అలుగు పోస్తున్న వైరా రిజర్వాయర్
వైరా :
వైరా రిజర్వాయర్ నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు వచ్చి చేరటం, ఇటీవల సాగర్ నుంచి సుమారు 1000 క్యుసెక్కుల నీటిని విడుదల చేయటంతో రిజర్వాయర్ నీటి మట్టం పెరిగింది. పూర్తి స్థాయి నీటిమట్టం 18.4 అడుగులు కాగా అది మించి పోయింది. దీంతో రిజర్వాయర్ కింద ఉన్న ఓ అలుగు ద్వారా నీరు బయటకు వెళుతోది. ఉదయం నుంచి ఓ అలుగు ద్వారా నీరు బయటకు వస్తుండటంతో విషయం తెలుసుకున్న సందర్శకులు రిజర్వాయర్ వద్దకు చేరుకుంటున్నారు.