tandava
-
ఆమె డ్రీమ్ గర్ల్ మాత్రమే కాదు, నాట్య మయూరి కూడా..! (ఫోటోలు)
-
నవరాత్రుల టైంలో చేసే ఆరోగ్య తాండవం!
నవరాత్రి సందర్భంగా దాండియా ఆడటం సంప్రదాయం. చేతిలో కోలాటం కర్రలతో ఆడటమే ‘దాండియా’. కాని కర్రలు లేకుండా చేసే నృత్యం కూడా గుజరాత్ తోపాటు ఉత్తర భారతంలో అంతే ప్రముఖమైనది. దాని పేరు ‘గర్బ’. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు చేసే ఈ నృత్యం కేవలం పారవశ్య తాండవమే కాదు ఆరోగ్య తాండవం అని కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ‘గర్బ’ అనే మాట ‘గర్భ’ నుంచి వచ్చింది. స్త్రీ శక్తికి చిహ్నం గర్భధారణం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జీవశక్తికి ప్రాణం పోసే స్త్రీ శక్తిని సూచించేందుకు గుజరాత్ అంతా ‘గర్బ’ నృత్యం చేస్తారు. దాండియా అంత విస్తృతంగానే గర్బ కూడా ఆడతారు. అందులో కర్రలు ఉంటాయి. ఇందులో ఉండవు. కాని గర్బ నృత్యం శరీరానికి చాలా మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా 9 రోజుల పాటు స్త్రీలు ఈ నృత్యం చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు. కేలరీల ఖర్చు గంటసేపు గర్బ డాన్స్ చేయడం వల్ల 300 నుంచి 500 కేలరీలు ఖర్చవుతాయి. అంతే కాదు, శరీరాంగాలకు ఇందులో గొప్ప వ్యాయామం లభిస్తుంది. ఈ నృత్య భంగిమల వల్ల భుజాలు, మెడ, వీపు, మోకాళ్లు బాగా కదిలి కండరాలన్నీ చైతన్యంలోకి వస్తాయి. సునీల్ బఫ్నా అనే ఆరోగ్య నిపుణుడి ప్రకారం గంట సేపు గర్బ చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి ఒక ప్రశాంత స్థితి వస్తుంది. గర్బ చేసే సమయంలో శరీరం ఎండార్ఫిన్స్‌ను విడుదల చేయడమే ఇందుకు కారణం. అదీగాక ఇది బృందంతో చేసే నృత్యం కాబట్టి మనతో పాటు ఒక సమూహం ఉంది అనే భరోసా మనసుకు లభించి మంచి అనుభూతి కలుగుతుంది. అందుకే నవరాత్రుల సమయంలోనే కాదు సంవత్సరం పొడగునా గర్బా డ్యాన్స్ చేయమని ఫిట్నెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. గుండెకు మంచిది గర్బలో ఆధ్యాత్మికత ఉంది. నృత్యం ద్వారా చేసే ఆరాధన కనుక దీనిని చేయడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో చప్పట్లతో, సంగీతానికి తగినట్టుగా లయ కలిగిన కదలికలు ఉంటాయి కనుక అవన్నీ గుండెకు, నృత్య సందర్భంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం పెరుగుతుంది కనుక ఊపిరితిత్తులకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్బ ఆధ్యాత్మిక, ఆరోగ్య తాండవం. (చదవండి: అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..) -
సీఎం జగన్‌కు రుణపడి ఉంటా: ఆర్.నారాయణమూర్తి
సాక్షి, అమరావతి: ఏలేరు–తాండవ కాలువల అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేయడం ద్వారా సీఎం జగన్.. రైతుల్లో సంతోషం నింపారని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం జగన్ ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఏలేరు–తాండవ అనుసంధానం పనులు చేపట్టారని ప్రశంసించారు. ‘సాక్షి’తో నారాయణమూర్తి మాట్లాడుతూ.. గోదావరి నది ప్రవహించే తూర్పుగోదావరి జిల్లాలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని చెప్పారు. ఏలేరు–తాండవను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్‌కు ప్రతిపాదన చేయగా.. ఆయన వెంటనే ఆమోదించారని వివరించారు. ఈ అనుసంధానం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, విశాఖ జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కోట ఊరుట్ల మండలాల ప్రజలతో పాటు తాను కూడా సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. ఈ పనులకు రూ.470 కోట్లు మంజూరు చేసేందుకు సహకరించిన మంత్రులు అనిల్ యాదవ్, కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: వైఎస్సార్ ఈఎంసీకి కేంద్రం పచ్చజెండా ప్రగతి పథంలో 'పల్లెలు'.. అభివృద్ధి పరుగులు -
‘వైఎస్సార్ జయంతి రోజు మర్చిపోలేని అనుభూతి’
సాక్షి, విశాఖపట్నం : దశాబ్ద కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో సహకార చక్కెర కర్మాగారం రైతులు ఇబ్బందులు పడ్డారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రిగా తన బాధ్యత నెరవేర్చారని ప్రశంసించారు. కాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని వైఎస్సార్ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల రూపాయల పాత బకాయిలను కూడా సీఎం జగన్ విడుదల చేశారు. ('మాది ఎన్నటికి రైతుల పక్షపాతి ప్రభుత్వమే') మంత్రి అవంతి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రైతు పక్షపాతిగా మరోసారి చరిత్రలో నిలిచిపోయారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన జయంతి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చారని అవంతి శ్రీనివాస్ కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనాలు దగ్గర నుంచి పంట ఉత్పత్తి కొనుగోలు వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుండటం హర్షనీయమన్నారు.(‘ఆయన పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది’) ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 5 వేల మందికి పైగా రైతులకు 10 కోట్ల రూపాయలు, తాండవకు చెందిన 4 వేల మంది రైతులకు సంబంధించి 9 కోట్ల రూపాయల బకాయిలు విడుదలయ్యాని తెలిపారు. రెండు చక్కెర కర్మాగారాలు బకాయిల చెల్లింపుకు నిధులు విడుదల చేయడం మాములు విషయం కాదని, బకాయిల చెల్లింపు తో మళ్ళీ చెరకు సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (అందుబాటులోకి 21 సంజీవని బస్సులు) టీడీపీ హయాంలో సహకార చక్కెర కర్మాగారాలు నడవలేని స్థితిలో ఉండేవని యలమంచలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు విమర్శించారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బకాయిలను సెటిల్ చేయడం రైతులు ఊహించుకోలేదన్నారు. కాగా తాండవ, ఏటికొప్పాక రైతులకు ఈ రోజు ఎంతో పవిత్రమైన, అదృష్టమైన రోజు అని పాయకరావుపేట ఎమ్యెల్యే గొల్ల బాబురావు అన్నారు. -
తాండవలో పెరుగుతున్న నీటి మట్టం
మంగళవారం సాయంత్రానికి 363 అడుగులకు చేరిక నీటి విడుదలపై త్వరలో తాండవ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సమావేశం స్పష్టం చేసిన డీఈ రాజేంద్రకుమార్ నాతవరం : వరుసగా కురుస్తున్న వర్షాలతో తాండవ రిజర్వాయర్‌లో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోందని డీఈ రాజేంద్రకుమార్ అన్నారు. తాండవ రిజర్వాయరు నీటి మట్టాన్ని ఆయన పరిశీలించారు. రిజర్వాయర్ గట్టుపై సైడ్ వాల్స్ పనుల్ని పరిశీలించి నాణ్యతతో చేయాలన్నారు. నిబంధనలు ఉల్లఘించి నాణ్యత లేని సామగ్రి వాడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏకైక మేజర్ ప్రాజక్ట్ తాండవ రిజర్వాయర్‌లో గత నెలలో నీటి మట్టం దయనీయంగా ఉండేదని, సాగుకు నీరందిస్తామె లేదోనన్న బెంగ ఉండేదన్నారు. వారం వ్యవధిలో రిజర్వాయర్‌లో ఎనిమిది అడుగుల నీరు పెరిగిందన్నారు. మంగళవారం సాయంత్రానికి 363 అడుగులుందని, ఇన్‌ఫ్లో నీరు అధికంగా వస్తుందన్నారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నెల రెండో వారంలో తాండవ డిస్ట్రిబ్యూటర్ కమిటి సమావేశం నిర్వహించి నీటి విడుదల ఎప్పుడనేది అయకట్టుదారులకు తెలియుజేస్తామన్నారు. తాండవ అయకట్టు పరి«ధిలో ఉన్న రైతులంతా ఖరీఫ్ సాగుకు వరినారులు సిద్ధం చేసుకోవచ్చనన్నారు. ఇంతవరకు తాండవ నీటి విడుదలపై అయోమయంలో ఉన్నామని, వాతావరణ పరిస్దితులు అనుకూలించడంతో నీటి మట్టం పెరుగుతోందని, ఈ సీజన్‌కు నీరు ఇవ్వవచ్చనే ధీమాకు వచ్చామన్నారు. నీరు విడుదల చేసే సమయానికి రిజర్వాయర్ గట్టుపై సైడ్‌వాల్స్‌తో పాటు విద్యుత్ పనులు కూడా పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. -
ప్రాణం తీసిన మొబైల్ చాటింగ్
ఫోన్లో చాటింగ్ చేస్తూ రైలు నుంచి జారిపడిన యువకుడు యలమంచిలి: ఫోన్ చాటింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. రైలు ద్వారం వద్ద కూర్చోని మొబైల్లో చాటింగ్ చేస్తూ జారిపడిన హరీష్(21) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ డి.రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తాండవ గ్రామానికి చెందిన వేగి హరీష్ కుమార్ విశాఖలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి విశాఖ నుంచి రైలులో బయలుదేరాడు. రాత్రి 7 గంటల తర్వాత ఇంటికి ఫోన్‌చేసి తాను వస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిపాడు. ఆ తర్వాత ఫోనులో చాటింగ్ చేస్తూ యలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో కొక్కిరాపల్లి రైల్వేగేటు వద్ద జారిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం పక్కనే యువకుడి మొబైల్ ఫోన్ తుని రైల్వే పోలీసులకు లభించింది. అతని వద్ద రైలు టిక్కెట్ దొరకకపోవడంతో ఏ రైలు నుంచి జారి పడ్డాడో తెలియలేదు. ఘటనా స్థలానికి తుని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ డి.రామకృష్ణ, సిబ్బంది చేరుకొని మృతదేహం వద్ద పడి ఉన్న సెల్‌ఫోన్‌లోని నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి యలమంచిలి చేరుకుని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు.