సాక్షి, గజ్వేల్: కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం అందించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గజ్వేల్ ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నామని చెప్పారు. శుక్రవారం కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ‘ఇది మనమందరం జరుపుకోవాల్సిన జలపండుగ. కానీ కరోనా నేపథ్యంలో ఇది సాధ్యం కాదు. శుక్రవారం ముఖ్యమంత్రి కేవలం ప్రారంభిస్తారు. తరువాత ప్రజలు ఎవరైనా వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సందర్శించవచ్చు’ అని తెలిపారు. ప్రజలు ఎవరూ ప్రారంభోత్సవానికి రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు)
Comments
Please login to add a commentAdd a comment