జిల్లా పోలీసుల కోసం ప్రత్యేకంగా వికారాబాద్‌లోని డీటీసీ వద్ద ఏర్పాటుచేసిన గ్యాస్ గోడౌన్‌ను శుక్రవారం రాష్ట్ర డీజీపీ బీ. ప్రసాదరావు ప్రారంభించారు.
అనంతగిరి, న్యూస్‌లైన్: జిల్లా పోలీసుల కోసం ప్రత్యేకంగా వికారాబాద్‌లోని డీటీసీ వద్ద ఏర్పాటుచేసిన గ్యాస్ గోడౌన్‌ను శుక్రవారం రాష్ట్ర డీజీపీ బీ. ప్రసాదరావు ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన డీజీపీకి ఐజీ, డీఐజీ, ఎస్పీ, సబ్ కలెక్టర్ తదితరులు పూల బొకేలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏఆర్ పోలీసులకు విశ్రాంతి కోసం మెన్ బ్యారక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఏఎస్పీ నివాసంలో సిబ్బంది ఉండేందుకు అదనపు గదిని డీజీపీ ప్రారంభించారు. అనంతరం అనంతగిరి గుట్టలోని హరిత రిసార్ట్స్‌లో భోజనం చేసిన డీజీపీ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ శశిధర్‌రెడ్డి, ఎస్పీ రాజకుమారి, సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఏఎస్పీ వెంకటస్వామి, ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, డీటీసీ డీఎస్పీ బుచ్చయ్య, వికారాబాద్ డీఎస్పీ నర్సింలు, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.