డిండి ప్రాజెక్టు పనులు ప్రారంభం
రూ.6500 కోట్ల నిధులు విడుదల
దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు,
సాగులోకి రానున్న 3.50 లక్షల బీడు భూములు
మర్రిగూడ : జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా జిల్లాలో డిండి ఏత్తిపోతల పథకమును చేపట్టింది. ఈ రిజర్వాయర్ ఏర్పాటు కోసం గత ఏడాది జూను 12న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేసిన 18 నెలల తర్వాత ప్రభుతవం పనులు ప్రారంభించింది.దీని కింద జిల్లాలో 5 రిజర్వాయర్ల ఏర్పాటు చేసి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గంలోని బీడు భూములకు సాగు, తాగు నీరు అందించనున్నారు.
3.50 లక్షల ఎకరాల భూమికి సాగునీరు
డిండి ఏత్తి పోతల పథకములో భాగంగా జిల్లాలోని 5 రిజర్వాయర్లు రూ.6500 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను తెలంగాణ నీటి పారుదల శాఖ నుంచి నిధులను కేటాయించారు. శ్రీశైలం ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ పద్ధతి ద్వారా రోజు 2 టీఎంసీల నీటిని సేకరిస్తారు. ఆ నీటిని నార్లపూర్ రిజర్వాయర్ నుంచి లీఫ్ట్ పద్ధతిలో 1.5 టీఎంసీలు, రంగారెడ్డి–పాలమూరు ఏత్తి పోతల పథకానికి మిగిలినా 0.5 టీఎంసీల నీరు డిండి ప్రాజెక్టుకు ఇలా 30 రోజుల్లో 15 టీఎంసీలను నిల్వ చేస్తారు. అనంతరం డిండి నుంచి కాల్వల ద్వార 5 రిజర్వాయర్లకు నీటిని పంపించి 3.50 లక్షల ఎకరాల బీడు భూములకు సాగు నీరు అందిస్తారు. ఇప్పటికే డిండి ప్రాజెక్టు ద్వార 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ఈ పథకం ద్వార మరో 18 వేల ఎకరాల భూములకు సాగు నీరు అందుతుంది.ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏడాదిలో ఇక్కడి రైతులు రెండు పంటలను సాగు చేయవచ్చు.
రెండు రిజర్వాయర్ల పనులు ప్రారంభం.
ఈ పథకంలో భాగంగా చేపట్టిన ఐదు రిజర్వాయర్లలో ఇప్పటికే రెండు రిజ్వరాయర్ పనులను ప్రారంభించారు. ఇప్పటికే డిండి మండలంలోని సింగరాజుపల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం భూమి చదును చేసి సీఓటీ పనులు సాగుతున్నాయి. తాజాగా ఈనెల 18న శివన్నగూడ రిజర్వాయర్ ఏర్పాటు కోసం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర న ర్సయ్యగౌడ్, మునుగో డు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.మిగిలిన మూడు రిజ ర్వాయర్ పనులను ప్రారంభిచేందుకు నీటి పారుదల శాఖ అధికారులు భూ సేకరణ చేస్తున్నారు.
ఐదు రిజర్వాయర్లు ఇవే..
డిండి ప్రాజెక్టుకు 7.875 కిలో మీటర్ల దూరంలో సింగరాజుపల్లి రిజర్వాయర్‌ను 702 ఎకరాల భూ విస్తీరణంలో 0.81 టీఎంసీల నీటి నిల్వ సామార్థ్యంతో చేపడుతున్నారు. దీని ద్వారా 13000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది.
డిండి ప్రాజెక్టుకు 32 కిలో మీటర్ల దూరంలో గోట్టిముక్కల రిజర్వాయర్‌ను చేపట్టనున్నారు. దీనిని 1907 ఎకరాల భూ విస్తీరణంలో 1.84 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపడుతున్నారు. దీని కింద 2800 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందనుంది.
ప్రాజెక్టుకు 40 కిలొ మీటర్ల దూరంలో చింతపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టనున్నారు. 1538 ఎకరాల భూమిలో 0.91 టీఎంసీల నీటి నిల్వ సామ్యార్థంతో చేపడుతున్నారు. దీని కట్ట పొడువు 4.600 కిలో మీటర్లు కాగా 15000 వేల ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి.
ప్రాజెక్టుకు 51 కిలో మీటర్ల దూరంలో చేపట్టే క్రిష్టరాయినీపల్లి రిజర్వాయర్ ద్వారా 1903 ఎకరాల భూమికి సాగు నీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 5.69 టీఎంసీలు. దీని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.
డిండి ప్రాజెక్టుకు 59 కిలొ మీటర్ల దూరంలో శివన్నగూడ రిజర్వాయర్‌ను 11.96 టీఎంసీల నీటి నిల్వ సామార్థ్యంతో నిర్మించనున్నారు. దీని కింద 1.55,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది.
తొలి అడుగు
Published Tue, Dec 27 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
Advertisement