చేర్యాల(వరంగల్): రిజర్వాయర్‌ను చూడటానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా చేర్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎల్లాయపల్లికి సమీపంలోని విజయలక్ష్మి మెమోరియల్ పాఠశాల పీఈటీ 19 మంది విద్యార్థులను తిగుళ్లనర్సాపూర్‌లో జరుగుతున్న పాఠశాలల క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకెళ్లారు. అనంతరం వారంతా కలసి సమీపంలోని వరంగల్ జిల్లా టపాస్‌పల్లి జలాశయం వద్దకు వెళ్లారు.
మొత్తం అయిదుగురు విద్యార్థులు నీళ్లలోకి దిగగా అదుపుతప్పి మునిగిపోయారు. వారిలో రంగస్వామి అనే విద్యార్థికి ఈదటం వచ్చు. అతడు ఇద్దరు విద్యార్థులను ఒడ్డుకు లాగగా ప్రవీణ్, నత్తలి అనే వారు మాత్రం మునిగిపోయారు. సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో ఒకరి మృతదేహాన్ని గత ఈతగాళ్లు వెలికి తీశారు. పవీణ్ స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండ కాగా, నత్తలిది రంగారెడ్డి జిల్లా కత్బుల్లాపూర్ గ్రామం.