‘పోచారం’లోకి చేరుతున్న కొత్తనీరు
‘పోచారం’లోకి చేరుతున్న కొత్తనీరు
Published Fri, Jul 29 2016 11:14 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
29వైఎల్లార్233 : ప్రాజెక్టులో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
నాగిరెడ్డిపేట : రెండేళ్లుగా చుక్కనీరు చేరని పోచారం ప్రాజెక్టులోకి ప్రస్తుతం స్వల్పంగా కొత్తనీరు వచ్చి చేరుతోంది. ఎగువప్రాంతంలో కురిసిన వర్షానికి నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి క్రమక్రమంగా కొత్తనీరు వచ్చిచేరుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్టు ఎగువప్రాంతమైన గాంధారి, తాడ్వాయి, లింగంపేట మండలాల్లో కురిసిన వర్షంతో రెండురోజులుగా లింగంపేట వాగు ద్వారా వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు చుక్కనీరు లేకుండా ఎండిపోయిన ప్రాజెక్టు గేట్ల వద్ద నీటిమట్టం శుక్రవారం సాయంత్రం నాటికి మూడుఫీట్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.82 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.0514 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ ఏఈ కేశవరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 0.155 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోందని ఆయన చెప్పారు.
Advertisement
Advertisement