చెప్పకుండా నీటిని వదిలి విపత్తంటారా? | highcourt series on krishna water release without any information | Sakshi
Sakshi News home page

చెప్పకుండా నీటిని వదిలి విపత్తంటారా?

Published Fri, Dec 2 2016 3:34 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

highcourt series on krishna water release without any information

అధికారుల వల్లే రైతులకు నష్టం జరిగిందన్న హైకోర్టు
సాక్షి,హైదరాబాద్: జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టు (నెట్టెంపాడు) ప్యాకేజీ 98 కింద చేపట్టిన గూడెం దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నీటిని వదలడంపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. దేవుడి వల్లో, వరదల వల్లో, అధిక వర్షాల వల్లో నష్టం జరగ లేదని, కేవలం నీటిపాదరులశాఖ అధికారుల వల్లే జరిగిందని తేల్చి చెప్పింది.

ఈ వ్యవహారానికి సంబంధించి తదుపరి విచారణ నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేనిపక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వారుుదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గూడెందొడ్డి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయడం వల్ల తమ పంటలు మునిగిపోయాయని, అరుునప్పటికీ తమకు ప్రభుత్వం పరిహారం చెల్లించడం లేదంటూ జోగుళాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలం దోర్నాలకు చెందిన శంకరమ్మ మరో 50 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ విచారించారు. నీటిని వదలడం వల్ల 60 ఎకరాల్లోని పంట మునిగిపోరుుందని, విపత్తు నిర్వహణ కింద దాదాపు రూ.2 లక్షల వరకు పరిహారంగా నిర్ణరుుంచారని ప్రభుత్వ న్యాయవాది శ్రీదేవి కోర్టుకు నివేదించారు. జిల్లా కలెక్టర్ పంపిన సమాచారాన్ని న్యాయమూర్తి ముందుం చారు. న్యాయమూర్తి దానిని పరిశీలించి కలెక్టర్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశా రు. కలెక్టర్ ఇచ్చిన సమాచారాన్ని రికార్డులోకి తీసుకోలేమని తేల్చి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement