అవుకులో స్టూడెంట్ నెంబర్-1
అవుకులో స్టూడెంట్ నెంబర్-1
Published Mon, Feb 27 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
అవుకు : స్థానిక రిజర్వాయర్ కట్టపై సోమవారం సినిమా షూటింగ్ జరిగింది. శ్రీలక్ష్మీనరసింహ బ్యానర్‌పై స్టూడెంట్ నెంబర్-1 సినిమాను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు రవికిరణ్ తెలిపారు. హీరో, హీరోయిన్లుగా కృష్ణచైతన్య, కల్కిమిశ్రా నటిస్తున్నారు. హీరో, హీరోయిన్‌లపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు నిర్మాత కేఎల్‌ఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ కొత్త కావడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
Advertisement
Advertisement