కొనసాగుతున్న సాగర్ నీటి విడుదల
డ్రోన్ కెమెరాలతో పహారా
నాగార్జునసాగర్: సాగర్ నుంచి కుడి కాల్వకు కృష్ణా నీటి విడుదల బుధవారం కూడా కొనసాగింది. ఆవిరి నష్టాన్ని ఇరు రాష్ట్రాలు భరిం చాలని.. ఈ స్పెల్‌లో జరిగిన నష్టాన్ని మాత్ర మే లెక్కలోకి తీసుకుని 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదే శించడంతో ఆ మేరకు విడుదల చేస్తున్నారు. కాగా, నీటి విడుదల అంశంలో ఆంధ్రా, తెలంగాణ అధికారుల మధ్య మంగళవారం చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా విభాగాలు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నాయి.
ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 511.80 అడుగులు కాగా.. కుడి కాల్వకు 6,536, ఎడమ కాల్వకు 3,758, కృష్ణా డెల్టాకు విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 3,206, ఏఎమ్మార్పీకి 1,453 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి దిగువకు మొత్తం 14,953 క్యూసెక్కుల నీరు విడుదల వుతుండగా.. శ్రీశైలం నుంచి కేవలం 973 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో సాగర్ జలాశయం కనీస నీటిమట్టం 510 అడు గుల కన్నా దిగువకు వెళ్లే ప్రమాదమంది.