అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. 65 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి గురువారం రిమాండుకు తరలించారు. సీఐ లచ్చిరాం నాయక్ కథనం ప్రకారం.. వికారాబాద్‌లోని ఇందిరమ్మ కాలనీలో బ్లాక్ నంబర్ 113లో 16వ ఫ్లాట్‌లో వృద్ధురాలు తన కుమారుడితో కలిసి ఉంటోంది. వీరి ఫ్లాట్ ఎదుట గఫార్ అనే వ్యక్తి ఉంటున్నాడు.
శుభకార్యాలకు వంటలు చేసే అతడి వద్ద వృద్ధురాలి కొడుకుతో పాటు పక్కఫ్లాట్‌కు చెందిన ముజాహిద్(20) సహాయకులుగా పనిచేస్తున్నారు. గఫార్ మంగళవారం హైదరాబాద్‌కు వెళ్తూ తన ఫ్లాట్ తాళపుచెవిని పక్క బ్లాక్‌లో ఉన్న ముజాహిద్‌కు ఇచ్చాడు. రాత్రి వృద్ధురాలు, ఆమె కొడుకు వేర్వేరు గదుల్లో నిద్రించారు. ముజాహిద్ గఫార్ ఫ్లాట్‌లో టీవీ చూస్తూ ఉండి పోయాడు. అర్ధరాత్రి సమయంలో ముజాహిద్ వృద్ధురాలిని గఫార్ ఫ్లాట్‌లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.
వృద్ధురాలు బుధవారం విషయాన్ని తన కొడుకుకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గురువారం ఉదయం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ముజాహిద్‌పై కేసు నమోదు చేసి గురువారం రిమాండుకు తరలించారు.
వికారాబాద్‌లో దారుణం
Published Fri, Aug 22 2014 12:19 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement