అనంతగిరి మండలం చిలకలగెడ్డ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విశాఖపట్నం జిల్లా పోలీసులు బుధవారం ఉదయం పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. వారిని అనంతగిరి పోలీసు స్టేషన్కు తరలించారు.
అలాగే నిందితులకు సంబంధించిన వాహనాలను పోలీసులు స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 20 కేజీల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.