మీల్స్ రెడీ! | TDP party politics yalamancili | Sakshi
Sakshi News home page

మీల్స్ రెడీ!

Published Fri, May 2 2014 1:25 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

మీల్స్ రెడీ! - Sakshi

మీల్స్ రెడీ!

  • యలమంచిలిలో టీడీపీ విందు రాజకీయం
  •  తమ్ముళ్ల బుజ్జగింపునకే అధిక సమయం
  •  కేడర్‌ను కాపాడుకోవడానికి నానా తంటాలు
  •  యలమంచిలి, న్యూస్‌లైన్ : యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ విందు రాజకీయాలు ఎక్కువయ్యాయి. స్థానికేతరుడయిన పంచకర్ల రమేష్‌బాబును ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగు తమ్ముళ్లు అంగీకరించడం లేదు. పలుగ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నికల ప్రచారంకంటే వారిని బుజ్జగించడానికే పంచకర్ల అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇంతకు ముందెన్నడూ కనిపించని పంచకర్లను ఓటర్లు కూడా కొత్తగా, వింతగా చూస్తున్నారు.

    గ్రామాల్లోకి ఆయన వచ్చినప్పుడు స్పందన నామమాత్రంగా ఉంటోంది. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ  దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థుల వెంట అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఇది టీడీపీ వర్గాల్లో తీవ్ర అలజడిని  రేపుతోంది. నియోజకవర్గంలో 20శాతం గ్రామాల్లో కూడా పంచకర్ల ప్రచారం పూర్తిచేయలేకపోయారు. ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ స్థానికేతరులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ పరిణామంతో డబ్బు, మద్యం, విందురాజకీయాలకు ‘దేశం’ నాయకులు పెద్ద పీట వేస్తున్నారు.

    ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి మంది అనుచరులను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కార్యకర్తలకు రోజూ మద్యంతోపాటు పలావు పేకెట్లు పంపిణీతో పాటు అప్పుడప్పుడు తోటల్లో విందురాజకీయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీరోజు నియోజకవర్గంలో సుమారు 5వేల పలావు పేకెట్లు పంచుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

    గ్రామాల్లో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాలకు, కార్యకర్తలకు ప్రత్యేక బిర్యానీ పార్శిళ్లు కూడా అందుతున్నాయన్న వాదన ఉంది. ఇక పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేస్తుండడంతో టీడీపీ కార్యాలయాలు సాయంత్రమయ్యేసరికి కిటకిటలాడుతున్నాయి.  నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు అధిక సంఖ్యలో  మద్యం దుకాణాలు ఉండడం ఆ పార్టీకి బాగా కలిసివస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement