తాండవలో పెరుగుతున్న నీటి మట్టం | Tandava, Reservoir increasing water | Sakshi
Sakshi News home page

తాండవలో పెరుగుతున్న నీటి మట్టం

Published Wed, Aug 3 2016 12:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

Tandava, Reservoir increasing water

  • మంగళవారం సాయంత్రానికి 363 అడుగులకు చేరిక 
  • నీటి విడుదలపై త్వరలో తాండవ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సమావేశం 
  • స్పష్టం చేసిన డీఈ రాజేంద్రకుమార్‌ 
  • నాతవరం : వరుసగా కురుస్తున్న వర్షాలతో తాండవ రిజర్వాయర్‌లో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోందని డీఈ రాజేంద్రకుమార్‌ అన్నారు. తాండవ రిజర్వాయరు నీటి మట్టాన్ని ఆయన పరిశీలించారు. రిజర్వాయర్‌ గట్టుపై సైడ్‌ వాల్స్‌ పనుల్ని పరిశీలించి నాణ్యతతో చేయాలన్నారు. నిబంధనలు ఉల్లఘించి నాణ్యత లేని సామగ్రి వాడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏకైక మేజర్‌ ప్రాజక్ట్‌ తాండవ రిజర్వాయర్‌లో  గత నెలలో నీటి మట్టం దయనీయంగా ఉండేదని, సాగుకు నీరందిస్తామె లేదోనన్న బెంగ ఉండేదన్నారు. వారం వ్యవధిలో రిజర్వాయర్‌లో ఎనిమిది అడుగుల నీరు పెరిగిందన్నారు. మంగళవారం సాయంత్రానికి 363 అడుగులుందని, ఇన్‌ఫ్లో నీరు అధికంగా వస్తుందన్నారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నెల రెండో వారంలో తాండవ డిస్ట్రిబ్యూటర్‌ కమిటి సమావేశం నిర్వహించి నీటి విడుదల ఎప్పుడనేది అయకట్టుదారులకు తెలియుజేస్తామన్నారు. తాండవ అయకట్టు పరి«ధిలో ఉన్న రైతులంతా ఖరీఫ్‌ సాగుకు వరినారులు సిద్ధం చేసుకోవచ్చనన్నారు. ఇంతవరకు తాండవ నీటి విడుదలపై అయోమయంలో ఉన్నామని, వాతావరణ పరిస్దితులు అనుకూలించడంతో నీటి మట్టం పెరుగుతోందని, ఈ సీజన్‌కు నీరు ఇవ్వవచ్చనే ధీమాకు వచ్చామన్నారు. నీరు విడుదల చేసే సమయానికి రిజర్వాయర్‌ గట్టుపై సైడ్‌వాల్స్‌తో పాటు విద్యుత్‌ పనులు కూడా పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement