హరిత రిసార్ట్‌లో గవర్నర్, అధికారులు
అనంతగిరి : గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం సాయంత్రం అనంతగిరి గుట్టకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు స్థానిక హరిత రిసార్ట్స్‌లో సేద తీరనున్నారు. టూరిజం, పోలీస్, ఎండోమెంట్ శాఖల అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నమే అనంతగిరికి వచ్చిన ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షించారు.
సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ హరిత రిసార్ట్స్‌కు చేరుకున్నారు. అనంతగిరిలోని ప్మదనాభస్వామి ఆలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిసింది. జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, ఎస్పీ అన్నపూర్ణ, డీఆర్‌డీఓ జాన్సన్, ఆర్డీఓ విశ్వనాథం తదితరులు గవర్నర్ దంపతులకు పూలబొకే, మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు.
పటిష్ట బందోబస్తు...
మూడు రోజుల పాటు గవర్నర్ అనంతగిరిలో ఉంటున్న నేపథ్యంలో పోలీసులు ప టిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిసార్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ అన్నపూర్ణ సెక్యూరిటీని సమీక్షిం చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింలు, డీఎస్పీ శిరీష, పలువురు సీఐలు, ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.
ఏర్పాట్లను సమీక్షించిన డీఐజీ...
అనంతగిరికి గవర్నర్ వచ్చిన నేపథ్యంలో డీఐజీ శివశంకర్‌రెడ్డి రిసార్టు వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆఫీసులోని డీజీఆర్‌బీ, ఎస్‌బీ, ఐటీకోర్, టీం, వివిధ సెక్షన్లతో పాటు భరోసా సెంటర్, కాన్ఫరెన్స్ హాల్, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన సైబర్ ల్యాబ్‌ను పరిశీలించారు. ఎక్కడ లేని విధంగా మహిళలు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ అన్నపూర్ణ, అడిషనల్ ఎస్పీ నర్సింలులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment