
భూఅంతర్భాగంలో అతిపెద్ద జలాశయం!
ఈ భూమండలంపైనే అతిపెద్ద జలాశయం.. ఇంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగనంతటి భారీ వైశాల్యంలో..! అంతటి జలనిధి ఎక్కడుందనుకుంటున్నారా? భూమి లోపల.. .....
వాషింగ్టన్:ఈ భూమండలంపైనే అతిపెద్ద జలాశయం.. ఇంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగనంతటి భారీ వైశాల్యంలో..! అంతటి జలనిధి ఎక్కడుందనుకుంటున్నారా? భూమి లోపల..ఏకంగా 640 కిలోమీటర్ల లోతున! అయితే ఇక్కడి నీరు మనం చూసే నీటి రూపంలో లేదు. ద్రవ, ఘన, వాయు రూపంలో కాకుండా నాలుగో స్థితిలో ఉందట. ఉత్తర అమెరికా ఖండం కింద ఈ భారీ జలాశయాన్ని కనుగొన్నట్టు నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూమెక్సికోకు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
ఇది అంతర్భాగంలో భూఫలకల మధ్య ‘శిలాద్రవం’ (మాగ్మా) రూపంలో ఉన్నట్టు వారు తెలిపారు. భూఫలకల కదలికల కారణంగా భూమిపై ఉన్న నీరు పలు మార్పులకు గురవుతూ కిందకు చేరి ఇలా శిలల మధ్య నిక్షిప్తమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ జలాశయం కనుగొనడం ద్వారా భూమి, నీటి పుట్టుకకు సంబంధించిన అనేక కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త జాకబ్‌సన్ పేర్కొన్నారు.