డబ్లిన్:ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25) కాగా మరొకరిని పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26)గా గుర్తించారు. యువకుల మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్(25) ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్ళాడు.
భార్గవ్ శుక్రవారం(జనవరి31) రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్‌తో పాటు పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెరుకూరి సురేశ్(26) కూడా ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
ఇటీవలి కాలంలో అమెరికా సహా విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల మరణాలు ఎక్కువవడం కలవరం కలిగిస్తోంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు పిల్లలను పంపాలంటే ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. విదేశాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు దుండగుల కాల్పుల్లో విద్యార్థులు చనిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతుండడం వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment