విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు బిహారీలను అరెస్ట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న కారును కూడా సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.