
మల్లన్నసాగర్, డిండి ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష
కాళేశ్వరం, మల్లన్నసాగర్, డిండి ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: కాళేశ్వరం, మల్లన్నసాగర్, డిండి ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు హారీశ్ రావు, జగదీశ్ రెడ్డితో పాటూ పలువురు అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సమాంతరంగా ఎల్లంపల్లి ద్వారా నీటిని మళ్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు. మల్లన్న సాగర్ నుంచి బస్వాపూర్ వరకు నిర్మించే రిజర్వాయర్ల ద్వారా గొలుసుకట్టు చెరువులకు నీటిని తరలించాన్నారు. ప్రతి చెరువు కలకలలాడేలా గ్రామాలకు నీటి తరలింపు ప్రక్రియ ఉండాలని కేసీఆర్ తెలిపారు.
మల్లన్న సాగర్ ద్వారా ఉత్తర, దక్షిణ తెలంగాణకు అవసరాన్ని బట్టి నీటి పంపిణీ చేయాలన్నారు. రెండేళ్లలోపే మల్లన్న సాగర్కు నీరు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. డిండి ప్రాజెక్టు డిజైన్లను కేసీఆర్ పరిశీలించారు. డిండి ద్వారా నల్లగొండలోని కరువు ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ,చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాలకు సాగునీరు అందించాని కేసీఆర్ తెలిపారు. మంపు తక్కువగా ఉండేలా నిర్మాణం చేపట్టాలని సమవేశంలో నిర్ణయించారు.