Governer couple
-
తెలంగాణలో అభివృద్ధి పాలన సాగుతోంది: తమిళిసై
సాక్షి, హైదరాబాద్: 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గవర్నర్ తమిళసై ప్రసంగిస్తూ.. ‘మునుపెన్నడూ లేని విధంగా కొత్త పథకాలను, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలుచేస్తూ అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన ఉద్యమ నాయకుడికే తెలంగాణ రాష్ర్టాన్ని నడిపించే బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రంలో అభివృద్ధి పరిపాలన సాగుతోంది’ అని గవర్నర్ తమిళిసై తెలిపారు. హైదరాబాద్: ప్రగతి భవన్లో నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు ఆయన పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అనంతగిరిలో గవర్నర్ దంపతులు
అనంతగిరి : గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం సాయంత్రం అనంతగిరి గుట్టకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు స్థానిక హరిత రిసార్ట్స్‌లో సేద తీరనున్నారు. టూరిజం, పోలీస్, ఎండోమెంట్ శాఖల అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నమే అనంతగిరికి వచ్చిన ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షించారు. సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ హరిత రిసార్ట్స్‌కు చేరుకున్నారు. అనంతగిరిలోని ప్మదనాభస్వామి ఆలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిసింది. జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, ఎస్పీ అన్నపూర్ణ, డీఆర్డీఓ జాన్సన్, ఆర్డీఓ విశ్వనాథం తదితరులు గవర్నర్ దంపతులకు పూలబొకే, మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. పటిష్ట బందోబస్తు... మూడు రోజుల పాటు గవర్నర్ అనంతగిరిలో ఉంటున్న నేపథ్యంలో పోలీసులు ప టిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిసార్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ అన్నపూర్ణ సెక్యూరిటీని సమీక్షిం చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింలు, డీఎస్పీ శిరీష, పలువురు సీఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. ఏర్పాట్లను సమీక్షించిన డీఐజీ... అనంతగిరికి గవర్నర్ వచ్చిన నేపథ్యంలో డీఐజీ శివశంకర్‌రెడ్డి రిసార్టు వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆఫీసులోని డీజీఆర్బీ, ఎస్బీ, ఐటీకోర్, టీం, వివిధ సెక్షన్లతో పాటు భరోసా సెంటర్, కాన్ఫరెన్స్ హాల్, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన సైబర్ ల్యాబ్‌ను పరిశీలించారు. ఎక్కడ లేని విధంగా మహిళలు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ అన్నపూర్ణ, అడిషనల్ ఎస్పీ నర్సింలులను అభినందించారు. -
పోటెత్తిన తిరుమల
సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 40,345 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనం భక్తులకు 15 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. రద్దీ పెరగటంతో రూ.300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 2గంటలకు నిలిపివేశారు. కాలిబాట భక్తులకు 6గంటల తర్వాత దర్శనం లభించనుంది. శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయంలో అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఈసారి రైతులకు పంట దిగుబడి ఎక్కువగా రావాలని, ఆహార ధాన్యాలకు ఎటువంటి కొరత లేకుండా ఉండాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. నేడు శ్రీవారి పారువేట ఉత్సవం సాక్షి, తిరుమల: తిరుమలలో గురువారం పారువేట ఉత్సవం నిర్వహించనున్నారు. శ్రీనివాసుడు పంచాయుధాలైన శంఖు, చక్ర, గద, ధనుః, ఖడ్గాలను ధరించి వన విహారార్థం వెళ్లి దుష్ట మృగాలను వేటాడి విజయగర్వంతో తిరిగిరావటమే ఈ ఉత్సవ విశిష్టత. ఏటా కనుమ పండుగ రోజు శ్రీవారు పారువేటకు వెళ్తారు. అలాగే, తాయార్లు, మలయప్ప మధ్య వినోద భరితంగా సాగే ప్రణయ కలహోత్సవాన్నీ గురువారం నిర్వహించనున్నారు. వేటకు వెళ్లి వచ్చిన శ్రీవారిని చూసి అమ్మవార్లు కోపగించడం, శాంతించవలసిందిగా అమ్మవార్లను స్వామి ప్రార్థించడం అత్యంత భక్తిరస భరితంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదానికి ఆరో రోజున తిరుమలలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం నుంచి సుప్రభాత సేవను పునఃప్రారంభించారు. ధనుర్మాసంలో సుప్రభాత సేవ కు మారుగా తిరుప్పావై పఠించారు.