
డీపీఆర్ లేకుండా శంకుస్థాపనా?: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని చర్లగూడెం రిజర్వాయర్‌కు సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) లేకుండానే సీఎం శంకుస్థాపన చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఎం పేర్కొంది. హైదరాబాద్‌కు నీరందించేందుకు 11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎంకు రాసిన లేఖలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ముంపు తగ్గించేలా డిజైన్ చేస్తే బావుంటుందని రైతులు కోరుతున్నారన్నారు.