Ramesbabu
-
ఒక స్వప్నం ఒక కుటుంబం
బాలోత్సవ్ మంచి పని చేయాలని అందరికీ ఉంటుంది. ఆలోచన గొప్పదే! కానీ కార్యరూపం దాల్చాలంటే... ఆ స్వప్నానికి ఒక కుటుంబం తోడు కావాలి. అది భార్య పిల్లలు అమ్మ నాన్నే కాదు... సమాజం అన్న కుటుంబం కావాలి! కొత్తగూడెంలో రమేశ్‌బాబు పిల్లలకి చదువులే కాదు, సృజనాత్మక పోటీలు అవసరమని ఒక వేదికను సమకూర్చారు. అంతే! సమాజంలోని కుటుంబాలన్నీ ఆ వేదికకు తోరణాలు కట్టాయి. అన్నీ రోడ్లు రోమ్కు దారితీస్తాయో లేదో కాని నవంబర్ వచ్చిందంటే చాలు అన్ని స్కూళ్లు కొత్తగూడెంకే దారి తీస్తాయి. నవ్వే పిల్లలు, ఉత్సాహంగా చేతులు ఊపే పిల్లలు, కళ్లు నక్షత్రాల్లా మెరిసే పిల్లలు... అత్యద్భుతమైన ప్రతిభను తమలో నింపుకున్న పిల్లలు... తమకు ఇంత ప్రతిభ ఉందని ఏమాత్రం తెలియని పిల్లలు వీరంతా కొత్తగూడెం వచ్చి తోటి పిల్లలను కలుస్తారు. పోటీల్లో కలబడతారు. గెలిచి ఆనందపడతారు. ఓడిపోయి మరుసటి సంవత్సరానికి కావలసిన పట్టుదలను ఓడిపోవడంలోని ఘనతను స్వీకరించి వెళతారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక సాదాసీదా పట్టణం ఇలాంటి వినూత్నమైన విన్యాసానికి పూనుకోవడం ఈ పిల్లల వేడుకను 24 ఏళ్లు నిర్వహించి 25వ ఏట నిర్వహించుకునే స్థితికి ఎదగడం ఏమాత్రం ఆషామాషీ కాదు. ఎంతో పట్టుదల, వాత్సల్యం, ప్రజల సహకారం, పిల్లల ఉత్సహం తోడైతేనే ఇది సాధ్యం అవుతుంది. 1991లో మొదలైన వేడుకలు స్కూళ్లంటే చదువులు... హోమ్‌వర్క్‌లు... మార్కులు... ర్యాంకులు... ఇవి మాత్రమే కాదు. నిజానికి ఇవి పిల్లల జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆ సంగతి అందరూ మర్చి పోతున్నారు అనిపించింది కొత్తగూడెంకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబుకు. కొత్తగూడెం క్లబ్‌కు కార్యదర్శి అయిన వెంటనే క్లబ్ ద్వారా పిల్లలకు సృజనాత్మక కళల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అనుకున్నారాయన. చక్కటి పాట పాడకుండా, గొప్పగా వేణువు ఊదకుండా, హాయిగా తోటి బాలలతో బృందనృత్యం చేయకుండా గడిచే బాల్యం బాల్యమే కాదనేది ఆయన భావనే. పిల్లలకు చదువు మాత్రమే నూరి పోయాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనాధోరణిలో మార్పు తేవడానికి కూడా ఆయన సాంస్కృతిక పోటీలు అవసరమని భావించారు. అలా మొదలయ్యిందే ‘బాలోత్సవ్’. 1991లో ఏ ముహూర్తాన ఆ ఉత్సవం మొదలైందో కాని పదులు వందల సంఖ్యల్లో పాల్గొనే వేడుక నుంచి నేడు దాదాపు 15000 మంది బాలలు పాల్గొనే ఉత్సవంగా అది ఎదిగింది. అందరూ గర్వపడే స్థాయికి చేరింది. ఈసారి నాలుగురోజుల పాటు... ప్రతి సంవత్సరం 3 రోజులపాటు నిర్వహించే బాలోత్సవ్ ఈసారి రజతోత్సవం సందర్భంగా 4 రోజులపాటు జరగనుంచి. వివిధ రంగాలలో నిష్ణాతులుగా పేరొంది, బాలలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే అగ్రగణ్యులను ఈ ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు. ప్రముఖ కవి గూడ అంజయ్య కవితలపై పోటీలు నిర్వహించనున్నారు. తొలుత భరతనాట్యం, వక్తృత్వం, క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలకే పరిమితమైన బాలోత్సవ్ ఇప్పుడు బాలల చేత వీధినాటికలు వేయించి వాటిని విశ్లేషించడం, షార్ట్‌ఫిల్మ్స్ (లఘుచిత్రాలు) చూపించి వాటి ప్రాధాన్యతను విశ్లేషించడం వంటి 29 రకాల పోటీలు నిర్వహిస్తున్నది. మొత్తం 29 అంశాల్లో 48 విభాగాలలో పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం క్లబ్ ప్రాంగణంలో 12 వేదికలు ఏర్పాటు కానున్నాయి. ఈ వేదికలపై ఏకకాలంలో పోటీలు జరుగుతుంటాయి. ప్రతి ఇల్లూ విడిదే... కొత్తగూడెంలో పెద్ద పెద్ద హోటళ్లు లేవు. వేలాది గదులు ఉన్న బసలు లేవు. మరి ఇంత పెద్ద వేడుక ఎలా జరుగుతున్నట్టు? కొత్తగూడెం వాసుల వల్లే. అక్కడ బాలోత్సవ జరిగే ఈ నాలుగురోజులూ ప్రతి ఇల్లూ ఒక విడిది గృహం అయిపోతుంది. ప్రతి నివాసం ఒక ఆత్మీయ సదనం అయిపోతుంది. బాలోత్సవ్‌కు సహకరించేదుకు ముందుకు వచ్చిన కుటుంబాలు తమకు కేటాయించిన పిల్లలకూ వారి తల్లిదండ్రులకూ తమ ఇంట్లోనే విడిడి కల్పిస్తారు. వారికి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తారు. అంతేకాదు తమ పిల్లలను సైతం క్రమం తప్పకుండా ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా కొత్తగూడెం వాసులు ఉత్సాహపరుస్తూ ఈ వేడుకు విజయం కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈసారి బాలోత్సవ్ పోటీ అంశాలు 1. చిత్రలేఖనం (స్పాట్ డ్రాయింగ్); 2. తెలుగు మాట్లాడుదాం; 3. వీధినాటికా విశ్లేషణ (స్ట్రీట్ ప్లే ఎనాలసిస్); 4. లఘుచిత్ర సమీక్ష (షార్ట్ ఫిలిం రివ్యూ); 5. కవితా రచన; 6. కథారచన; 7. కథా విశ్లేషణ; 8. భరత నాట్యం; 9. కూచిపూడి; 10. పేరిణి నాట్యం (లాస్యం - తాండవం, సోలో); 11. జానపద నృత్యం; 12. క్విజ్; 13. సినీ, లలిత జానపద గీతాలు; 14. విచిత్ర వేషాధారణ (ఫ్యాన్సీడ్రెస్); 15. అనగా అనగా.. (కథచెబుతా వింటారా!); 16. నీతి పద్యం; 17. లేఖారచన; 18. వ్యర్థంతో అర్థం 19. వాద్య సంగీతం (ఇన్స్ట్రుమెంటల్ మ్యూజికల్); 20. గ్రూప్ డాన్స్ జానపదం (అందరికీ); 21. నాటికలు; 22. మట్టితో బొమ్మలు చేద్దాం; 23. ఏకపాత్రాభి నయం 24. స్పెల్ బీ; 25. వక్తృత్వం (ఇంగ్లీష్, తెలుగు); 26. గ్రూప్‌డాన్స్ భరతనాట్యం (అందరికీ); 27. గ్రూప్‌డాన్స్ కూచిపూడి నృత్యం (అందరికీ); 28. సంప్రదాయం 29. గూడ అంజయ్య గీతాలు పిల్లల ముఖాల్లో సంతోషం చూశా! మీరొక డాక్టరు. మీకు ఉంటే పేషంట్లతో అనుబంధం ఉండాలి. మరి పిల్లలంటే ఎందుకింత ప్రేమ.... రమేశ్: నేను వృత్తిరీత్యా డాక్టర్నే అయినా నాలోనూ ఒక తండ్రి తాత ఉన్నాడు. నేను కూడా బాల్యాన్ని గడిపి పెద్దవాణ్ణయ్యాను. మా అమ్మది మధిర దగ్గర మహదేవపురం. నాన్నది తెనాలి దగ్గర చెన్నపాలెం. నేను రైతు కుటుంబంలో జన్మించాను. పల్లెటూరూ ఏటి గట్టున స్వేచ్ఛగా ఆడుకోవడం ఇలాంటి బాల్యం నాకు తెలుసు. రాను రాను ఆ బాల్యం మిస్సవడం గమనించాను. పాఠశాలలు కారాగారాల్లా మారాయి. చదువుతో పాటు ఆటా పాటా కళ ఉండేదే నిజమైన పాఠశాల. పిల్లలు స్కూళ్లలో ఏవైతే మిస్సవుతున్నారో అవి బాలోత్సవ్‌లో ఉండాలని ఈ ఉత్సవాన్ని మొదలెట్టాం. ఈ పనిలో మీకు తోడు నిలిచింది ఎవరు? చటర్జీగారని ఒక లెక్చరర్ చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు రిటైర్డ్ అధ్యాపకులు శర్మగారు, సింగరెణి ఉద్యోగులు చంద్రశేఖర్, మాధవరావు గార్లు ఇంకా చాలామంది ఈ పనిలో నాకు సపోర్ట్‌గా ఉన్నారు. 25 సంవత్సరాలలో మీకు బాగా సంతృప్తినిచ్చిన సంవత్సరం ఏది? ప్రతి సంవత్సరం సంతృప్తినిచ్చింది. దానికి కొలబద్దగా పొగడ్తలని కాకుండా పిల్లల మొహాల్లో ఆనందాన్ని మేం తీసుకుంటాం. ఈ ఈవెంట్‌కు వచ్చిన పిల్లలు ఎవరూ డిజప్పాయింట్ అవరు. ఈ బాలోత్సవ్ వల్ల మీరేమి సాధించారు? ఒక పిల్లవాడు వెయ్యి మంది పిల్లల ఎదుట నిలుచుని ఒక కథ చెబుతాయి. ఒక అమ్మాయి పాట పాడుతుంది. ఇంకొందరు ఒక నాటకం వేస్తారు. ఇవన్నీ ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేవే. పర్సనాల్టీ డెవలప్మెంట్ అంటే కొటేషన్స్ చెప్పడం కాదు. ఇలాంటి పనులు చేయాలి. బాలోత్సవ్ సాధించినది మానసిక ఫలితాలను. అవి పైకి కనిపించేవి కాదు. సాహిత్యాన్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టున్నారు? అవును. మేము కథారచనను, కథాపఠనాన్ని ఒక ముఖ్యమైన పోటీగా బాలోత్సవ్‌లో నిర్వహిస్తాం. పిల్లలు అప్పటికప్పుడు ఒక కథ రాస్తారు. చాలా బాగా రాస్తారు. వాసిరెడ్డి నవీన్, ఓల్గా, వాడ్రేవు వీరలక్ష్మిదేవి, చంద్రలత వంటి సాహిత్యకారులు నేరుగా బాలోత్సవ్‌లో పాల్గొని పిల్లలతో సంభాషించడంమంచి రిజల్ట్స్‌కు కారణం. ఈసారి ఎన్నిరాష్ట్రాల నుంచి పిల్లలు వస్తున్నారు? తెలుగు మాతృభాషగా కలిగినవారు ఏ రాష్ట్రంలో ఉన్నా పాల్గొనవచ్చని చెబుతున్నాం. ఈసారి ఆంధ్ర, తెలంగాణ, చత్తిస్గఢ్, డిల్లీ, కర్నాటక, పాండిచ్చేరి, గుజరాత్... రాష్ట్రాల నుంచి పిల్లలు పాల్గొంటారు. ప్రతి రోజూ సుమారు ఎంతమంది పాల్గొంటారు? ఎన్నివేలో సరిగ్గా చెప్పలేను. కాని కొత్తగూడెం వాళ్లు కాకుండా సుమారు 7000 మంది ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎందుకంటే మేము అంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు రాత్రికి వెళ్లిపోగా 5000 మంది రాత్రి పూట భోజనం చేస్తారు. డబ్బు ఎలా చేస్తారు? ఎవర్నీ రూపాయి అడగం. మా పని తెలిసి తమకు తాము ఇచ్చేవారే అందరూ. కెసిపి సిమెంట్స్ ఇందిరాదత్గారు, ఆగ్రోటెక్ సాంబశివరావుగారు ముఖ్యులు. మా అన్న కొడుకు శ్రీనివాసరావు - బాబాయ్... నువ్వు మంచిపని చేస్తున్నావు భోజనం ఖర్చులు నేను చూసుకుంటాను అని వాడే చూసుకుంటున్నాడు. దీని కొనసాగింపు ఏమిటి? బాలోత్సవ్ ఒక్క కొత్తగూడెంలోనే కాదు ప్రతి ఊళ్లోనూ జరగాలని నా కోరిక. ప్రతి ఊళ్లోనూ పిల్లలకు ఇలాంటి వేదికలు కావాలి. మమ్మల్ని చూసిన తర్వాత భద్రాచలంలో, మధిరలో చేస్తున్నారు. కాకినాడలో భారీగా బాలోత్సవం జరుగుతోంది. ఇక మీదట చిలుకలూరిపేట, విజయవాడ, గుంటూర్లలో చేయడానికి ఆ ప్రాంతవాసులు ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? -
రమేష్‌ది హత్యా... ఆత్మహత్యా?
కొత్త కోణంలో పోలీసుల దర్యాప్తు మదనపల్లె క్రైం: పట్టణానికి చెందిన చిరు వ్యాపారి పంతల రమేష్‌బాబు(45) ఆత్మహత్యపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా రమేష్ సూసైడ్ నోట్లో రాసిన పేర్ల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. మూడు నెలల క్రితం నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత కార్మికుడు వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక వారి పేర్లతో సహా వెల్లడించి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే తాళ్లసుబ్బన్న కాలనీకి చెందిన చిరు వ్యాపారి పంతల రమేష్‌బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే... మండలంలోని కొత్తపల్లె పంచాయతీ తాళ్లసుబ్బన్న కాలనీలో నివాసం ఉంటున్న రమేష్‌బాబు(45) నిమ్మనపల్లె రోడ్డు సర్కిల్లో వినాయక ఆయిల్ స్టోర్ 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారుల నుంచి రూ.30 లక్షల వరకు అప్పు చేశాడు. రోజువారి సంపాదన వడ్డీకే సరిపోతుండడంతో ఇల్లు గడవడం కష్టతరంగా మారింది. దీంతో భార్య ఆరు మాసాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి శరీరంపై ప్యాంటు లేదా పంచె లేకపోవడం, చనిపోయినప్పుడు తలుపులు తెరిచి ఉండడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం చిందరవందర కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేస్తుకున్నాడా...? లేక పథకం ప్రకారం అడ్డు తొలగించుకోవడానికి భార్య తరపు వారెవరైనా హతమార్చారా అన్న కోణంలోనూ, సూసైడ్ నోట్లో రాసిన వడ్డీ వ్యాపారులపైనా దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. -
సర్వాధికారాలు రమేష్‌బాబుకే
పట్టిసీమపై ప్రభుత్వ నిర్ణయం చీఫ్ ఇంజనీర్ పోస్టు సృష్టించి అదనపు బాధ్యతలు ప్రతిపాదనలకు మంత్రి దేవినేని ఆమోదం హైదరాబాద్: పట్టిసీమ పనుల్లో అక్రమాలు వెలుగుచూడకుండా, ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు అడ్డగోలు బిల్లుల మంజూరు కోసం పోలవరం ఎస్ఈ రమేష్‌బాబుకు ఆ పథకంపై సర్వాధికారాలు కల్పించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. పట్టిసీమ చీఫ్ ఇంజనీర్ పోస్టు సృష్టించి, ఆయనకు సీఈగా అదనపు బాధ్యతలు అప్పగించాలంటూ రూపొందించిన ప్రతిపాదనలకు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు వెలువడతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర్వులు వచ్చిన మరుక్షణం నుంచి ఈఎన్సీతో సంబంధం లేకుండా పట్టిసీమ డిజైన్‌లో మార్పులు చేర్పు లు, పనుల పర్యవేక్షణ, నాణ్యత తనిఖీ, బిల్లు లు పాస్ చేయడం వంటి అన్ని రకాల అధికారాలు రమేష్‌బాబుకే దక్కుతాయన్నాయి. ఈఎన్సీని బైపాస్ చేసి..: పోలవరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్ (సీఈ) పోస్టు కాకుండా ఈఎన్సీ పోస్టు ఉంటుంది. రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీనే పోలవరం సీఈగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పట్టిసీమ డిజైన్‌లో మార్పు చేర్పుల ప్రతిపాదనలు ఈఎన్సీ ద్వారానే ప్రభుత్వానికి చేరా లి. బిల్లుల చెల్లింపునకు కూడా ఈఎన్సీ ఆమోదం తప్పనిసరి. కాంట్రాక్టర్‌కు నచ్చినట్లుగా డిజైన్ మార్చడానికి, పనులు చేయకపోయినా చేసినట్లుగా రికార్డుల్లో చూపించి బిల్లులు మంజూరు చేయడానికి ఈఎన్సీ అడ్డుపడుతున్నారని నీటి పారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈఎన్సీని బైపాస్ చేసి బిల్లులు నొక్కేసేందుకు వీలుగా బాధ్యతలన్నీ రమేష్‌బాబుకు అప్పగించారని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా పట్టిసీమ సీఈ పోస్టు సృష్టించడం ద్వారా ఈఎన్సీని వ్యూహాత్మకంగా పక్కకు తప్పించారని ఇంజనీర్లు చెబుతున్నారు. పట్టిసీమ సీమ సీఈగా ఎత్తిపోతల పథకం పనులను రమేష్‌బాబు పర్యవేక్షించనున్నారు. ఎంత పరిమాణంలో పని జరిగిందనే విషయాన్ని ఆయన సర్టిఫై చేయనున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ సీఈగా నాణ్యతను తనిఖీ చేస్తారు. పోలవరం ఎస్ఈగా బిల్లులను పాస్ చేస్తారు. ఏ టూ జెడ్ పనులు ఒక్కరికే అప్పగించడంతో, పనులు చేయకున్నా చేశామని ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేయడానికి వీలుగానే ఈ ఏర్పాట్లు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి పారుదల శాఖలో సమర్థులైన ఇంజనీర్లందరినీ పక్కనబెట్టి రమేష్‌బాబుకు బాధ్యతలు అప్పగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. -
పట్టిసీమలో అడ్డులేకుండా..అయినోడికి అందలం!
ఏపీలోనే కొనసాగనున్న పోలవరం ఎస్ఈ రమేష్‌బాబు పదవీ విరమణ రోజు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు పోలవరం, పట్టిసీమ అడ్డగోలు బిల్లులు ఆమోదం పొందడానికే..! నజరానాగా రెండేళ్ల సర్వీసు తెలంగాణ జోన్లలోనే ఎంపికైన 182 మంది ఏపీ ఇంజనీర్లకు అన్యాయం సాక్షి, హైదరాబాద్: పోలవరానికి ‘చంద్ర గ్రహణం’ పట్టించి ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించడానికి, పట్టిసీమ ఎత్తిపోతల పనుల్లో అవినీతిని పట్టించుకోకుండా అడ్డగోలు బిల్లులకు ఆమోదం తెలపడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేసింది. ఈ ప్రాజెక్టుల విషయంలో తాము అనుకున్నది అనుకున్నట్టు సులభంగా జరిగిపోయేలా ఎత్తుగడ వేసింది. వివరాల్లోకి వెళితే.. 182 మంది ఏపీ ఇంజనీర్లను తెలంగాణలోని 5, 6 జోన్లలో ఎంపికయ్యారనే పేరిట ప్రభుత్వం ఆ రాష్ట్రానికి పంపించింది. తెలంగాణ ప్రభుత్వం తమకు పోస్టింగులు ఇవ్వకుండా సతాయిస్తోందని, తమను ఏపీలోనే కొనసాగించాలని, సీనియారిటీ సైతం అడగబోమని వారెంతగా వేడుకున్నా కనికరం లేకుండా వ్యవహరించింది. కానీ ఒకే ఒక్క అధికారికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది. ఆ ఒక్కరే పోలవరం ఎస్ఈ రమేష్‌బాబు. తెలంగాణలోని ఆరో జోన్లో ఎంపికైన రమేష్‌బాబును.. ఆ రాష్ట్రానికి పంపించకుండా, ఏపీలోనే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తెలంగాణలోనే కనుక కొనసాగితే గురువారమే (ఏప్రిల్ 30న) పదవీ విరమణ చేయాల్సి వచ్చేది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన మరో రెండేళ్ల పాటు సర్వీసులో కొనసాగనున్నారు. ఆయన సేవల్ని వినియోగించుకుంటే.. అసాధ్యమనుకునే అద్భుత నిర్మాణాలను సైతం సాకారం చేయగలరు.. అంతటి నైపుణ్యం ఆయన సొంతం.. అన్న రికార్డేమీ లేదు. అత్యంత నిజాయితీతో పనిచేశారనే క్లీన్చిట్ కూడా లేదు. ఉన్నదల్లా సర్కారు పెద్దలు చెప్పినట్లుగా అడ్డగోలు బిల్లులైనా సరే మారు మాట్లాడకుండా ఆమోదముద్ర వేసే చాతుర్యమే. నాణ్యత ఉన్నా లేకున్నా.. అద్భుతం అంటూ నివేదిక రాయగల నైపుణ్యమే. ఇవీ రమేష్‌బాబు గురించి నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్న మాటలు. ఆ నైపుణ్యమే.. ఆయన్ను తెలంగాణకు పంపించకుండా ఏపీలోనే కొనసాగించడానికి కారణమైంది. తెలంగాణలోని 5, 6 జోన్లలో ఎంపికై, రాష్ట్రంలో పనిచేస్తున్న 182 మంది ఏపీ ఇంజనీర్లను రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణకు పంపించింది. వీరు ఏపీలో కొనసాగేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అంగీకరించదని నీటిపారుదల శాఖ అధికారులు తేల్చిచెప్పారు. కానీ అదే ఆరో జోన్లో ఎంపికైన రమేష్‌బాబును మా త్రం ఏపీలో కొనసాగించడానికి అనుమతించాలని కోరుతూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గత మార్చి 26న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఒక్క రమేష్‌బాబు విషయంలోనే ఎందుకు మినహాయింపు కోరుతోందనే విషయం అర్థంకాని తెలంగాణ అధికారులు ఆ లేఖకు జవాబివ్వకుండా తాత్సారం చేశారు. రమేష్‌బాబుకు ఈ నెల్లో (ఏప్రిల్) 58 సంవత్సరాలు నిండాయి. ఆయన్ను ఏపీలో కొనసాగించడానికి తెలంగాణ సర్కారు కనుక అనుమతి మంజూరు చేయని పక్షంలో గురువారం పదవీ విరమణ చేయాల్సి వచ్చేది. అయితే ఏపీ అధికారుల ఒత్తిడి నేపథ్యంలో.. రమేష్‌బాబును ఏపీలో కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి బుధవారం (ఏప్రిల్ 29న) ఏపీ సర్కారుకు లేఖ వచ్చింది. లేఖ అందిన వెంటనే.. గురువారం రమేష్‌బాబును ఏపీలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబర్ 42) ఇచ్చింది. ఆయన ఒక్కరికి మాత్రమే ఇలా మినహాయింపు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని జీవోలో ఎక్కడా ప్రభుత్వం పేర్కొనకపోవడం గమనార్హం. ఇద్దరు సీఎస్‌లకు అవమానం! రెండు రాష్ట్రాల మధ్య లావాదేవీలు కేవలం ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ద్వారానే జరగాలి. సమాచారం కూడా సీఎస్ల ద్వారానే ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ రమేష్‌బాబు విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కనీస సమాచారం లేకుండానే.. నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శుల మధ్యే వ్యవహారం సాగింది. ఇది ఇటు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు, అటు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మకు అవమానమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఏసీబీ వలలో ఎస్ఐ
కేసు విత్‌డ్రాకు రూ.40 వేల డిమాండ్ రూ.22 వేలు తీసుకుంటుండగా పట్టివేత అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు సీతంపేట (విశాఖపట్నం): అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసు అధికారి లంచగొండిగా మారాడు. ఉద్యోగ బాధ్యతగా నిర్వర్తించాల్సిన పనికి లంచం డిమాండ్ చేశాడు. ఫలితంగా అవినీతి నిరోధకశాఖకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఫోర్త్ టౌన్ ఫోలీస్స్టేషన్లో లాఅండ్ఆర్డర్ ఎస్ఐగా పనిచేస్తున్న రమేష్‌బాబు తన కేబిన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒక వ్యక్తి నుంచి రూ.22 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నరసింహరావు కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. నేవల్ డాక్‌యార్డులో వెల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న దక్షిణామూర్తి అక్కయ్యపాలెంలోని టూ బెడ్రూమ్ ప్లాట్‌ను వెంకట రాజేశ్వరరావు అనే వ్యక్తికి రూ.22 లక్షలకు అక్టోబర్‌లో విక్రయించాడు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఇంటిని మాత్రం అప్పగించలేదు. దక్షిణామూర్తికి తన భార్య దివ్యతో కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో దివ్య ఇల్లు ఖాళీ చేయలేదు. దీంతో ఇల్లు అప్పగించలేదని రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దక్షిణామూర్తిపై 420, 448 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ఎస్ఐ రమేష్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణామూర్తి తన భార్య దివ్యకు రూ. 5లక్షలు చెల్లించి గొడవ సెటిల్ చేసుకున్నాడు. ఇంటిని రాజేశ్వరరావుకు అప్పగించాడు. సమస్య పరిష్కారమైనందున మెగా లోక్ అదాలత్‌లో కేసు విత్‌డ్రా చేసుకుంటామని దక్షిణామూర్తి ఎస్ఐ రమేష్‌బాబును కలిశాడు. ఇందుకోసం ఎస్ఐ రూ.40 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే రిమాండుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడటంతో రూ.22 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో స్టేషన్‌లోని ఎస్ఐ కేబిన్‌లో దక్షిణామూర్తి నుంచి రమేష్‌బాబు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్ఐను ఆరెస్టు చేశారు. పోలీసు అధికారుల్లో గుబులు... ఎస్ఐ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడటంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎస్ఐ రమేష్‌బాబు హఠాత్తుగా పట్టుబడటంతో ఉన్నతాధికారులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు. ఆర్థికపరమైన కేసుల్లో సిబ్బంది, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఐ బెదిరించారు ఎస్ఐ చర్యలకు విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించాను. కుటుంబ కలహాలు సెటిల్ చేసుకుని, కొనుగోలు చేసిన వ్యక్తికి ఇల్లు అప్పగించాను. లోక్ అదాలత్‌లో కేసు విత్‌డ్రా చేయడానికి ఎస్ఐ రూ.40 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వకుంటే రిమాండ్‌కు తరలిస్తానని బెదిరించడంతో ఏసీబీని ఆశ్రయించాను. -దక్షిణామూర్తి, ఫిర్యాదుదారుడు -
లేగదూడల పెంపకంలో జాగ్రత్తలు
వర్గల్ పశుసంపద అభివృద్ధికి దూడల పోషణే ప్రధానం. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ నాణ్యమైన మేత అందించినప్పుడే ఇవి మంచి పాడి ఆవులుగా ఎదుగుతాయి. పశు పోషకుల నిర్లక్ష్యం, అవగాహనలేమి వల్ల పుట్టిన ప్రతీ 100 దూడల్లో 30 నుంచి 40 వరకు మృత్యువా త పడుతున్నాయి. ఈ సమస్యను అధిగమిం చేందుకు లేగదూడల పెంపకంలో తీసుకోవాల్సిన మెలకువలపై వర్గల్ మండల పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్‌బాబు (సెల్ : 9849457404) అందించిన సలహాలు, సూచనలు... దూడ పుట్టగానే ముక్కు రంధ్రాల మీద ఉన్న పొరలు తుడిచి శుభ్రం చేయాలి. శ్వాస ఆడనట్లయితే రొమ్ము భాగం మీద సున్నితంగా మర్దన చేయాలి. దూడ పుట్టగానే తల్లి దాన్ని నాలుకతో నాకేలా చూడాలి. తద్వారా తల్లి-దూడకు అనుబంధం పెరగడంతోపాటు, దూడ శరీరం మీద తడి ఆరిపోతుంది. పుట్టిన దూడ అరగంట, గంటలోపే లేచి నిలబడి జున్నుపాలు తాగుతుంది. దూడ లేవలేని స్థితిలో బలహీనంగా ఉన్నట్లయితే దానిని లేపి నిలబెట్టి పాలు తాగేలా చూడాలి. జున్నుపాలు తాగిస్తే అజీర్తి చేస్తుందనుకోవడం అపోహ మాత్రమే. జున్నుపాలలో తేలి కగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్-ఏ, కెరోటిన్ ఎక్కువ శాతంలో ఉంటాయి. మలబద్ధకం లేకుండా ఇవి దోహదపడతాయి. జున్నుపాలు తాగని లేగలు, దుడ్డెలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తల్లి దగ్గర దూడకు సరిపడా జున్నుపాలు లభించకుంటే అరచెంచా ఆముదం, గ్లాసు గోరు వెచ్చని నీళ్లు, కోడి గుడ్డు పచ్చ సొన, రెండు గ్లాసుల వేడి పాలు మూడు రోజులపాటు తాగించవచ్చు. తరువాత పోతపాలు అలవాటు చేయాలి. ఈనిన వెంటనే తల్లి పశువు, దూడను చూడకుండా జాగ్రత్త పడాలి. దూడకు జున్నుపాలు జాగ్రత్తగా తాగించాలి. పాలు గోరు వెచ్చగా శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉండాలి. చల్ల టి పాలు తాగిస్తే పారుడు రోగం వస్తుంది. దూడ పుట్టిన మొదటి మూడు రోజులలో రోజుకు మూడు సార్లు జున్నుపాలు తాగించాలి. ఆ తరువాత రోజుకు రెండు సార్లు తాగించాలి. మొదటి నెలలో ప్రతిరోజు దూడ బరువులో పదోవంతుకు సమానంగా పాలు తాగిం చాలి. రెండో నెలలో పదిహేనో వంతుకు, మూడో నెలలో ఇరవయ్యో వంతుకు సమానంగా పాలు తాగించాలి. పారుడు వ్యాధి లక్షణాలు కన్పిస్తే పాలు తగ్గించి పశు వైద్యుని సలహా తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే దూడ ప్రాణాలకే ప్రమాదం. టీకాలు మరవద్దు... దూడ పుట్టగానే టింక్చర్ అయోడిన్ దూదిలో ముంచి బొడ్డుకు అద్దాలి. ధనుర్వాతం రాకుండా ఏటీఎస్ ఇంజక్షన్ వేయించాలి. పుట్టిన 10-15 రోజులలో ఏలిక పాముల మందు వేయాలి. తరువాత నెలకు ఒకసారి చొప్పున నాలుగు నెలల వయస్సు వరకు ఈ మందు కొనసాగించాలి. 6-8 వారాల వయస్సులో గాలికుంటు వ్యాధి నివారణకు టీకా ఇప్పించాలి. 35 రోజుల తరువాత బూస్టర్ డోస్,ఆ తరువాత 4 నెలలకోసారి ఈ టీకా వేయించాలి. చీడ పారుడు వ్యాధి రాకుండా 4-6 నెలల వయసులో టీకా మందు వేయించాలి. తిరిగి సంవత్సర వయస్సులో మళ్లీ టీకా వేయించాలి. ఆరు మాసాల వయసులో గొంతు వాపు నివారణ టీకా వేయించాలి. 6-12 మాసాల వయసులో జబ్బవాపు వ్యాధి నివారణకు టీకా మందు ఇప్పించాలి. షెడ్ల బయట 15 రోజులకోసారి సున్నం చల్లి కాక్సిడియోసిస్ వ్యాధి రాకుండా అదుపు చేయవచ్చును. మూడు మాసాల వయసు దాటిన తరువాత రెండు నెలలకోసారి దూడ వెంట్రుకలు కత్తిరిస్తే గోమార్లు, పేలు పట్టకుండా ఉంటాయి. -
అంగన్‌వేడి
కలెక్టరేట్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతకుముందు నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు ముందుజాగ్రత్తగా ప్రధాన ద్వారం ముందు ముళ్ల కంచెలు వేసి, అంగన్వాడీ కార్యకర్తలను నిలువరించారు. పది మంది మాత్రమే లోపలకు వెళ్లి తమ సమస్యలను అధికారులకు చెప్పుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో పది మంది అంగన్వాడీ కార్య కర్తలు డీఆర్వో రాజశేఖర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సీఐటీయూ నాయకులు రమేష్‌బాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎంతోకాలంగా సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పట్టణ ,గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు, బాలింతలకు, ఆరేళ్లలోపు పిల్లలకు సేవలందించడంలోనూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనూ అంగన్వాడీల పాత్ర కీలకమన్నారు.దళిత,గిరిజన,బడుగు,బలహీన వర్గా లు అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సేవలు ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించాలన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం సమస్యలను పరిష్కరిస్తామని గవర్నర్, సీఎం హామీ ఇచ్చారని, కానీ ఫలితంలేదన్నారు. అంగన్వాడీలను నాల్గో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు 15 వేల రూపాయల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కరువైందని, రిటైర్మంట్ బెనిపిట్స్ కల్పించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సెంటర్ అద్దెలు, బిల్లులు, టీఏ, డీఏలు ఇవ్వాలన్నారు. అమృత హస్తం బిల్లులను అంగన్వాడీల అకౌంట్లో జమ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నూర్జహన్, గోవర్ధన్, గంగాధర్, భారతి , రాజలింగం,సువర్ణ, దేవగంగుతో పాటు సుమారు రెండు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రేమజంట ముచ్చట్లు
మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆ యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఓ యువతి వస్తుంది. ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘నేను నా ప్రేమకథ’. దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్, శాస్త మీడియాపై వర్మ, పణుకు రమేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. వింగ్ కమాండర్ కేఎన్ రావు సమర్పకులు. చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్. స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ ఆవిష్కరించారు. వర్మ తనకు మంచి మిత్రుడని, తన తమ్ముణ్ణి హీరోగా చూడాలనే కోరిక అతనికి ఈ చిత్రం ద్వారా నెరవేరిందని, ఈ సినిమా విజయం సాధించాలని సి. కల్యాణ్ ఆకాంక్షించారు. అన్ని పాటలూ బాగా వచ్చాయని చిన్ని చరణ్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మంచి కథ, చక్కని పాటలతో ఈ సినిమా అన్ని వర్గాలవారినీ అలరించే విధంగా ఉంటుంది. ఓ ప్రేమ జంట ముచ్చట్లు, వారి కోపతాపాల సమాహారంతో ఈ కథ నడుస్తుంది’’ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలనుకుంటున్నామని కేఎన్ రావు తెలిపారు. శేఖర్, సుష్మా జంటగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: నగేష్ ఆచార్య. -
మీల్స్ రెడీ!
యలమంచిలిలో టీడీపీ విందు రాజకీయం తమ్ముళ్ల బుజ్జగింపునకే అధిక సమయం కేడర్‌ను కాపాడుకోవడానికి నానా తంటాలు యలమంచిలి, న్యూస్‌లైన్ : యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ విందు రాజకీయాలు ఎక్కువయ్యాయి. స్థానికేతరుడయిన పంచకర్ల రమేష్‌బాబును ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగు తమ్ముళ్లు అంగీకరించడం లేదు. పలుగ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నికల ప్రచారంకంటే వారిని బుజ్జగించడానికే పంచకర్ల అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇంతకు ముందెన్నడూ కనిపించని పంచకర్లను ఓటర్లు కూడా కొత్తగా, వింతగా చూస్తున్నారు. గ్రామాల్లోకి ఆయన వచ్చినప్పుడు స్పందన నామమాత్రంగా ఉంటోంది. ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థుల వెంట అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఇది టీడీపీ వర్గాల్లో తీవ్ర అలజడిని రేపుతోంది. నియోజకవర్గంలో 20శాతం గ్రామాల్లో కూడా పంచకర్ల ప్రచారం పూర్తిచేయలేకపోయారు. ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ స్థానికేతరులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ పరిణామంతో డబ్బు, మద్యం, విందురాజకీయాలకు ‘దేశం’ నాయకులు పెద్ద పీట వేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి మంది అనుచరులను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కార్యకర్తలకు రోజూ మద్యంతోపాటు పలావు పేకెట్లు పంపిణీతో పాటు అప్పుడప్పుడు తోటల్లో విందురాజకీయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీరోజు నియోజకవర్గంలో సుమారు 5వేల పలావు పేకెట్లు పంచుతున్నట్టు ప్రచారం సాగుతోంది. గ్రామాల్లో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాలకు, కార్యకర్తలకు ప్రత్యేక బిర్యానీ పార్శిళ్లు కూడా అందుతున్నాయన్న వాదన ఉంది. ఇక పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేస్తుండడంతో టీడీపీ కార్యాలయాలు సాయంత్రమయ్యేసరికి కిటకిటలాడుతున్నాయి. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు అధిక సంఖ్యలో మద్యం దుకాణాలు ఉండడం ఆ పార్టీకి బాగా కలిసివస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు
సీలేరు, న్యూస్‌లైన్ : డొంకరాయి జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరడంతో శుక్రవారం రాత్రి మొదటి రెండు గేట్లు ఎత్తి ఎనిమిది గంటలపాటు 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు. శుక్రవారం సాయంత్రానికి 1036.5 అడుగులకు చేరడంతో నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున మరో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామని ఎస్ఈ ఈఎల్ రమేష్‌బాబు తెలిపారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్‌ను పర్యవేక్షిస్తున్నామని, శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 1035 అడుగులకు చేరడంతో గేట్లు నిలుపుదల చేశామన్నారు. 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం ఈ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ యూనిట్ ద్వారా విడుదలైన నీరు దిగువనున్న ఖమ్మం జిల్లా కొల్లూరు రిజర్వాయర్‌లోకి రోజుకు 2,400 క్యూసెక్కులు చేరుతోంది. మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్లు మూలకు చేరడంతో మరో రెండు యూనిట్ల ద్వారా 220 మెగా వాట్లు నిరాటంకంగా విద్యుత్ తయారవుతోంది. అక్కడ విడుదలైన నీరు శబరి నదిలో కలుస్తోంది.