CM YS Jagan Stood By Those Who Are Suffering From Health Problems - Sakshi
Sakshi News home page

నేనున్నానంటూ సీఎం జగన్‌ భరోసా 

Published Tue, Jul 25 2023 4:54 AM | Last Updated on Tue, Jul 25 2023 8:39 AM

CM YS Jagan Mohan Reddy Support helping hand  People - Sakshi

సీఎం జగన్‌కు గోడు వెళ్లబోసుకుంటున్న త్రివేణి

సాక్షి ప్రతినిధి, విజయవాడ/, గుంటూరు, నరసరావుపేట :  అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి నేనున్నానంటూ సీఎం జగన్‌ అండగా నిలిచారు. తలసేమియాతో బాధపడుతున్న విజయవాడకు చెందిన దుర్గాభవానీ, సీతారామ్‌ దంపతులు కుమారుడు గౌతమ్‌వెంకట్, బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన సూర్యఆదిత్యరెడ్డి, ప్రమాదంలో కళ్లు కోల్పో­యి, మానసిక స్థితి సరిగా లేని దుగ్గిరాలకు చెందిన  నాగూర్‌తో పాటు కుమార్తె త్రివేణిలు వెంకటపాలెం వద్ద సీఎం జగన్‌కు గోడు వెళ్లబోసుకున్నారు.

వారి కష్టాలు ఓపికగా విన్న సీఎం.. తక్షణ ఆర్థిక సాయంతో పాటు  మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించా­రు. ఈ మేరకు గంటల వ్యవధిలోని ఆయా జిల్లా­ల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు.  వైద్యం అందిస్తామన్నారు. 

చదవండి: CM Jagan VenkatapalemTour: అమరావతి అందరిదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement