అనంతగిరి (విశాఖపట్టణం) : అరకు వైపు బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు బొలెరో వాహనం ఢీకొని మృత్యువాతపడ్డాడు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస పట్టణం బ్రాహ్మణవీధికి చెందిన నెక్కల ప్రశాంత్ యాదవ్ శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై అరకు వైపు వెళ్తున్నాడు. అతని వాహనాన్ని అనంతగిరి మండలం బొడ్డచెట్టుకాలనీ వద్ద ఎదురుగా గొర్రెల లోడుతో వస్తున్న బొలెరో పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే చనిపోయాడు.