సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి హరీష్‌రావు
ఇల్లంతకుంట: కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్ పనులపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘ సమీక్ష నిర్వహిం చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని ప్రతిమ కంపెనీ క్యాంపు కార్యాలయంలో బుధవారంరాత్రి 11:30 నుంచి గురువారం తెల్లవారుజామున 3:30 గంటల జరిగిన ఈ సమీక్ష లో నీటిపారుదలశాఖ అధికారులు, కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాం ప్రసాద్‌లాల్ పాల్గొన్నారు. అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్ ద్వారా ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఆయకట్టుకు సాగు నీరందించే దిశగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏజెన్సీలను సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ చూపాలని సూచించారు. అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణంతోపాటు, తిప్పాపూర్ సర్జుఫుల్, పంప్‌హౌస్, పనుల జాప్యంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై ఆగ్రహంవ్యక్తం చేశారు. అనంతగిరి కాలువల ద్వారా ప్రతి పల్లెలోని చెరువులు, కుంటలు నింపేలా ప్రణాళికలు రూ పొందించాలని ఆదేశించారు. కుడి, ఎడమ కాలువలకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని సూచిం చారు. పంప్‌హౌస్ పనులు, సర్జుఫుల్, లైనిం గ్, గేట్ల పనుల పురోగతిపై అధికారులను ఆరాతీస్తూ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని హరీశ్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment