Increasing water
-
తాండవలో పెరుగుతున్న నీటి మట్టం
మంగళవారం సాయంత్రానికి 363 అడుగులకు చేరిక నీటి విడుదలపై త్వరలో తాండవ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సమావేశం స్పష్టం చేసిన డీఈ రాజేంద్రకుమార్ నాతవరం : వరుసగా కురుస్తున్న వర్షాలతో తాండవ రిజర్వాయర్‌లో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోందని డీఈ రాజేంద్రకుమార్ అన్నారు. తాండవ రిజర్వాయరు నీటి మట్టాన్ని ఆయన పరిశీలించారు. రిజర్వాయర్ గట్టుపై సైడ్ వాల్స్ పనుల్ని పరిశీలించి నాణ్యతతో చేయాలన్నారు. నిబంధనలు ఉల్లఘించి నాణ్యత లేని సామగ్రి వాడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏకైక మేజర్ ప్రాజక్ట్ తాండవ రిజర్వాయర్‌లో గత నెలలో నీటి మట్టం దయనీయంగా ఉండేదని, సాగుకు నీరందిస్తామె లేదోనన్న బెంగ ఉండేదన్నారు. వారం వ్యవధిలో రిజర్వాయర్‌లో ఎనిమిది అడుగుల నీరు పెరిగిందన్నారు. మంగళవారం సాయంత్రానికి 363 అడుగులుందని, ఇన్‌ఫ్లో నీరు అధికంగా వస్తుందన్నారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నెల రెండో వారంలో తాండవ డిస్ట్రిబ్యూటర్ కమిటి సమావేశం నిర్వహించి నీటి విడుదల ఎప్పుడనేది అయకట్టుదారులకు తెలియుజేస్తామన్నారు. తాండవ అయకట్టు పరి«ధిలో ఉన్న రైతులంతా ఖరీఫ్ సాగుకు వరినారులు సిద్ధం చేసుకోవచ్చనన్నారు. ఇంతవరకు తాండవ నీటి విడుదలపై అయోమయంలో ఉన్నామని, వాతావరణ పరిస్దితులు అనుకూలించడంతో నీటి మట్టం పెరుగుతోందని, ఈ సీజన్‌కు నీరు ఇవ్వవచ్చనే ధీమాకు వచ్చామన్నారు. నీరు విడుదల చేసే సమయానికి రిజర్వాయర్ గట్టుపై సైడ్‌వాల్స్‌తో పాటు విద్యుత్ పనులు కూడా పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. -
‘పోచారం’లోకి చేరుతున్న కొత్తనీరు
29వైఎల్లార్233 : ప్రాజెక్టులో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– నాగిరెడ్డిపేట : రెండేళ్లుగా చుక్కనీరు చేరని పోచారం ప్రాజెక్టులోకి ప్రస్తుతం స్వల్పంగా కొత్తనీరు వచ్చి చేరుతోంది. ఎగువప్రాంతంలో కురిసిన వర్షానికి నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి క్రమక్రమంగా కొత్తనీరు వచ్చిచేరుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్టు ఎగువప్రాంతమైన గాంధారి, తాడ్వాయి, లింగంపేట మండలాల్లో కురిసిన వర్షంతో రెండురోజులుగా లింగంపేట వాగు ద్వారా వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు చుక్కనీరు లేకుండా ఎండిపోయిన ప్రాజెక్టు గేట్ల వద్ద నీటిమట్టం శుక్రవారం సాయంత్రం నాటికి మూడుఫీట్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.82 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.0514 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ ఏఈ కేశవరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 0.155 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోందని ఆయన చెప్పారు. -
ఎస్ ఆర్ ఎస్ పి కి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
బాల్కొండ : శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌లోకి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్‌పూర్తి స్థాయి నీటి మట్టం 1091అడుగులు(90 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1069.50 అడుగుల(27.56 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.