సీలేరు, న్యూస్‌లైన్ : భద్రాచలం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు చింతూరు, కోనూరు వంటి ప్రాంతాల్లో ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. ఫలితంగా సీలేరు (గుంటవాడ) జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు నిరంతరంగా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు. అయితే గత 10 రోజులుగా ఈ కేంద్రంలో రోజుకు 60 మెగావాట్లకు మించడం లేదు. శనివారం 0.279 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి జరిగింది.
ఈ రిజర్వాయర్‌లో నీరు ప్రస్తుతం 1350 అడుగులకు చేరింది. మరోవైపు పిల్లిగెడ్డ వాగు నుంచి వరదనీరు చేరుతోంది. డొంకరా యి జలవిద్యుత్ కేంద్రంలో ఉపనదుల ద్వారా ప్రస్తుతం 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం1037 అడుగులు కాగా 1035 అడుగుల వద్ద జెన్‌కో అధికారులు నీటిని నిల్వ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వలసగెడ్డ, పాలగె డ్డ, మంగంపాడు ఉపనదుల ద్వారా వచ్చే నీటి తో ప్రస్తుతం అక్కడ విద్యుత్ ఉత్పత్తితో వుం ది.
డొంక రాయి జలాశయంలో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉండడం, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జోరందుకోవడంతో ఇక్కడ విద్యుత్ కేంద్రాలపై అంతగా అధికారులు ఆధారపడటం లేదు. గతవారం ఆ జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందన్న ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
ఒకపక్క శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి జోరందుకోవడం, మరోపక్క భద్రాచలం, తూర్పుగోదావరి జలాశయాలు ప్రమాద స్థాయిలో ఉంటూ వెనక్కి వరద నీరు పోటెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం శ్రేయస్కారం కాదని ఉత్పత్తిని నిలిపివేశారు. డొంకరాయి పైనున్న వలసగెడ్డ, పాల గెడ్డ వాగుల నీటితోనే ప్రస్తుతం అక్కడ విద్యు త్ ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి ఎగువన ఉన్న బలిమెల జలాశయం 1500.4 అడుగుల నీటిమట్టం ఉండగా జోలాపుట్టు 2533.7 అడుగుల నీటిమట్టాలు నమోదైంది.
విద్యుదుత్పత్తికి తగ్గిన డిమాండ్
Published Sun, Aug 11 2013 2:18 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement