అసలే ఎండాకాలం. నీటి ఎద్దడి సమస్యను చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. డబ్బుల లాగే నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. నీటిని కానీ ఓ అధికారి తన సెల్‌ఫోన్ కోసం ఏకంగా రిజర్వాయర్‍లోని నీటిని బయటకు ఎత్తిపోశారు. తన స్వార్థం కోసం వందల ఎకరాలకు సాగునీరు అందించే నీటిని వృథా చేశాడు. ఏం అని ప్రశ్నిస్తే.. ఆ నీరు వాడుకకు పనికిరానిదని, కలెక్టర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నాడు. అసలు ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో చుద్దాం..
చత్తీస్‌గఢ్ రాష్ట్రం కంకారా జిల్లాలోని కొల‍్లిబేడ ప్రాంతానికి చెందిన రాజేశ్ విశ్వాస్ ఆహార ధాన్యాల సరాఫర శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెలవు దినాన్ని సరదాగా గడపడానికి ఖేర్‌కట్ట డ్యామ్‌కు వచ్చారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో తన రూ.లక్ష విలువైన స్మార్ట్‌ఫోన్ రిజర్వాయర్‌లో జారిపడింది. స్థానిక ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
డ్యామ్ దాదాపు 15 అడుగుల లోతు ఉంటుందని, నీరు 10 అడుగుల లోతు ఉన్నాయని భావించారు. దీంతో 30హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను మూడు రోజులపాటు ఉపయోగించి 21 లక్షల లీటర్ల నీటిని నీటిని ఎత్తిపోశారు. గత సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడిపోశారు. ఈ నీటితో దాదాపు 1500 ఎకరాల సాగుకు ఈ నీరు అందించవచ్చు. చివరికి స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన నీటివనరుల శాఖ అధికారులు ఆ ప్రక్రియను నిలుపుదల చేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోసినట్లు అధికారులు చెప్పారు.
అయితే చివరికి రాజేష్‌కు తన ఫోన్ లభించింది. కానీ అది మూడు రోజులు వాటర్‌లో ఉండటం వల్ల పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనంతరం శుక్రవారం సదరు అధికారిని సస్పెండ్ చేశారు.దీనిపై స్పందించిన నెటిజన్లు ఫుడ్ ఆఫీసర్‌పై మండిపడుతున్నారు. ఒక ఫోన్ కోసం వందల ఎకరాలకు ఉపయోగపడే నీటిని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి విలువ తెలిసిన వారు ఇలా చేయరని హితవు పలుకుతున్నారు. అతనిని చట్టం ప్రకారం శిక్షించాలని సూచిస్తున్నారు.
చదవండి: Video: విద్యార్థుల ముందే ఓ రేంజ్‌లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు
దీనిపై ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్ మాట్లాడుతూ.. ‘నేను స్నేహితులతో డ్యామ్‌లో ఈతకొట్టడానికి వెళ్లాను. ఈ క్రమంలో ఫోన్ నీటిలో పడిపోయింది. అందులో అధికారిక సమాచారం ఉంది. ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నాలుగు అడుగుల మేర నీటిని ఎత్తిపోస్తే ఫోన్‌ను కనిపెట‍్టోచ్చని అన్నారు. దీంతో స్థానిక నీటి వనరుల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాను. నా ఫోన్ దొరికింది. ఈ నీరు సాగుకు పనికి రాదు. నా చర్య వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు.’ అని తెలిపారు.
మరోవైపు రాజేశ్ విశ్వాస్ అనే అధికారికి తాము ఎలాంటి రాతపూర్వక అనుమతి ఇవ్వలేదని నీటి వనరుల అధికారులు పేర్కొన్నారు. కేవలం వర్బల్‍గానే అనుమతి పొందారని తెలిపారు. నాలుగు అడుగుల మేర నీటిని మాత్రమే ఎత్తిపోయడానికి అనుమతి ఇచ్చామని, అంతకంటే ఎక్కువ నీటిని ఎత్తిపోశారని అధికారులు తెలిపారు.
#Chhattisgarh के अंतागढ़ में फूड इंस्पेक्टर ने अपना मोबाइल खोजने के लिए बहा दिया परलकोट जलाशय का 21 लाख लीटर पानी!
— कुलदीप नागेश्वर पवार Kuldeep Nageshwar Pawar (@kuldipnpawar) May 26, 2023
फोन मिल गया फूड इंस्पेक्टर का कहना है - उन्होनें कुछ गलत नहीं किया, वहीं मंत्री @amarjeetcg कार्रवाई की बात कह रहे है।@ZeeMPCG @mohitsinha75 @RupeshGuptaReal pic.twitter.com/c0qcPpOUrd
Comments
Please login to add a commentAdd a comment