Married Woman Attempted For Suicide In Madanapalle, Details Inside - Sakshi
Sakshi News home page

సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం.. వివాహిత..

Published Fri, Dec 30 2022 12:46 PM | Last Updated on Fri, Dec 30 2022 1:36 PM

Married woman Commits suicide attempt in Madanapalle - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, అన్నమయ్య(మదనపల్లె): సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం చేశాడని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం పట్టణంలో జరిగింది. స్థానిక తొట్లివీధిలో ఉంటున్న మహబూబ్‌బాషా కుమార్తె షాహీనా(30)కు కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఏడాదిక్రితం కదిరికి చెందిన అమీన్‌ ఆమెకు పరిచయమయ్యాడు.

పరిచయం కాస్తా ప్రేమగా మారి కదిరిలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఈక్రమంలో అమీన్‌ తల్లిదండ్రులకు విషయం తెలియడం, షాహీనాను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించడంతో ఆమె అక్కడి నుంచి మదనపల్లెలోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం ఫినాయిల్‌ తాగింది. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చదవండి: (బద్వేలులో దారుణం.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement