వీబీఆర్‌కు జలకళ
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ జలకళతో కళకళలాడుతోంది. నాలుగేళ్ల తరువాత మొదటిసారిగా వీబీఆర్‌లో 14 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కృష్ణా జలాలు భానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి వీబీఆర్‌కు వెయ్యి క్యూసెక్కులు, గాలేరు నుంచి 1719 క్యూసెక్కలు బుధవారం వచ్చి చేరినట్లు తెలుగు గంగ జేఈ విజయ్‌కుమార్ తెలిపారు. వీబీఆర్‌లో 263.260 మీటర్ల వద్ద 863.712 అడుగుల నీటిమట్టంతో 14.550 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన వివరించారు. వీబీఆర్ నుంచి చైన్నై కాల్వకు 350 క్యూసెక్కులు, వన్‌ఆర్ తూమ్ నుంచి 20, వన్‌ఎల్ తూమ్ నుంచి 15 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉన్నట్లు జేఈ తెలిపారు. వీబీఆర్ పూర్తి సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.550 టీఎంసీల నీరు చేరడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.