letter to cm
-
రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వచేయండి
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల వేగం అనూహ్యంగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కోవిడ్ రోగుల చేరికలు పెరిగే ప్రమాదం మరింతకానుంది. దీంతో ఆస్పత్రుల్లో కనీసం 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది. ప్రైవేట్ వైద్య కేంద్రాల్లోనూ ఆక్సిజన్ సేవలు అందుబాటులో ఉన్నందున డిమాండ్ ఒక్కసారిగా పెరిగితే అందుకు అనుగుణంగా సరఫరా ఉండేలా కార్యాచరణను అమలుచేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ఇన్–పేషెంట్ ఆస్పత్రులు, ఆక్సిజన్ సేవలందించే కేంద్రాల వద్ద ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. ద్రవ ఆక్సిజన్ ట్యాంక్‌లను నింపాలని, రీఫిల్లింగ్ కోసం ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద అదనపు ఆక్సిజన్ సిలిండర్లు, నిండుకుంటే వెంటనే తెప్పించే ఏర్పాట్లూ చేయాలని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ తాజా పరిస్థితిపై గురువారం సాయంత్రం నాలుగున్నరకు ప్రధాని మోదీ సీఎంలతో వర్చువల్ సమీక్ష నిర్వహిస్తారు. కరోనా కేసుల ఉధృతి ఆగటం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ను జలుబుగా లెక్కకట్టొద్దు కరోనా కేసుల్లో వారపు పాజిటివిటీ మూడొందలకుపైగా జిల్లాల్లో ఐదు శాతాన్ని మించడంతో ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా పరిగణించవద్దని, తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ చెప్పారు. -
‘సీఎం సాబ్... నాకు పెళ్లి కూతుర్ని చూడండి’
లక్నో: ఉత్తరప్రదేశ్ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో విసిగిపోయిన ఓ కుర్రాడు ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాశాడు. అంతేగాక అమ్మాయి తప్పనిసరిగా చదువుకుని ఉండాలని కండిషన్ కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వీసులో భాగంగా తనకు పెళ్లి చేయమంటూ బుధవారం పోలీసు స్టేషన్‌కు వెళ్లి విన్నవించుకున్న సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. వివరాలు.. అజీమ్(26) అనే వ్యక్తి స్థానికంగా కాస్మోటిక్స్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. ఇటీవల సొంత ఇళ్లు కూడా కొన్నాడు. ఇక బంధువులు, కుటుంబం బలం కూడా అతడికి బాగానే ఉంది. అలా హాయిగా జీవిస్తున్న అతడికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. పెళ్లి చూపుల కోసం అమ్మాయి తరపు వారు రావడం అజీమ్‌ను చూసి ఇంటికి వెళ్లి ఫోన్ చేస్తామని చెప్పడం. అయితే వారి నుంచి ఎప్పటికి సమాధానం రాకపోవడం. ప్రతి పెళ్లి చూపులకు అదే జరుగుతోంది. ఇలా అజీమ్‌కు 21ఏళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట కుటుంబ సభ్యులు. కానీ ఒక్క సబంధం కూడా సెట్ అవ్వడం లేదు. ఇదంతా వింటుంటే మీకు కమల్ హాసన్ ‘విచిత్ర సోదరులు’ మూవీ గుర్తుకు వస్తోంది కదా. అవును అచ్చం అలాంటిదే అజీమ్ కూడా జరుగుతోంది. ఈ మూవీ కమల్ హాసన్ మాదిగి అజీమ్ కూడా మరుగుజ్జు. చిన్నప్పుడు స్నేహితుల కామెంట్స్ భరించలేక ఐదో తరగతి వరకే చదువు ఆపేశాడు అజీమ్. ఆ తర్వాత కాస్మోటిక్ వ్యాపారం చేసుకుంటున్న అతడికి వచ్చిన పెళ్లి సబంధాలన్ని తప్పిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో సీఎం యోగి అదిత్యనాథ్‌ను పెళ్లి చేసి పెట్టమని లేఖ కూడా రాశాడు. ఇందులో ‘నేను చాలా కాలంగా పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నా. ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. నా జీవితాన్ని పంచుకునే వ్యక్తి ఇక నాకు దొరకదెమోనని భయమేస్తుంటుంది. నీకు పెళ్లి అవసరమా అంటూ విమర్శిస్తు కుప్పలుగా లేఖలు రాస్తుంటారు. నాకు ఇక పెళ్లి కాదని మా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ఆపేశారు. దయచేసిన మీరైనా నాకు పెళ్లి కూతురిని వెతికి పట్టి, వివాహం జరిపించండి’ అంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దీనిపై ఎటువంటి స్పందన రాకపోవడంతో బుధవారం మరోసారి పోలీసుల స్టేషన్‌కు వెళ్లడంతో మేము చేయాల్సింది చేస్తామని అతడికి పోలీసులు హామీ ఇచ్చి పంపించారట. చదవండి: భర్తపై హత్యాయత్నం కేసులో వీడిన ట్విస్ట్ మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి కోవిడ్ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి -
డీపీఆర్ లేకుండా శంకుస్థాపనా?: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని చర్లగూడెం రిజర్వాయర్‌కు సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) లేకుండానే సీఎం శంకుస్థాపన చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఎం పేర్కొంది. హైదరాబాద్‌కు నీరందించేందుకు 11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎంకు రాసిన లేఖలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ముంపు తగ్గించేలా డిజైన్ చేస్తే బావుంటుందని రైతులు కోరుతున్నారన్నారు. -
ఇచ్చిందేంటి బాబూ?!
ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, అయ్యా! ‘అనంత’ కరువు, వెనుకబాటుతనం గురించి మీకు తెలియంది కాదు. మీరు గతంలో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో ఏడేళ్లు వరుస కరువులతో జిల్లా తల్లడిల్లింది. జనం ఆకలి తీర్చడానికి గంజికేంద్రాలు, పశువుల కోసం గడ్డికేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి రెండేళ్లుగా కరువు నెలకొంది. ఈ రెండేళ్లలో 63 మండలాల్లోనూ కరువొచ్చిందని మీ ప్రభుత్వమే ప్రకటించింది. జిల్లా ప్రజలు గడిచినlఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు, 12మంది ఎమ్మెల్యేలను మీ పార్టీ తరఫున గెలిపించారు. రాజధాని ప్రకటన సమయంలో ‘అనంత’ అభివృద్ధి కోసం 15 వరాలను అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించారు. ఇవి కాక జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మరో ఆరు హామీలిచ్చారు. ఇది చూసి ‘మీకు అనంత అంటే ఎంత ప్రేమో’ అనుకున్నాం. మీరు ఇప్పటి వరకూ 11 సార్లు జిల్లాకు వచ్చారు. నేడు 12వ సారి వస్తున్నారు. కాగా.. మీరిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారు. పైగా వచ్చిన ప్రతిసారీ ‘అనంత’ అంటే నాకు అమితమైన ప్రేమ.. మొన్న చైనాకు వెళుతుంటే కలలో కూడా ‘అనంతే’ గుర్తుకొచ్చిందంటూ వల్లమానిన ‘అభిమానం’ చూపుతారు. ప్చ్..ఏం లాభం?! మీ మాటలు నీటి మూటలే అవుతున్నాయి. హంద్రీ–నీవా ద్వారా 2014 ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీళ్లిస్తామన్నారు. ఇవ్వలేదు. 2015కైనా ఇచ్చారా? అదీ లేదు! ‘2016 ఆగస్టుకు నీళ్లివ్వాల్సిందే! పనులు చేయాల్సిందే! లేదంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతా. అధికారులపై చర్యలు తీసుకుంటా’ అని ఇటీవల దిగువచెర్లోపల్లికి వచ్చినపుడు హడావుడి చేశారు. కానీ మొదటివిడత ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు కాంట్రాక్టర్లకు మీరే వచ్చే ఏడాది జూన్ వరకూ గడువిచ్చారు. జరుగుతున్న పనులు చూస్తే మరో మూడేళ్లయినా పూర్తయ్యేలా లేవు. దీన్నిబట్టి చూస్తే మీ మాటలు నేతిబీరలో నెయ్యి చందం అనుకోక తప్పదు. కేంద్రం ఫసల్‌బీమాను ప్రవేశపెట్టింది. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో వేరుశనగను చేర్చారు. ‘అనంత’లో మాత్రం ఎత్తేశారు. రైతులపై మీకు అభిమానమే ఉంటే, వారికి మేలు చేయాలని సంకల్పమే ఉంటే ‘అనంత’ వేరుశనగను ఫసల్‌బీమాలో ఎందుకు పెట్టించలేదు? కనగానపల్లి మండలం దాదులూరు దగ్గర గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తొలి వ్యవసాయ బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పుడు దాని ప్రస్తావనే లేదు. గుజరాత్‌లోని జునాఘడ్ వేరుశనగ పరిశోధన సంస్థకు అనుబంధంగా ఎన్పీ కుంటలో ప్రాంతీయ పరిశోధన కేంద్రం, బుక్కరాయసముద్రంలో నూనె గింజల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రూ. వెయ్యి కోట్లతో అనంతను హార్టికల్చర్హబ్గా మారుస్తామన్నారు. ఇవేవీ ఆచరణకు నోచుకోలేదు. ఎయిమ్స్ అనుబంధ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఊరించి.. చివరకు గుంటూరుకు తరలించారు. మీ రెండేళ్ల పాలన ఎలా సాగిందో! రెండు ఎంపీ, 12 ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన ‘అనంత’ ప్రజలకు ఎలాంటి మేలు చేశారో మీరు ఏరోజైనా ఆత్మపరిశీలన చేసుకున్నారా?! సంపూర్ణ రుణమాఫీ చేయనందున రెండేళ్లలో 154మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలకు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేదు. 24 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయనందుకు ఐదు వేలకుపైగా గ్రూపులు డిఫాల్టయ్యాయి. ఈ రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా? ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? అర్హత ఉన్నా పింఛన్లు తొలగించారు. రెండేళ్లలో ఏ ఒక్కరికీ ఇళ్లు నిర్మించలేదు. ఇంటి స్థలమూ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే రెండేళ్లలో మీ పార్టీనేతలు మాత్రమే ఆర్థికంగా బలపడ్డారు తప్ప, ఏ ఒక్క సామాన్యునికీ మేలు జరగలేదు. ఇప్పటికీ బెంగళూరు, కేరళ, తమిళనాడులో వలసెళ్లిన రైతులు, కూలీలు ఉన్నారు. ఇప్పటికైనా మీరు రైతులు, పేదల కష్టాలు చూడండి. నిజంగా రెండేళ్లలో ఏం చేశారో సమీక్షించండి. ‘అనంత’ను సింగపూర్ చేయాల్సిన పనిలేదు. తాగు, సాగునీరు ఇవ్వండి చాలు. వలసలు పోకుండా బతికేందుకు పని కల్పించండి. పిల్లలకు మంచి చదువు, సామాన్యులకు వైద్యం అందించండి. మా వినతులు ఆలకించి, సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ.. – ‘అనంత’ ప్రజలు