సీలేరు, న్యూస్‌లైన్ : డొంకరాయి జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరడంతో శుక్రవారం రాత్రి మొదటి రెండు గేట్లు ఎత్తి ఎనిమిది గంటలపాటు 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు. శుక్రవారం సాయంత్రానికి 1036.5 అడుగులకు చేరడంతో నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున మరో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామని ఎస్‌ఈ ఈఎల్ రమేష్‌బాబు తెలిపారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్‌ను పర్యవేక్షిస్తున్నామని, శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 1035 అడుగులకు చేరడంతో గేట్లు నిలుపుదల చేశామన్నారు.
25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ప్రస్తుతం ఈ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ యూనిట్ ద్వారా విడుదలైన నీరు దిగువనున్న ఖమ్మం జిల్లా కొల్లూరు రిజర్వాయర్‌లోకి రోజుకు 2,400 క్యూసెక్కులు చేరుతోంది. మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్లు మూలకు చేరడంతో మరో రెండు యూనిట్ల ద్వారా 220 మెగా వాట్లు నిరాటంకంగా విద్యుత్ తయారవుతోంది. అక్కడ విడుదలైన నీరు శబరి నదిలో కలుస్తోంది.
రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు
Published Sun, Aug 4 2013 5:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:37 PM
Advertisement
Advertisement