తక్కువలో తక్కువ! | election polling percentage | Sakshi
Sakshi News home page

తక్కువలో తక్కువ!

Published Tue, May 6 2014 11:45 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

తక్కువలో తక్కువ! - Sakshi

తక్కువలో తక్కువ!

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినా 2009 నాటి ఓటింగ్ శాతాన్ని కూడా అందుకోలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కేవలం 25 శాతం కంటే తక్కువ ఓటింగ్ జరిగింది. బూత్‌లు వారీగా ఓటింగ్ సరళిని అధికారులు సమీక్షించగా ఈ వివరాలు బయటపడ్డాయి. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌లోని 213బైఏ పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా 16.6 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 891 ఓట్లుండగా 149 మాత్రమే పోలయ్యాయి.  శేరిలింగంపల్లిలోని 266 కేంద్రంలో 19 శాతం ఓటింగ్ జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్‌లో మొత్తం 1,007 ఓట్లుంటే కేవలం 192 మాత్రమే పోలయ్యాయి. ఉప్పల్ డీఏఈ కాలనీ 81 బూత్‌లో 22.50 శాతం పోలింగ్ నమోదైంది. మేడ్చల్ నియోజకవర్గం జవహర్‌నగర్‌లోని 161, 160 పోలింగ్ కేంద్రాల్లో 25 శాతం కంటే తక్కువగా పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా అత్యధిక, అత్యల్ప పోలింగ్ నమోదైన కేంద్రాల వివరాలు కొన్ని..
 
* ఇబ్రహీంపట్నం పరిధిలోని 152 కేంద్రంలో అత్యల్పంగా 515 ఓట్లకు 169 పోలయ్యాయి. అత్యధికంగా 197 బూత్‌లో 1553 ఓట్లకు 1261 పోలయ్యాయి. 200వ కేంద్రంలో 1,410 ఓట్లకు 1,214 పోలయ్యాయి.
 
* మేడ్చల్‌లో నియోజకవర్గంలో అత్యధికంగా కేంద్రం 236 కేంద్రంలో అత్యధికంగా 1,594 ఓట్లకు 1,269, కొండాపూర్‌లోని 246 కేంద్రంలో 1,344 ఓట్లలో 1,118 ఓట్లు పోలయ్యాయి. జవహర్‌నగర్‌లో అత్యల్పంగా 161 బూత్‌లో 1,439 ఓట్లకు 358 ఓట్లయ్యాయి.
 
* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం వీకర్ సెక్షన్ కాలనీలో 168 కేంద్రంలో 1,616 ఓట్లకు  1,009 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా ఎస్.ఆర్ నాయక్‌నగర్‌లోని 194 కేంద్రంలో 133 ఓట్లకు  47 ఓట్లు పోలయ్యాయి. గాంధీనగర్ 361 బూతులో 251 ఓట్లకు 95 మాత్రమే పోలయ్యాయి.
 
* కూకట్‌పల్లి నియోజకవర్గంలో 35 కేంద్రంలో అత్యధికంగా 1చ626 ఓట్లకు 920 ఓట్లు పోలయ్యాయి. 253 బూత్‌లో 377 ఓట్లకు 205 పోలయ్యాయి. 70 కేంద్రంలో 1,065 ఓట్లకు 298 పోలయ్యాయి.
 
* మహేశ్వరం నియోజకవర్గంలో మల్లాపూర్ 168 కేంద్రంలో అత్యధికంగా 1,621 ఓట్లకు 1,178 పోలయ్యాయి. పెండ్యాల 253 కేంద్రంలో 1,376 ఓట్లలో 1,175 పోలయ్యాయి. అత్యల్పంగా బాలాపూర్‌లోని 213 కేంద్రంలో 891 ఓట్లలో 149 పోలయ్యాయి. 211 కేంద్రంలో 890 ఓట్లకు 200 పోలయ్యాయి.
* చేవెళ్ల నియోజకవర్గంలో అత్యధికంగా బుద్వేల్ 73 కేంద్రంలో 1,598 ఓట్లకు 1,341 పోలయ్యాయి. 69 కేంద్రంలో 1,233 కేంద్రంలోని 1,233 ఓట్లకు 1,092 పోలయ్యాయి. అత్యల్పంగా గగన్‌పహాడ్‌లోని 253 కేంద్రంలో 1,028 ఓట్లకు 354 పోలయ్యాయి.
 
వికారాబాద్ స్థానంలో గిర్‌గిట్‌పల్లిలోని 87 కేంద్రంలో 1,420 ఓట్లకు 1,161 పోలయ్యాయి. మదన్‌పల్లి 83 కేంద్రంలో 1,344 ఓట్లకు 1,132 పోలయ్యాయి. అత్యల్పంగా వికారాబాద్ 114 కేంద్రంలో 1,114 ఓట్లకు 369 పోలయ్యాయి.
 
* తాండూరులో అత్యల్పంగా 192 బూతులో 604 ఓట్లకు 395 పోలయ్యాయి. అత్యధికంగా 60 కేంద్రంలో 1,386 ఓట్లకు 1096 పోలయ్యాయి.
 
* ఉప్పల్‌లో చిల్కానగర్ అత్యధికంగా 309 కేంద్రంలో 1,584 ఓట్లకు 990 పోలయ్యాయి. అత్యల్పంగా డీఏఈ కాలనీ 81 కేంద్రంలో 840 ఓట్లకు 189 మాత్రమే పోలయ్యాయి.
 
* శేరిలింగంపల్లిలో అత్యధికంగా 12 బూత్‌లో 1,596 ఓట్లకు 945 పోలయ్యాయి. 386 కేంద్రంలో 1,490 ఓట్లకు 906 పోలయ్యాయి. అత్యల్పంగా 266 కేంద్రంలో 1,007 ఓట్లకు 192 పోలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement