
గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
నిజాంసాగర్: జిల్లాలో పలుచోట్ల మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో నిజాంసాగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్‌కు వరదనీరు పోటెత్తింది. రిజర్వాయర్ ఎగువన ఉన్న సింగితం, హన్మాజీపేట, కోనాపూర్, మొండిసడక్, గౌరారం, సర్వాపూర్, ముదెల్లి, బడాపహాడ్, లక్ష్మాపూర్, జలాల్‌పూర్ గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో వాగుల ద్వారా సింగితం రిజర్వాయర్‌లోకి వరదనీరు వస్తోంది. దీంతో రిజర్వాయర్ మూడు వరదగేట్లను ఎత్తి 1,292 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువకు మళ్లించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో రిజర్వాయర్ కుడి, ఎడమ అలుగులపై నుంచి కూడా నీరు పొంగి పొర్లుతోంది. వాగులు, వంకలు పారుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 416.55 మీటర్లకుగాను పూర్తిస్థాయి నీరుంది.
Comments
Please login to add a commentAdd a comment