
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని అనంతగిరి అడవుల్లో దారుణ ఘటన జరిగింది. డబ్బుల కోసం దంపతులను దారుణంగా హత్య చేశాడు కారు డ్రైవర్. మృతి చెందిన దంపతులు హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌కు చెందిన నవరత్నరెడ్డి, స్నేహలతరెడ్డిలుగా గుర్తించారు. దంపతులు కర్ణాటక హున్మాబాద్ వెళ్తుండగా మరో వ్యక్తి రాహుల్‌తో కలిసి డ్రైవర్ సతీష్ వారిని హతమార్చాడు. నవరత్నరెడ్డి దంపతుల అదృశ్యంపై బుధవారం కేసు నమోదైంది. అనుమానంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. డబ్బుల కోసమే హత్య చేసినట్టు డ్రైవర్ సతీష్ అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment