
డుడుమకు తాకిడి
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ...
ముంచంగిపుట్టు: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ (డైవర్షన్) డ్యాం ప్రమాద స్థాయికి చేరడంతో బలిమెల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ డ్యాం పూర్తి సామర్థ్యం 2590 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 2589.30 అడుగుల నీటి నిల్వ ఉంది.
వరద నీరు అధికంగా చేరుతుండడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు సాయంత్రం నుంచి 8వ నంబర్ గేట్‌ను అరఅడుగు ఎత్తి 630 క్యూసెక్కుల నీటిని బలిమెల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. రాత్రికి మరో 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 2750కి గాను 2735.50 అడుగుల నీటిమట్టం నమోదైంది.