బంద్ విజయవంతం
Published Wed, Aug 7 2013 12:42 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వర్తక సంఘం స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. సీతగుంట నుంచి మండల తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు మూతపడ్డాయి. అంబేద్కర్ కూడలిలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టి బొమ్మలను మెయిన్ రోడ్డు కూడలిలో దహనం చేశారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ సత్యనారాయణ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు వెచ్చంగి కొండయ్య, కొంటా సూర్యనారాయణ, టీడీపీ నేతలు సీకరి సన్యాసిదొర, గిరిజనోద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్రిచెట్టు అప్పారావు, ఎస్.బి.ఎల్.స్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement