అనంతగిరి (విశాఖపట్నం జిల్లా) : కుటుంబ కలహాల నేపథ్యంలో కొట్టంగి పార్వతి(26) అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన అనంతగిరి మండలం పెదకోట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఆలస్యంగా సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలపాలైన మహిళను కుటుంబసభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగానే ఉంది.