సీలేరు, న్యూస్‌లైన్ : సరిహద్దులో ఉన్న రిజర్వాయర్‌లకు ముప్పు ముంచుకొస్తోంది. తుపాను ప్రభావం జోలాపుట్టు, డుడుమ, బలిమెల, సీలేరు, డొంకరాయి వంటి రిజర్వాయర్‌లపై పూర్తిగా పడనుంది. విద్యుత్ ఉత్పత్తి జరగక ఇప్పటికే ప్రమాద స్థాయిలో ఉన్న జలాశయాలకు ఫైలిన్ తుపాను మరింత నష్టాన్ని చేకూర్చనుంది. సమ్మెతో విజయవాడ, నాగర్జునసాగర్, శ్రీశైలం విద్యుత్కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సీలేరు, డొంకరాయి, మోతుగూడెం కేంద్రాల్లో నాలుగు రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
దీంతో ఇప్పటికే ఆయా రిజర్వాయర్లలో ప్రమాద స్థాయిలో మూడు,నాలుగు అడుగుల తేడాతో పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గురువారం జోలాపుట్‌లో రెండు గేట్లు ఎత్తివేసి సీలేరు జలశయానికి నీటిని విడుదల చేశారు. ఈ తుపాను ప్రభావంతో ఇవి మరింత నిండి కొట్టుకుపోయే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దిగువన ఉన్న జలవిద్యుత్కేంద్రాలు సమ్మెలో ఉండడంతో బలిమెల నుంచి తీసుకోవాల్సిన నీటిని నిలిపేశారు.
బలిమెల గరిష్ట నీటిమట్టం1514 అడుగులకు ఇప్పుడు 1510 అడుగులకు చేరింది. జోలాపుట్టులో 2750కి 2747.8 అడుగుల నీటి మట్టం ఉంది. ఒడిశా నుంచి నీరు తీసుకోనప్పటికీ సీలేరులో 1360 అడుగులకు గురువారం సాయంత్రానికి 1347.8 అడుగుల నిల్వ ఉంది. ప్రస్తుతం ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరగకపోయినా దిగువున ఉన్న డొంకరాయి జలాశయం మరింత ప్రమాదంలో ఉంది. సాధారణ వర్షాలకే ఈ జలాశయం ఉప నదుల ద్వారా తరచూ ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. దీని గరిష్ట నీటిమట్టం 1037 అడుగులకు 1035.2 అడుగులకు చేరింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయకుంటే రిజర్వాయర్‌లకు ముప్పు వాటిల్లి గేట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఉగ్ర ‘తాండవ'౦
నాతవరం, న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు తాండవనది ఉప్పొంగడంతో తాండవ ఏటి అవతల గల 14 పంచాయతీలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కొండగెడ్డలు, వాగులు పొంగడంతో వాహనాలతో పాటు నిత్యావసర సరుకులు తరలించే అవకాశం లేకుండా పోయింది. చమ్మచింత, గుమ్మిడిగొండ, చిక్కుడుపాలెం వద్ద బోట్ల సాయంతో కూడా నది దాటడానికి అవకాశం లేకుండా పోయింది. గురువారం మధ్యాహ్నం కొందరు బోట్లపై నదిని దాటేందుకు సాహసించినా మధ్యలో బోటు బోల్తాపడడంతో స్థానికుల సహాయంతో అతికష్టంపై ఒడ్డుకు చేరుకున్నారు. తాండవ రిజర్వాయర్‌లో గురువారం సాయంత్రానికి రెండు అడుగుల నీటిమట్టం పెరిగింది. ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌లోకి ఇంకా వచ్చి చేరుతోంది. మరోవైపు కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం తహశీల్దారు వి.వి.రమణ, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తాండవ రిజర్వాయర్‌ను సందర్శించి లోతట్టు ప్రాంతంలో వున్న జాలరిపేటవాసులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఉధృతి తగ్గని కోనాం
చీడికాడ, న్యూస్‌లైన్ : మండలంలోని కోనాం జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయిలో కొనసాగుతోంది. భారీగా నీరు చేరడంతో ఈ రిజర్వాయరు నీటిమట్టం 100 మీటర్లకు చేరుకోవడంతో బుధవారం రాత్రింతా 300 క్యూసెక్కుల నీటిని బొడ్డేరులోకి విడుదల చేశారు. గురువారం కోనాంలో సంత కారణంగా జలాశయం ఆవల గ్రామాల గిరిజనులు జలాశయం గేట్లు దిగువ కాజ్‌వే దాటి వస్తుంటారు. దీన్ని దృష్ఠిలో ఉంచుకొని ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలను భారీగా తగ్గించారు. కానీ ఇన్‌ఫ్లో తగ్గకపోవడంతో జలాశయం నీటి మట్టం 100మీటర్లు దాటి పోయింది. దీంతో గురువారం రాత్రికి మరోసారి నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ ఏఈ చంద్రశేఖర్ చెప్పారు.
మునిగిన వరి పంట
మాడుగుల, న్యూస్‌లైన్ : భారీ వర్షా ్డలకు పల్లపు ప్రాంతా ల్లో ఉన్న ఘాట్‌రోడ్డు, జె.డి.పేట, ఒమ్మలి, ఎం.కోడూ రు గ్రామాల్లో సుమా రు వంద ఎకరాల్లో వరిపంట నీట ముని గిందని రైతులు తెలిపారు. ఈ ఏడా ది ఖరీఫ్ వరినాట్లు ఆలస్యంగా వేశారు. దీంతో వరిచేలన్నీ పొట్ట దశకు చేరుకున్నాయి. ఇంతలో అధిక వర్షాలకు బుధవారం నుంచి వరిచేలన్నీ నీట మునిగాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.