుదల ఖాయమని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీళ్లు రాగానే నాట్లు వేసేందుకు వీలుగా బోర్లు, బావులు కింద ఉన్న పొలాల్లో నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. * శావల్యాపురం, బొందిలిపాలెం, మతుకుమల్లి, గుంటిపాలెం, శానంపూడి, కారుమంచి, చినకంచర్ల, వేల్పూరు, పోట్లూరు గ్రామాల్లో బావుల కింద, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు బీపీటీ, ఎన్‌ఎల్‌ఆర్ రకాల వరి నారు పోస్తున్నారు. * జూలై-సెప్టెంబర్ మధ్య ఖరీఫ్ సాగుకు, అక్టోబర్-నవంబర్ మధ్య రబీకి అను కూలంగా ఉంటుంది. * ఆగస్టు నెల సగం గడిచినా సరైన వర్షాలు లేకపోవడంతో సాగు ఆలస్యమైపోతుం దని రైతులు నారుమళ్లు పోస్తున్నారు. * మండలంలో మొత్తం ఏడు వేల హెక్టార్ల సాగుభూమి ఉండగా, సుమారు ఐదు వేల హెక్టార్లు మాగాణి పరిధిలో ఉంది. ప్రధానంగా రైతులు మాగాణిపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. ఇప్పటివరకు మండలంలో కేవలం 500 ఎకరాలకు సరిపడ నారు మాత్రమే పోసినట్టు అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా పత్తి సాగు వైపు మొగ్గు ... * మెట్ట పంటల విషయంలో మండల రైతులు పత్తి, కంది సాగుకు మొగ్గు చూపుతు న్నారు. * ఎక్కువగా పత్తి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. నీటి ఎద్దడి తట్టు కోవడం, నీటి అవసరాలు కూడా తక్కువగా ఉండడంతో పత్తి పంటకు ఆదరణ ఉంది. * ప్రస్తుతం మిర్చికి, కూరగాయల ధరలకు రెక్కలు రావటంతో చిన్న, సన్నకారు రైతులు వంగ, దోస, బెండ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. * ఇప్పటికే రైతులు సాగు చేసిన మెట్ట పంటలకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం జీవం పోసింది. జాగ్రత్తలు పాటించాలి ... నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. సాగర్‌లో నీటిపై ఆశాభావంతో రైతులు నారు పోస్తున్నారు. నీరు అందుబాటులో ఉంటేనే నారుమళ్లు పోయాలి. లేకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది. బీపీటీ వేయాలనుకున్న రైతులు, అగ్గి తెగులు, దోమపోటు దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యం గా బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449, జేజేలు 384 రకాలు మంచి దిగు బడులు ఇస్తాయి. - హరిప్రసాద్, వ్యవసాయాధికారి -
షికారుకు గడ్డుకాలం
- కృష్ణమ్మను నమ్ముకున్న వందలాది కుటుంబాలు - యాభై ఏళ్లుగా ఎదుగూ బొదుగూ లేని జీవితాలు - సాగర్ జలాశయంలో మొన్న మరబోట్లు.. - నేడు వేటపై నిషేధం షికారు సాగక పస్తులుంటున్న మత్స్యకారులు - ఉపాధి లేక వలసలు పోతున్న వైనం ఐదు దశాబ్దాలుగా కృష్ణమ్మనే న మ్ముకున్నారు.. ముంచినా తేల్చినా నీవే దిక్కని ఆ నదీమ తల్లిపైనే భారం వేశారు. నది ఒడ్డే వారికి నివాస స్థలం.. చేపల వేటే జీవనాధారం. ఎర్రటి ఎండను.. ఎముకలు కొరికే చలిని.. తుఫాను తాకిడిని దేన్నీ లెక్క చేయక రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లు కష్టపడినా నాలుగు రాళ్లు వెనుకేసుకోలేక పోయారు. చాలీచాలని సంపాదన తో బతుకీడుస్తున్న వారికి ఈ ఏడాది మరింత గడ్డు పరిస్థితులు దాపురించాయి. వేట సాగక.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పస్తులుంటున్నారు. కనీసం తమకు ఉపాధి హామీ పనులైనా కల్పించాలని వేడుకొంటున్నారు. విజయపురిసౌత్ : పొట్టచేత పట్టుకుని యాబై ఏళ్ల కిందట విశాఖ నుంచి విజయపురిసౌత్‌కు వచ్చిన మత్స్యకార కుటుంబాలు కృష్ణానది ఒడ్డున జీవనం సాగిస్తున్నాయి. సాగర్ జలాశయాన్ని నమ్ముకుని స్థానిక డౌన్‌మార్కెట్, సాగర్ క్యాంప్‌లలో నివసిస్తున్నారు. ప్రభుత్వం అందించే పక్కా ఇళ్లు కూడా మంజూరు కాలేదు. 110 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న జలాశయం చుట్టూ పుట్టీలే నివాసాలుగా నదిలో షికారు(వేట) చేస్తున్నారు. ఏళ్ల తరబడి నిత్యం శ్రమిస్తున్నా వీరి జీవిత గమనంలో మార్పు రాలేదు. రోజు మొత్తం షికారు చేసినా చేపలు చిక్కని దైన్యస్థితి. కుటుంబ పోషణకు తప్పని అప్పులు.. నాగార్జునసాగర్ జలాశయంలో నీరు తగ్గిపోవటంతో పాటు మత్స్యశాఖ రెండేళ్లుగా జలాశయంలో చేపపిల్లలు వదలడం లేదు. దీంతో చేపల షికారు జరగక మత్స్యకారులు కుటుంబపోషణకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వీరు చేపల వ్యాపారుల వద్ద కుటుంబపోషణకు ముందుగానే అడ్వాన్స్‌లు తీసుకొని చేపలను వారికే అమ్ముతుంటారు. ఈ క్రమంలో రెణ్నెల్ల కిందట అటవీశాఖ అధికారులు కృష్ణానదిలో మరబోట్లను నిషేధించారు. ఇది చాలదన్నట్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి నాలుగు నెలల పాటు సాగర్ జలాశయంలో చేపలు పట్టడం నిషేధించారు. షికారు సాగక పస్తులుండలేక పనుల కోసం వలస బాట పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవటంతో పుట్టీలతో సహా వాహనాల్లో తరలిపోతున్నారు. ఇంతటి గడ్డు పరిస్థితి ఎన్నడూ లేదు.. గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన తుపాన్లకు సాగర్ పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చిన వరదలతో జలాశయం నిండింది. ఆ నెల 25వ తేదీన 12 గేట్లెత్తి దిగువ కృష్ణానదిలోకి నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో పైనుంచి మురికినీరు రావడం వల్ల చేపలు గేట్ల ద్వారా చాలా వరకు దిగువ కృష్ణానదిలోకి వెళ్లిపోయాయని మత్స్యకారులు తెలిపారు. పనిలేక ఒక్కపూటైనా కడుపు నింపుకోలేక పోతున్నామని, ఇంతటి చేపల కరువు డ్యాం నిర్మాణం నుంచి రాలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేయాలని, కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం లోనైనా పని ఇప్పించి ఆదుకోవాలని అర్థిస్తున్నారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలి.. సాగర్ జలాశయంలో చేప పిల్లలను వదిలి రెండేళ్లయింది. చేపలు షికారు జరగక వందలాది కుటుంబాలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయినా ప్రభుత్వ అధికారులలో చలనం లేదు. మత్స్యకారులను ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవటం వలనే ఈ దుస్థితి నెలకొంది. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కనీసం ఉపాధి పనులన్నా కల్పించి, ఉచితంగా బియ్యం పంపిణీ చేయకపోతే కాలనీలన్నీ వలసపోయే పరిస్థితి ఉంది. - మైలపల్లి నూకరాజు, కనకదుర్గ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు, విజయపురిసౌత్ గోడకడితే షికారుకు సెలవే.. రెక్కాడితే కానీ డొక్కాడని మేం చేపల షికారు జరగక ఆకలితో అల్లాడిపోతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. డ్యాం భద్రత పేరుతో కృష్ణా జలాశయం ఒడ్డున భద్రత గోడను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే మా పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. జలాశయంలోకి వెళ్లే అవకాశం ఉండదు. డ్యాం అధికారులు జలాశయంలోకి వెళ్లేందుకు మత్స్యకారుల కోసం ఒక గేటును నిర్మించి, సెక్యూరిటీని నియమిస్తే మాకు ఇబ్బందులు ఉండవు. - గరికన మస్సేను, మత్స్యకారుడు, విజయపురిసౌత్